
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహర్రం ఊరేగింపు కొనసాగుతోంది. డబిల్ పుర నుంచి చార్మినార్ వరుకు జరిగే ర్యాలీ సందర్భంగా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా పోలీసులను మోహరించారు. పూర్తిస్థాయి భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని సీపీ అంజనికుమార్ తెలిపారు. ఈ ర్యాలీ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో నేడు కూడా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని వెల్లడించారు. గణేష్ నిమజ్జనాల సమయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.