
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయింది. అప్పుడెప్పుడో మార్చిలో థియేటర్లలో రిలీజైతే.. ఇన్నాళ్లకు డిజిటల్ మోక్షం కలిగిందనే చెప్పాలి. ఇంతకీ ఇది ఏ సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్.. చాన్నాళ్లుగా నటిస్తున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నారు. ఇతడి చేసిన చివరి మూవీ 'వెయ్ దరువెయ్'. మార్చి 15న థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథతో తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓటీటీలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)
దాదాపు ఏడు నెలల తర్వాత అంటే అక్టోబరు 11 నుంచి 'వెయ్ దరువెయ్' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ వీకెండ్ చూడటానికి ఓ తెలుగు సినిమా వచ్చేసిందనమాట.
'వెయ్ దరువెయ్' కథ విషయానికొస్తే నకిలీ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని యువత ఎలా అడ్డదారులు తొక్కుతున్నారనే పాయింట్‌తో సినిమా తీశారు. సాయిరామ్ శంకర్, యశ్న, సునీల్, సత్యం రాజేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?)
Get ready for a thrilling ride! 🎢 #VeyDharuvey premieres on October 11th. 🎉🍿 @YashaShivakumar @ihebahp @dirnaveenreddy @actordevaraj @LyricsShyam pic.twitter.com/2RmkYzhUFl
— ahavideoin (@ahavideoIN) October 8, 2024