
ఈషా రెబ్బా
‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగు భామ కన్నడంలో కాలు పెట్టనున్నారు. కన్నడ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యారు. శివరాజ్ కుమార్ హీరోగా లక్కీ గోపాల్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఈషా కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. కన్నడంలో వచ్చిన ఈ భారీ ఆఫర్ ఈషా కెరీర్‌కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment