సాక్షి, అమరావతి: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ సందేశం విడుదల చేశారు.
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
చదవండి: (100 శాతం ‘మద్దతు’)
త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022
Comments
Please login to add a commentAdd a comment