దిల్లున్నోడి కథ | 'Dillunnodu' Slated For Release in | Sakshi
Sakshi News home page

దిల్లున్నోడి కథ

Published Wed, Jan 29 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

దిల్లున్నోడి కథ

దిల్లున్నోడి కథ

 అతను బాగా దిల్లున్నోడు. ఏదైనా అనుకుంటే అది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఈ నేపథ్యంతో రూపొందిన చిత్రం ‘దిల్లున్నోడు’. సాయిరామ్ శంకర్ హీరోగా ‘బంపర్ ఆఫర్’ ఫేమ్ జయరవీంద్ర దర్శకత్వంలో శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె.వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 
  ఈ సందర్భంగా నిర్మాత కె.వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. యూత్‌కి, మాస్‌కి నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ‘బంపర్ ఆఫర్’లాంటి హిట్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ వారంలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు జయ రవీంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో మొత్తం 5 పాటలున్నాయి శేఖర్‌చంద్ర సంగీతం ఆకట్టుకుంటుంది. ’’ అని చెప్పారు. జాస్మిన్, ప్రియదర్శిని ఇందులో కథానాయికలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement