గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కలను కూడా సాకారం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రదర్శనకు గాను గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నాడు.
క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు(Laureus Sport) కోసం మెస్సీ సహా వరల్డ్ గ్రేటెస్ట్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్, ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్, పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన మొండో డుప్లాంటిస్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఈ అవార్డును కొల్లగొట్టబోతున్నారనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment