Saudi Arabian Football Team Makes World Record Offer For France Striker Kylian Mbappe - Sakshi
Sakshi News home page

Kylian Mbappe: ఎంబాపెకు బంపరాఫర్‌.. ఏకంగా రూ. 2,716 కోట్లు!

Published Tue, Jul 25 2023 5:48 AM | Last Updated on Tue, Jul 25 2023 10:43 AM

Saudi Team Makes Record Offer for Kylian Mbappe - Sakshi

సిడ్నీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కిలియాన్‌ ఎంబాపె కోసం సహజంగానే క్లబ్‌లు క్యూ కడతాయి. 2018 వరల్డ్‌కప్‌ను ఫ్రాన్స్‌ గెలవడంతో పాటు 2022లో తమ జట్టు ఫైనల్‌ చేరడంలో కూడా అతను కీలకపాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ఎంబాబెకు సౌదీ అరేబియా క్లబ్‌ అల్‌–హిలాల్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. అతనితో ఒప్పందం కోసం 332 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 2 వేల 716 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబాపె పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) టీమ్‌తో ఉన్నాడు. ఈ టీమ్‌తో అతను కాంట్రాక్ట్‌ పొడిగించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అల్‌–హిలాల్‌ ముందుకు వచి్చంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement