సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.
శుక్రవారం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక విభిన్నమైన కథ. అడ్వొకేట్ పాత్రలో సాయిరామ్ శంకర్, పోలీసు పాత్రలో సముద్ర ఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో సాగే క్రైమ్, మిస్టరీ కథనాలతో మా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment