నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్ది మండలం మాచాపూర్లో మంగళవారం పీర్ల ఉరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. మొహర్రం పండగం సందర్భంగా పీర్లు విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతం సంభవించి ఒకరు మరణించారు. మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి పోలీసులు తెలుసుకున్నారు.