అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కలను నెరవేర్చుకుంటాడా?.. ఇప్పుడు సగటు ఫిఫా అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటన్నింటికి సమాధానం మరో రెండు రోజుల్లో దొరుకుతుంది. అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే. డిసెంబర్ 18న ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ జరగనుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న సాకర్ సమరానికి ఈ మ్యాచ్‌తో తెరపడనుంది.
మరి మెస్సీ టైటిల్ కొట్టాలన్న తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి. అయితే ఇదే ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ ముంగిట మరో అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. ఈ వరల్డ్‌కప్‌లో మెస్సీ ఇప్పటివరకు ఐదు గోల్స్ కొట్టాడు. ఎక్కువ గోల్స్ ఎవరికి కొడితే వారికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు రేసులో మెస్సీతో పాటు కైలియన్ ఎంబాపె పోటీ పడుతున్నాడు. అయితే మెస్సీకి మాత్రమే సాధ్యమయ్యే మరో రికార్డు ఎదురుచూస్తుంది.
అదేంటంటే వరల్డ్‌కప్‌లో ఎక్కువ గోల్స్ కొట్టడంతో పాటు ఎక్కువ అసిస్ట్‌లు ఇచ్చిన ఆటగాడిగా నిలిచే అవకాశం మెస్సీ ముంగిట ఉంది. ఒకవేళ ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్లో గోల్స్‌తో పాటు అసిస్ట్ చేస్తే మాత్రం అత్యధిక గోల్స్‌తో పాటు అత్యధిక అసిస్ట్‌లు చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటివరకు మెస్సీ ఆరు మ్యాచ్‌లు కలిపి 570 నిమిషాలు ఆడి మూడు అసిస్ట్‌లు చేశాడు.
ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికి అతని కంటే ముందున్న వారిలో ఫ్రాన్స్ స్టార్ ఆంటోని గ్రీజ్‌మెన్(467 నిమిషాలు, ఆరు మ్యాచ్‌లు, మూడు అసిస్ట్‌లు) మాత్రమే పోటీలో ఉన్నాడు. అయితే అతను ఒక్క గోల్ కూడా చేయలేదు. ఒకవేళ మెస్సీ ఒక్క అసిస్ట్ ఎక్కువగా చేస్తే మాత్రం.. అటు ఒక ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్, అత్యధిక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ గెలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ చరిత్రలో నిలిచిపోతాడు.
ఇంతకముందు 2010లో జర్మనీ ఫుట్‌బాల్ స్టార్ థామస్ ముల్లర్‌కు ఈ అవకాశం వచ్చింది. అత్యధిక గోల్స్‌తో ముల్లర్ గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ అసిస్ట్స్ విషయంలో మాత్రం కాకా(బ్రెజిల్ స్టార్) వెనకాలే ఉండిపోయాడు. ఇక అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా 1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్‌తో పాటు ఐదు అసిస్ట్స్ చేసి టాపర్‌గా ఉన్నప్పటికి.. అప్పటి ఇంగ్లండ్ స్ట్రైకర్ గారి లినేకర్ ఆరు గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డు కొల్లగొట్టాడు.
చదవండి: FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!
Comments
Please login to add a commentAdd a comment