Kylian Mbappe
-
ఫ్రాన్స్‌కు బిగ్ షాక్.. ఎంబాపేకు తీవ్ర గాయం! టోర్నీ నుంచి ఔట్?
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. సోమవారం డసెల్డార్ఫ్ అరేనా వేదికగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. 90 నిమిషాల గేమ్‌లో ఫ్రాన్స్ ఒక్క గోల్ సాధించగా.. ఆస్ట్రియా మాత్రం ఒక్కగోల్ కూడా నమోదు చేయలేకపోయింది.ఫ్రాన్స్‌కు బిగ్ షాక్..ఇక ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె గాయపడ్డాడు. ఎంబాపే ముక్కుకు బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ 86వ నిమిషంలో ఎంబాపే, ఆస్ట్రియన్ ఫార్వడ్డర్ కెవిన్ డాన్సో ఇద్దరూ అనూహ్యంగా ఒకరొకరు ఢీకొన్నారు.ఈ క్రమంలో కెవిన్ డాన్సో భుజం ఎంబాపే ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే ఫిజియో వచ్చి ఎంబాపేకు చికిత్స అందించాడు. అయినప్పటకి రక్తం ఆగకపోవడంతో మైదానం నుంచి అతడిని బయటకు తీసుకువెళ్లారు. మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా.. ముక్కు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఎంబాపే గాయంపై ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అప్డేట్ ఇచ్చింది. ముక్కు ఎముక విరిగినట్లు ఎఫ్ఎఫ్ఎఫ్ సైతం ధువీకరించింది."కైలియన్ ఎంబాపే ఆస్పత్రి నుంచి తిరిగి ఫ్రెంచ్ జట్టు బేస్ క్యాంప్‌నకు తిరిగి వచ్చాడు. సోమవారం డ్యూసెల్డార్ఫ్లో జరిగిన ఆస్ట్రియా-ఫ్రాన్స్ మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో ఎంబాపే ముక్కుకు గాయమైంది. దురదృష్టవశాత్తూ అతడి ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయింది. మా కెప్టెన్‌కు తొలుత వైద్య సిబ్బంది చికిత్స అందించగా.. ఆ తర్వాతి ఆస్పత్రిలో డాక్టర్ ఫ్రాంక్ లే గాల్ పరిశీలించారు. అతడికి ముక్కు ఎముక విరిగినట్లు ఫ్రాంక్ లే నిర్ధారించాడు. అతడు కొద్ది రోజుల పాలు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు.అయితే ఎంబాపేకు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అతడు గాయం నుంచి కోలుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన మాస్క్‌ను ఇవ్వనున్నారు. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నామని ఎఫ్ఎఫ్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎంబాపే టోర్నీ మొత్తానికి దూరమైతే ఫ్రాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.🚨🇫🇷 Kylian Mbappé has just left the hospital after it was confirmed that he broke his nose.Mbappé will not undergo surgery despite initial indications, waiting to decide how to manage him for upcoming two games. pic.twitter.com/Fhbhft1OAO— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2024 -
మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ కైలియన్ ఎంబాపె ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ క్లబ్‌కు) ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబాపె కాంట్రాక్ట్ ఈ సీజన్ అనంతరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంబాపె ఏ క్లబ్లో చేరనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక సౌదీ క్లబ్ అల్ హిలాల్ ఎంబాపెకు ఏడాది కాంట్రాక్ట్ కోసం భారీగా ఆఫర్ చేసింది. అతనికి ఏకంగా 33.2 కోట్ల డాలర్లు (సుమారు రూ.2700 కోట్లు) చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఈ డీల్ ఫైనల్ చేయడానికి అల్ హిలాల్ అధికారులు మంగళవారం పారిస్‌కు వెళ్లారు. అయితే ఎంబాపె మాత్రం సంతకం కాదు కదా.. కనీసం వాళ్లను కలవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు అల్ హిలాల్ క్లబ్లో చేరే ఆసక్తి లేదని తేల్చిచెప్పాడు. వాస్తవానికి పీఎస్జీతో ఒప్పందం ముగిసిన తర్వాత ఎంబాపె కొంతకాలం ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఎంబాపె రియల్ మాడ్రిడ్ క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఫ్రీ ట్రాన్స్ఫర్ లో అతడు రియల్ మాడ్రిడ్ టీమ్ లోకి వెళ్తే 10 కోట్ల యూరోలు (సుమారు రూ.900 కోట్లు) సైనింగ్ ఆన్ ఫీగా లభిస్తాయి. ఒకవేళ పీఎస్‌జీతోనే కొనసాగాలని భావిస్తే సెప్టెంబర్ లో అతనికి బోనస్ గా 8 కోట్ల యూరోలు (సుమారు రూ.727 కోట్లు) వస్తాయి. మొదట ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడని పీఎస్జీ క్లబ్ పదేళ్ల కాలానికి గానూ దాదాపు రూ.10వేల కోట్లు ఆఫర్ చేసింది. కానీ ఎంబాపె ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో పీఎస్జీ ఎంబాపెను ఇప్పుడే వదిలేసుకొని అతనిపై కాస్త డబ్బు సంపాదించాలని చూస్తోంది. ఏడాది కాలంలో కాంట్రాక్ట్ ముగిసన తర్వాత ఫ్రీగా వదిలేయడం కంటే.. ఇదే బెటరని ఆ క్లబ్ భావిస్తోంది. ట్రాన్స్ఫర్ ఫీజుపై ప్రస్తుతానికి పీఎస్జీ, అల్ హిలాల్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. నిజానికి అల్ హిలాల్ టీమ్ గతంలో లియోనెల్ మెస్సీ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఇంటర్ మియామీ క్లబ్ రికార్డు ధరకు మెస్సీని కొనుగోలు చేసింది. దీంతో పీఎస్జీ తరపునే ఆడుతున్న ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెను అయినా దక్కించుకోవాలని ఆరాటపడింది. కానీ తాజాగా ఎంబాపె ఆఫర్‌ను తిరస్కరించడంతో అల్ హిలాల్ క్లబ్‌కు నిరాశే మిగిలింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: #KylianMbappe: 'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ క్యాచ్ విషయంలో నమ్మకం కోల్పోయిన వేళ.. గొడవకు దారి -
ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు!
సిడ్నీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కిలియాన్ ఎంబాపె కోసం సహజంగానే క్లబ్‌లు క్యూ కడతాయి. 2018 వరల్డ్‌కప్‌ను ఫ్రాన్స్ గెలవడంతో పాటు 2022లో తమ జట్టు ఫైనల్ చేరడంలో కూడా అతను కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఎంబాబెకు సౌదీ అరేబియా క్లబ్ అల్–హిలాల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతనితో ఒప్పందం కోసం 332 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 వేల 716 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) టీమ్‌తో ఉన్నాడు. ఈ టీమ్‌తో అతను కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అల్–హిలాల్ ముందుకు వచి్చంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. -
'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.కాంట్రాక్ట్ పొడిగించుకోవడానికి ఎంబాపె ఇష్టపడకపోవడంతో అతన్ని వదులుకోవాలని పీఎస్జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంబాపె వదులుకున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం అని చెప్పొచ్చు. ఎంబాపెతో బంధాన్ని కొనసాగించేందుకు పీఎస్జీ క్లబ్ అతనికి పదేళ్ల కాలానికి గానూ దాదాపు 1 బిలియన్ యూరోలు(ఇండియన్ కరెన్సీలో సుమారుగా 9వేల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎంబాపె అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ప్రస్తుతం లీగ్ వన్ క్లబ్లో ఆడుతున్న ఎంబాపెకు పీఎస్జీ తరపున ఇదే చివరి సీజన్ కానుంది. ఆ తర్వాత జరగనున్న ప్రీ-సీజన్ జపాన్ టూర్‌కు ఎంబాపె వేరే క్లబ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత పీఎస్జీ క్లబ్ ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే భారీ ఆఫర్‌ను మూటజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎంబాపె తిరస్కరించడంతో చేసేదేం లేక అతన్ని వదులుకోవడానికి సిద్ధమైంది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: Smriti Mandhana: 'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!' MLC 2023: నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్ -
ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్.. జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు. '' ఇవాళ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న కైలియన్ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. #WATCH | French football player Kylian Mbappe is superhit among the youth in India. Mbappe is probably known to more people in India than in France, said PM Modi, in Paris pic.twitter.com/fydn9tQ86V — ANI (@ANI) July 13, 2023 ఇక 2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్లో ఓడి ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్ చేశాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
Paris Saint-Germain: వరుసగా స్టార్ ఆటగాళ్లు గుడ్‌బై.. పీఎస్జీ క్లబ్లో ఏం జరుగుతోంది?
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ ఒకటి. రియల్ మాడ్రిడ్, ఎఫ్‌సీ బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తర్వాత అత్యంత క్రేజు సంపాదించుకున్న క్లబ్‌లలో సెయింట్ జెర్మన్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ క్లబ్ తరపున ఆడాలని ప్రతీ ఆటగాడు కలలు కంటాడు. అయితే దాదాపు 52 ఏళ్ల చరిత్ర కలిగిన పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్జీ) క్లబ్లో ప్రస్తుతం ఏదో జరుగుతోంది. వరసగా స్టార్ ఆటగాళ్లు ఈ చారిత్రత్మక క్లబ్‌ను వీడుతున్నారు. ఇప్పటికే పీఎస్జీ క్లబ్‌కు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, సెర్జియో రామోస్ గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపే కూడా పీఎస్జీతో తన బంధాన్ని తెంచుకున్నాడు. పీఎస్జీతో తన కాంట్రాక్ట్‌ను పొడిగించడం లేదని ఎంబాపే ప్రకటించాడు. ఇక క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఎంబాపే కీలక వాఖ్యలు చేశాడు. ఫ్రాన్స్‌లో మెస్సీకీ తగినంత గౌరవం దక్కలేదని, అందుకే అతడు తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని ఎంబాపే తెలిపాడు. ఎంబాపే చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక పీఎస్జీ క్లబ్ నుంచి బయటకు వచ్చిన మెస్సీ అమెరికాకు చెందిన మియామి క్లబ్ తరపున ఆడేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంబాపే రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మెస్సీ తప్పుకోవడంతో పీఎస్జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్(6.8కోట్లు)కి చేరింది. చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా -
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా ఎంబాపె
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్‌బాల్ జట్టు నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్చాంప్స్తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది. దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, 66 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్‌కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను యూరో 2024 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు. -
ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర..
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సంచలనం కైలియన్ ఎంబాపె చరిత్ర సృష్టించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) జట్టు తరపున ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు. శనివారం అర్థరాత్రి నాంటెస్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంబాపె ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆట (90+2వ నిమిషం) అదనపు సమయంలో గోల్ కొట్టిన ఎంబాపెకు ఇది 201వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎంబాపె పీఎస్జీ తరపున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పీఎస్జీ తరపున 200 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఎడిసన్ కవానీని వెనక్కి నెట్టిన ఎంబాపె తొలిస్థానాన్ని అధిరోహించాడు. ఎడిసన్ కవానీ 2013 నుంచి 2022 వరకు పీఎస్జీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఎంబాపె అనగానే ముందుగా గుర్తుకువచ్చేది గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022. అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకానొక దశలో ఫ్రాన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చినప్పటికి అదనపు సమయంలో మ్యాచ్ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్లో మెస్సీ సేన విజయం సాధించడం జరిగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పారిస్-సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) నాంటెస్ క్లబ్‌పై 4-2 తేడాతో విజయం సాధించింది. పీఎస్జీ తరపున మెస్సీ(12వ నిమిషం), జావెన్ హజమ్(17వ నిమిషం), డానిల్లో పెరీరా(60వ నిమిషం), కైలియన్ ఎంబాపె(90+2 వ నిమిషం)లో గోల్స్ చేయగా.. నాంటెస్ క్లబ్ తరపున లుడోవిక్ బ్లాస్(31వ నిమిషం), ఇగ్నాషియస్ గాంగో(38వ నిమిషం) గోల్స్ చేశారు. An evening for the history books! ✨❤️💙#𝐊EEP𝐌AKINGHIS𝟕ORY pic.twitter.com/eu664c1Bk0 — Paris Saint-Germain (@PSG_English) March 5, 2023 -
FIFA Football Awards : కన్నులపండువగా ఫిఫా అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్ ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్ ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6 — Messi Media (@LeoMessiMedia) February 27, 2023 -
ప్రతిష్టాత్మక అవార్డు కోసం కొదమ సింహాల్లా..
గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కలను కూడా సాకారం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రదర్శనకు గాను గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నాడు. క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు(Laureus Sport) కోసం మెస్సీ సహా వరల్డ్ గ్రేటెస్ట్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్, ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్, పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన మొండో డుప్లాంటిస్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఈ అవార్డును కొల్లగొట్టబోతున్నారనేది వేచి చూడాల్సిందే. చదవండి: క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
డిసెంబర్ 18(ఆదివారం) జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించాడు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె. మరో 10 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా రంగంలోకి దిగిన ఎంబాపె మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కదలికల్లో చిరుత కంటే వేగంతో పరిగెత్తాడు. కేవలం 97 సెకన్ల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అలా నిర్ణీత సమయంలోగా 2-2తో ఎలాంటి ఫలితం రాలేదు. అదనపు సమయంలోనూ జట్టు వెనుకబడ్డ దశలో మరో పెనాల్టీ గోల్‌తో మ్యాచ్‌ను షూటౌట్‌కు తీసుకెళ్లాడు. అందులోనూ విజయం సాధించాడు ఎంబాపె. అయితే తాను ఒక్కడే ఆడితే సరిపోదు కదా.. సహచర ఆటగాళ్లు కూడా ఆడాలి. కానీ వాళ్లు ఆడలేదు.. ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ క్షణం ఎంబాపె మొకాళ్లపై మైదానంలో కూలబడ్డాడు. స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. తాను మాత్రం నిరాశలో మునిగిపోయాడు. కానీ అతని ఆట తీరుకు ముగ్దులైన యావత్ ప్రపంచం వీరుడి పోరాటానికి సలాం కొట్టింది. ఈ తరంలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలను.. ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లుగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ప్రపంచకప్ కొట్టి మెస్సీ రొనాల్డో కంటే ఒక మెట్టు పైనున్నాడనుకోండి. అది వేరే విషయం. ఈ ఇద్దరు దిగ్గజాలు తమ చివరి వరల్డ్‌కప్‌ను దాదాపు ఆడేసినట్లే. వచ్చే వరల్డ్‌కప్ వరకు అందుబాటులో ఉంటారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌కు మరో కొత్త సూపర్‌స్టార్ కావాల్సిన అవసరం వచ్చింది. నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్ గెలవడంలో ఎంబాపెది కీలకపాత్ర. 19 ఏళ్ల వయస్సులోనే ఫిఫా టైటిల్‌ను కొల్లగొట్టిన అతను.. ఈసారి కూడా అదే ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా అర్జెంటీనాతో ఫైనల్లో ఎంబాపె ఆటతీరుకు ముచ్చటపడని వారుండరు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని 23 ఏళ్ల కుర్రాడు ఫుట్‌బాల్‌లో సంచలన ప్రదర్శన చేస్తూ ఇక వచ్చే శకం తనదేనని ప్రపంచానికి సగర్వంగా చాటాడు. మరి అంతలా పేరు సంపాదించిన ఎంబాపె అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. 23 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఎంబాపె తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే. కామెరూన్ నుంచి శరణార్థిగా పారిస్ శివారులోని బాండీకి వచ్చిన ఎంబాపె ఫుట్‌బాల్ ఆడేవాడు. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. అల్జీరియాకు చెందిన అతని భార్య ఫైజా హ్యాండ్‌బాల్ క్రీడాకారిణిగా రాణించింది. 1998లో ఫ్రాన్స్ తొలిసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ అందుకున్నప్పుడు పుట్టాడు కైలియన్ ఎంబాపె. అయితే ఎంబాపె పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టలేదు. ఇరుకు గదుల్లో ఉంటూ.. కడు పేదరికంలో పెరిగిన ఎంబాపె చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. చదువు కంటే ఆటనే ఎక్కువగా ప్రేమించిన కొడుకును చూసి సంతోషపడిన తండ్రి విల్ఫ్రైడ్ ప్రోత్సహించాడు. ఎంబాపెకు ఫుట్‌బాల్ ఆటలో ఓనమాలు నేర్పిన మొదటి గురువు కూడా అతని తండ్రే కావడం విశేషం. ఆ తర్వాత ఎంబాపెను తాను పనిచేసే ఏఎస్ బాండీ క్లబ్లో జాయిన్ చేశాడు. అలా ఫుట్‌బాల్ ఆటలో పట్టు సాధించిన ఎంబాపె రెండేళ్ల పాటు మొనాకోకు ఆడాడు. 2017 ఎంబాపె కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పారిస్ సెయింట్ జెర్మైన్తో(పీఎస్జీ) ఎంబాపెకు ఒప్పందం కుదిరింది. ఇక్కడే మెస్సీ, నెయమర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్ నుంచి ఎంబాపెకు పిలుపొచ్చినా .. పీఎస్జీకి కొనసాగడంలో ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మక్రాన్ ముఖ్య పాత్ర పోషించాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఎంబాపెకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది. అలా 2018 ఫిఫా వరల్డ్‌కప్ రానే వచ్చింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్ చేరిన ఫ్రాన్స్ విశ్వవిజేతగా అవతరించింది. 19 ఏళ్ల వయసులోనే ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన ఎంబాపె ఆ ప్రపంచకప్‌లో నాలుగు గోల్స్ కొట్టాడు. అయితే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్నీ తానై నడిపించిన ఎంబాపె ఏకంగా ఎనిమిది గోల్స్ కొట్టి గోల్డెన్ బూట్ ఎగురేసుకుపోయాడు. 23 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థి జట్లను అల్లాడిస్తూ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఎంబాపె ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందడం ఖాయం. సలాం కైలియన్ ఎంబాపె. చదవండి: మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెస్సీకి ఘనంగా వీడ్కోలు! -
Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్’ మొదలుకాగానే... గోల్స్ మోత మోగింది... సంచలనాలతో సాకర్ సంరంభం షురూ అయింది... ఫైనల్ మ్యాచ్ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్’నాక్ ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. ప్రపంచ నంబర్‌వన్ బ్రెజిల్ జిగేల్ మనలేదు... బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్’నాక్ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్ ‘షూటౌట్’లో అవుట్ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్ సంగ్రామానికి శుభంకార్డు వేసింది. అంచనాలను మించి... 29 రోజులపాటు సాగిన ఈ సాకర్ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలిచిన మొరాకో క్వార్టర్ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది. మెస్సీ ఇంకొన్నాళ్లు... 36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భవిష్యత్ ఎంబాపెదే... నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ టైటిల్ సాధించడంలో యువస్టార్ కిలియాన్ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్’లో ఫ్రాన్స్ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్మన్, కరీమ్ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ‘యునైటెడ్’లో కలుద్దాం... అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్ తొలి రౌండ్ దశకు అర్హత సాధిస్తాయి. సాక్షి క్రీడా విభాగం -
మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు
మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్‌కు అర్జెంటీనా ‘ఖతర్’నాక్ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్‌ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్ అటాక్ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. ‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్‌కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్ మాత్రం మెస్సీ మ్యాజిక్. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్ కీపర్ జట్టును సేవ్ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్‌బాట్ ప్రపంచకప్ ఫైనల్ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!) -
మెస్సీ హీరోనే.. నువ్వేమీ తక్కువ కాదు! గర్వపడేలా చేశావు! బాధపడకు..
Kylian mbappe Beats Messi Win Award: ‘‘మెస్సీ ఈ విజయానికి నూటికి నూరుపాళ్లు అర్హుడే.. అయితే, ఎంబాపే మాత్రం ఓటమికి అర్హుడు కాదు’’... ఆదివారం నాటి ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం చూసిన సగటు అభిమాని కనీసం ఒక్కసారైనా మనసులో ఈ మాట అనుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్.. విజయం అంచుల దాకా వెళ్లే వరకు అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించిందంటే అదంతా కెప్టెన్ కైలియన్ ఎంబాపే చలవే! అప్పటి దాకా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంబాపె.. రెండో అర్ధ భాగంలో ఒక్కసారిగా విజృంభించాడు. 97 సెకన్ల వ్యవధిలో చకచకా రెండు గోల్స్ చేసి అర్జెంటీనాకు షాక్ ఇచ్చి... అభిమానుల గుండె వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు సమం(2-2) చేసిన ఫ్రాన్స్ జోరు పెరిగింది. అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ను పదే పదే అటాక్ చేసింది. హోరాహోరీ పోరు.. దీంతో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరు జట్ల స్కోరు సమంగా ఉండటంతో అదనపు సమయం కేటాయించారు. అప్పటికే గోల్‌తో మెరిసిన మెస్సీ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు.. గోల్ కొట్టి అర్జెంటీనాను ముందుకు తీసుకువెళ్లాడు. తన చిరకాల కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేశాడు. కానీ, ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఎంబాపె తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ప్రేక్షకులు ఉత్కంఠతో మునివేళ్ల మీద నిల్చునేలా చేశాడు. అదనపు సమయం ముగిసే సరికి కూడా 3-3తో అర్జెంటీనా- ఫ్రాన్స్ సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. అయితే, షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో పెనాల్టీ తీసుకున్న గొంజాలో మోంటీల్ విజయవంతంగా గోల్ కొట్టడంతో ఎంబాపె బృందం ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మెస్సీ సేన వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. అంచనాలు తలకిందులు చేసి ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్రపంచకప్ సాధించాలన్న 35 ఏళ్ల మెస్సీ ఆశయం నెరవేరగా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను మరోసారి విజేతగా నిలపాలన్న 23 ఏళ్ల ఎంబాపె కల చెదిరిపోయింది. నిజానికి ఆరంభంలోనే పట్టు సాధించిన అర్జెంటీనా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించినా.. ఆ అంచనాలు తలకిందులు చేశాడు ఎంబాపె. మెస్సీని వెనక్కినెట్టి... ఏదేమైనా తాను అనుకున్న ఫలితం రాబట్టలేకపోయినా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ మెరిసిన ఎంబాపె.. మెస్సీతో పాటు తానూ హీరోనే అనిపించుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 8 గోల్స్ చేసి మెస్సీని దాటుకుని గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఫైనల్ మ్యాచ్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ఆట తీరుతో అలరించిన ఎంబాపె ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సాకర్ అభిమానులు. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) మెస్సీనే.. అయినా నువ్వేమీ తక్కువ కాదు ఎంబాపె. మెస్సీ ట్రోఫీ గెలిచి మా హృదయాలు పులకింపజేశాడు.. నువ్వు కూడా నీ పోరాటపటిమతో మా మనసులు గెలిచావు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత దిగాలుగా కూర్చున్న ఎంబాపె వద్దకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘బాధపడకు మిత్రమా.. మెస్సీ ఒక్కడే కాదు నువ్వు కూడా విజేతవే!’’ అంటూ ఎంబాపెకు విషెస్ తెలియజేస్తున్నారు. చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే.. Won our hearts #mbappe 💙🐐 pic.twitter.com/I1SAhvFPvH — Eddy Kenzo (@eddykenzoficial) December 19, 2022 What. A. Player. #mbappe pic.twitter.com/gavhNfdKrB — Piers Morgan (@piersmorgan) December 18, 2022 Mbappé is next Ronaldo, Messi whoever you support now. Only a few people support you in the journey. But when you get success they all will cheer you up. #ArgentinaVsFrance #Mbappe #WorldCupFinal pic.twitter.com/hhVjk9GuNz — Navin Depan (@DepanNavin) December 19, 2022 #EmmanuelMacron @KMbappe #Mbappe Well played and Congratulations for Golden Boot. French President @EmmanuelMacron consoled Mbappe, this shows how this country and president support and love their team. pic.twitter.com/iFlvwk4BhG — Neo007 (@neo007navin) December 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు
FIFA World Cup Qatar 2022: దాదాపు నెల రోజులుగా ఖతర్ వేదికగా సాగిన సాకర్ సమరం ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్-2022 అవార్డులు, విజేత, రన్నరప్, లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు దక్కిన ప్రైజ్‌మనీ సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం! వరల్డ్‌కప్–2022 అవార్డులు గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) లియోనల్ మెస్సీ (7 గోల్స్)- అర్జెంటీనా గోల్డెన్ బూట్ (టాప్ స్కోరర్) కైలియన్ ఎంబాపె- 8 గోల్స్- ఫ్రాన్స్ గోల్డెన్ గ్లౌవ్ (బెస్ట్ గోల్‌కీపర్) మార్టినెజ్ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్ నిలువరించాడు) బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా) మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ లియోనల్ మెస్సీ ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్లండ్ ప్రపంచకప్ విశేషాలు ►172- ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్ చొప్పున నమోదయ్యాయి. ►64- జరిగిన మ్యాచ్‌లు ►217-ఎల్లో కార్డులు ►3- రెడ్ కార్డులు ►16- టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టు (ఫ్రాన్స్) ►8- ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్ (ఇంగ్లండ్ 6, ఇరాన్ 2) ►2- టోర్నీలో నమోదైన సెల్ఫ్ గోల్స్ ►2- టోర్నీలో నమోదైన ‘హ్యాట్రిక్’లు (ఎంబాపె, గొంకాలో రామోస్) ఎవరికెంత వచ్చాయంటే... ►విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు) ►రన్నరప్: ఫ్రాన్స్ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు) ►మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు) ►నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) ►క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున) ►ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున) ►గ్రూప్ లీగ్ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున) చదవండి: FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్! Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన వీధులు.. కోల్‌కతాలోనూ సంబరాలు
FIFA WC 2022 World Champions Argentina- Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... కీలక సమయంలో స్ట్రైకర్ ఎంబాపె గోల్స్ కొట్టడం ఫ్రాన్స్ అభిమానులకు కన్నుల పండువగా ఉన్నా.. మెస్సీ నామస్మరణలో మునిగిపోయిన మిగతా ప్రపంచానికి మాత్రం మింగుడుపడలేదు. ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన లియోనల్ మెస్సీకి అంత సులువుగా గెలుపు అందనిస్తానా అన్న చందంగా.. అదనపు సమయంలోనూ అతడు కొట్టిన గోల్ ఫ్యాన్స్ గుండెదడ పెంచింది. అయితే, అందరూ కోరుకున్నట్టుగా ఎట్టకేలకు పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా పైచేయి సాధించింది. 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత ట్రోఫీని అందుకోవడమే గాకుండా మెస్సీ కీర్తికిరీటంలో ప్రపంచకప్ అనే కలికితురాయిని చేర్చింది. దీంతో మెస్సీ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మెస్సీ ట్రోఫీని ముద్దాడిన క్షణాలు చూసి వారందరి కళ్లు చెమర్చాయి. కలను సాకారం చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆనంద భాష్పాలు రాలుస్తూ.. కేరింతలు కొడుతూ అతడి విజయాన్ని ఆస్వాదించారు. కేవలం అర్జెంటీనాలోనే మాత్రమే కాదు.. మెస్సీని అభిమానించే ప్రతీ దేశంలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ మెస్సీ స్వదేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఫుట్‌బాల్ క్రీడను అభిమానించే భారత్‌లోని పశ్చిమ బెంగాల్లోనూ క్రాకర్లు పేలుస్తూ, మెస్సీ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. కోల్‌కతా వీధుల్లో డాన్సుల చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెస్సీ నామసర్మణతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. దీంతో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చదవండి: FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి #Argentina fans in one part of the city are celebrating with Jumma Chumma De De! #Kolkata’s colour scheme is anyways similar to #Argentina! #Messi𓃵 #Messi #LionelMessi𓃵 #LionelMessi #FIFAWorldCup #WorldCup pic.twitter.com/kMLXRgg9ZD — Saurabh Gupta(Micky) (@MickyGupta84) December 18, 2022 Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఎంబాపే.. రికార్డులు బద్దలుకొడుతున్నాడు!
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే, ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్‌కప్‌లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్‌ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్‌లో జన్మించాడు. బాండీలో ఫుట్‌బాల్ కేరీర్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్‌గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు. The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊 — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 -
FIFA WC Final: ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు ఎంత ; రన్నరప్‌కు ఎంత?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో.. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ సాధించి ఇటలీ, బ్రెజిల్ సరసన నిలవాలని ఫ్రాన్స్ అనుకుంటే.. అర్జెంటీనా మాత్రం మెస్సీ కోసమైన టైటిల్ గెలవాల్సిన అవసరం ఉంది. అన్నీ తానై జట్టును నడిపిస్తున్న మెస్సీనే జట్టుకు పెద్ద బలం. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. మెస్సీకి అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ కానున్న సంగతి తెలిసిందే. అందుకే ఫైనల్లో గెలిచి మెస్సీకి కప్ అందించి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని అర్జెంటీనా కోరుకుంటుంది. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా ఛాంపియన్స్‌గా నిలిచే జట్టు ఎంత ప్రైజ్‌మనీ అందుకుంటుంది.. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే జట్టు ఎంత సొంతం చేసుకుంటుదనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడోస్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మొరాకోపై గెలిచిన క్రొయేషియా రూ. 225 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టు రూ.206 కోట్లు అందుకుంది. మూడో ప్లేస్‌లో ఉన్న జట్టుకే పెద్ద మొత్తం వచ్చిందంటే.. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు కళ్లు చెదిరే మొత్తం లభించడం గ్యారంటీ. ఇక ఫిఫా వరల్డ్‌కప్ 2022 టైటిల్ విజేత రూ.368 కోట్ల ప్రైజ్‌మనీ కొల్లగొట్టనుంది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 249 కోట్లు సొంతం చేసుకోనుంది. ఇక క్వార్టర్పైనల్స్లో వెనుదిరిగిన బ్రెజిల్,నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్‌లకు రూ.141 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగిన అమెరికా, జపాన్, స్పెయిన్, సెనెగల్, పోలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సౌత్ కొరియాలకు రూ.107 కోట్ల ప్రైజ్‌మనీ అందనుంది. ఇక లీగ్ దశలో వెనుదిరిగిన జట్లకు రూ. 75 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనున్నాయి. చదవండి: చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం 'మెస్సీ కల నెరవేరాలి.. అప్పుడే మనస్పూర్తిగా నవ్వగలను' -
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కలను నెరవేర్చుకుంటాడా?.. ఇప్పుడు సగటు ఫిఫా అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నింటికి సమాధానం మరో రెండు రోజుల్లో దొరుకుతుంది. అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే. డిసెంబర్ 18న ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ జరగనుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సాకర్ సమరానికి ఈ మ్యాచ్‌తో తెరపడనుంది. మరి మెస్సీ టైటిల్ కొట్టాలన్న తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి. అయితే ఇదే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ముంగిట మరో అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీ ఇప్పటివరకు ఐదు గోల్స్ కొట్టాడు. ఎక్కువ గోల్స్ ఎవరికి కొడితే వారికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు రేసులో మెస్సీతో పాటు కైలియన్ ఎంబాపె పోటీ పడుతున్నాడు. అయితే మెస్సీకి మాత్రమే సాధ్యమయ్యే మరో రికార్డు ఎదురుచూస్తుంది. అదేంటంటే వరల్డ్‌కప్‌లో ఎక్కువ గోల్స్ కొట్టడంతో పాటు ఎక్కువ అసిస్ట్‌లు ఇచ్చిన ఆటగాడిగా నిలిచే అవకాశం మెస్సీ ముంగిట ఉంది. ఒకవేళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్లో గోల్స్‌తో పాటు అసిస్ట్ చేస్తే మాత్రం అత్యధిక గోల్స్‌తో పాటు అత్యధిక అసిస్ట్‌లు చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు మెస్సీ ఆరు మ్యాచ్‌లు కలిపి 570 నిమిషాలు ఆడి మూడు అసిస్ట్‌లు చేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికి అతని కంటే ముందున్న వారిలో ఫ్రాన్స్ స్టార్ ఆంటోని గ్రీజ్‌మెన్(467 నిమిషాలు, ఆరు మ్యాచ్‌లు, మూడు అసిస్ట్‌లు) మాత్రమే పోటీలో ఉన్నాడు. అయితే అతను ఒక్క గోల్ కూడా చేయలేదు. ఒకవేళ మెస్సీ ఒక్క అసిస్ట్ ఎక్కువగా చేస్తే మాత్రం.. అటు ఒక ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ గెలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్రలో నిలిచిపోతాడు. ఇంతకముందు 2010లో జర్మనీ ఫుట్‌బాల్ స్టార్ థామస్ ముల్లర్‌కు ఈ అవకాశం వచ్చింది. అత్యధిక గోల్స్‌తో ముల్లర్ గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ అసిస్ట్స్ విషయంలో మాత్రం కాకా(బ్రెజిల్ స్టార్) వెనకాలే ఉండిపోయాడు. ఇక అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్‌తో పాటు ఐదు అసిస్ట్స్ చేసి టాపర్‌గా ఉన్నప్పటికి.. అప్పటి ఇంగ్లండ్ స్ట్రైకర్ గారి లినేకర్ ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు కొల్లగొట్టాడు. చదవండి: FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఫ్రాన్స్ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె గోల్ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్(ఆట 5వ నిమిషం), రాండల్ కొలో మునాయ్(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్‌కు గోల్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్‌లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో ఢిపెండర్ అచ్రఫ్ హకీమిలు బయట బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్‌లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Don’t be sad bro, everybody is proud of what you did, you made history. ❤️ @AchrafHakimi pic.twitter.com/hvjQvQ84c6 — Kylian Mbappé (@KMbappe) December 14, 2022 Kylian Mbappe went straight over to console his good friend and teammate Achraf Hakimi.🤗 pic.twitter.com/IvbwKbemEu — Ben Jacobs (@JacobsBen) December 14, 2022 PSG team-mates Mbappe and Hakimi swapping shirts at the end.#Mar #fra #FIFAWorldCup pic.twitter.com/DrufStKHAV — Shamoon Hafez (@ShamoonHafez) December 14, 2022 Hugo Lloris kept his first clean sheet in #Qatar2022 to guide #LesBleus to another #FIFAWorldCup Final 📈 Relive his brilliant saves in #FRAMAR & watch @FrenchTeam go for 🏆 - Dec 18, 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/2GKLlJL6kX — JioCinema (@JioCinema) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ -
FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ(డిసెంబర్ 14న) మొరాకో, ఫ్రాన్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో డిఫెండర్ అచ్రాఫ్ హకీమిలు ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మెన్కు(పీఎస్జీ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నెలన్నర వ్యవధిలో పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒక్కటే. ఎంబాపె గోల్ కొడితే.. అచ్రాఫ్ హకీమి సెలబ్రేట్ చేయడా.. అదే విధంగా హకీమి గోల్ కొడితే ఎంబాపె సంబరం చేసుకుంటాడు. హాలిడే టూర్ వెళ్లాల్సి వస్తే ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు దేశం కోసం ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఫ్రాన్స్ తరపున ఎంబాపె.. మొరాకో తరపున అచ్రాఫ్ హకీమిలు ఎదురుపడనున్నారు. ఇంతకాలం స్నేహితులుగా ఉన్న వీళ్లలో ఎవరిరపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె ఈ వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన ఎంబాపె అత్యధిక గోల్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్ చేరింది. మరోవైపు మొరాకో మాత్రం సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూఫ్ దశలో బెల్జియంను, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్ లాంటి పటిష్టమైన జట్లకు షాక్ ఇస్తూ రోజురోజుకు మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ముందు మొరాకో ఆటలు సాగుతాయా లేక ఛాంపియన్స్‌కు మొరాకో షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొరాకో ఫైనల్ చేరితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించనుంది. చదవండి: FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్ పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి View this post on Instagram A post shared by Achraf Hakimi (@achrafhakimi) -
'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు'
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. 2018 ఫిఫా ఛాంపియన్స అయిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది ఫ్రాన్స్ జట్టు. 1958, 1962లో బ్రెజిల్ వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది. తాజాగా 60 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌కు ఆ అవకాశం వచ్చింది. మరి ఫ్రాన్స్ కప్పును నిలుపుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ కిక్‌ను మిస్ చేయడంతో.. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్పోస్టుపైకి తన్నాడు. ఇదే ఇంగ్లండ్ ఓటమికి బాటలు పరిచింది. తొలిసారి పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న హ్యారీ కేన్.. రెండోసారి విఫలం కావడంతో ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె.. పట్టరాని సంతోషంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ తర్వాత హ్యారీ కేన్‌ను చూస్తూ ఎంబాపె ఫేస్‌తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మ్యాచ్‌కే హైలైట్ గా నిలిచింది.కేవలం పెనాల్టీ కిక్ పోయినందుకే ఇంత సెలబ్రేట్ చేసుకుంటే.. ఫ్రాన్స్ ప్రపంచకప్ సాధిస్తే ఎంబాపెను ఆపడం ఎవ్వరి తరం కాదని అభిమానులు కామెంట్స్ చేశారు. ⚽️ La réaction de Mbappe suite au pénalty manqué d’Harry Kane. 🇫🇷😂#FRAANG #Qatar2022 #WorldCup2022 pic.twitter.com/Y9OMtkYoeu — MOTH🦋 (@MOTHCREW) December 10, 2022 చదవండి: Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు