Laureus World Sports Award
-
జొకోవిచ్‌కు లారియస్ అవార్డు
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు. 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ‘ఉత్తమ క్రీడాకారుడు’ పురస్కారం గెల్చుకున్నాడు. జొకోవిచ్‌కు ఈ అవార్డు లభించడం ఇది ఐదోసారి. 2023లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బొన్మాటి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు అందుకుంది. -
ప్రతిష్టాత్మక అవార్డు కోసం కొదమ సింహాల్లా..
గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో లియోనల్ మెస్సీ అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కలను కూడా సాకారం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రదర్శనకు గాను గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకున్నాడు. తాజాగా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నాడు. క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే లారస్ స్పోర్ట్స్ అవార్డు(Laureus Sport) కోసం మెస్సీ సహా వరల్డ్ గ్రేటెస్ట్ క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో మెస్సీతో పాటు ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్, ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్, పోల్ వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన మొండో డుప్లాంటిస్, గోల్డెన్ స్టేట్ వారియర్స్ గార్డ్ స్టీఫెన్ కర్రీలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఈ అవార్డును కొల్లగొట్టబోతున్నారనేది వేచి చూడాల్సిందే. చదవండి: క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి' -
'స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్'గా ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్ 2022 అవార్డు గెలుచుకున్నాడు. మెన్స్ విభాగంలో వెర్స్టాపెన్.. ''వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు దక్కించుకున్నాడు. క్రికెటేతర క్రీడల నుంచి అవార్డు అందుకున్న జాబితాలో వెర్స్టాపెన్ నిలిచాడు. టైగర్‌వుడ్స్, రోజర్ ఫెదరర్, ఉసెన్ బోల్ట్ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన వెర్స్టాపెన్ ఫార్ములా వన్ నుంచి ఈ ఘనత అందుకున్న నాలుగో రేసర్‌గా నిలిచాడు. ఇంతకముందు లూయిస్ హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్, మైకెల్ షుమాకర్‌లు లారెస్ స్పోర్ట్స్ అవార్డును గెలుచుకున్నారు. ఇక మహిళల విభాగంలో జమైకన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్ హెరా.. ''లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు''ను దక్కించుకుంది. ఈమె టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టింది. టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకాను.. ''బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్'' పురస్కారాన్ని సాధించింది. ఇక ఇటలీ పరుషుల ఫుట్‌బాల్ జట్టు ''వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్''గా ఎంపికైంది. ఎలైన్ థాంప్సన్ హెరా, జమైకన్ స్ప్రింటర్ కాగా ఆదివారం(ఏప్రిల్ 24న) ఇటలీలో జరిగిన ఎమిలియా రొమానా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 63 ల్యాప్‌ల రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 32 నిమిషాల 07.986 సెకన్లలో ముగించి కెరీర్లో 22వ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చదవండి: అందరి దృష్టి సింధు, లక్ష్యసేన్ పైనే Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య 🏆 The #Laureus22 World Sportsman of the Year Award winner is @Max33Verstappen Max won his first @F1 Championship in thrilling style in 2021. The @redbullracing driver had ten Grand Prix wins during the year and a record 18 podium finishes 👏 pic.twitter.com/8QmjeyDcCr — Laureus (@LaureusSport) April 24, 2022 Blessed and Highly favored. Happy Sunday 😊. Laureus Sportswoman of the Year #history#Historybook#hiswill#myfaith#perserverance#humble#WR#patience#believe pic.twitter.com/aAEWLCR0u3 — Elaine Thompson-Herah (@FastElaine) April 24, 2022 -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్ చోప్రా.. భారత్ నుంచి మూడో ఆటగాడిగా
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మొత్తం ఏడు విభాగాల్లో వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లను లారెస్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ చేశారు. కాగా 2022 లారెస్ స్పోర్ట్స్ వరల్డ్ బ్రేక్‌త్రూ అవార్డుకు నీరజ్ చోప్రా సహా మరో ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. రష్యన్ టెన్నిస్ స్టార్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ డానియెల్ మెద్వెదెవ్, స్పానిష్ ఫుట్‌బాలర్ పెడ్రీ, బ్రిటన్ టెన్నిస్‌స్టార్ ఎమ్మా రాడుక్కాను, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్ తోపాటు ఆసీస్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్‌లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 మంది స్పోర్ట్స్ జర్నలిస్టులు ప్రతిష్టాత్మక అవార్డుకు ఏడు కేటగిరీ నుంచి ఆటగాళ్లను నామినేట్ చేశారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే నీరజ్ చోప్రా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు ఇటీవలే పద్మశ్రీ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్ కు భారత్ తరఫున ఎంపికైన మూడో అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు ఈ అవార్డు నామినేషన్స్ కు 2019లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికవ్వగా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా లారెస్ స్పోర్ట్స్ అవార్డ్ నామినేషన్స్‌కు సెలెక్ట్ అయ్యాడు. 2000–2020 కాలానికి గానూ ప్రకటించిన లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకోవడం విశేషం. A special feeling to be nominated along with some exceptional athletes for the Laureus World Breakthrough of the Year award. Congratulations to @DaniilMedwed, @pedri, @EmmaRaducanu, @TeamRojas45 and Ariarne Titmus on their nominations. #Laureus22 🇮🇳 pic.twitter.com/16pUMmvQBE — Neeraj Chopra (@Neeraj_chopra1) February 2, 2022 -
సచిన్‌ను సగర్వంగా భుజాలపై...
ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులందరి గుండె ఆనందంతో ఉప్పొంగిన రోజు... 28 ఏళ్ల తర్వాత టీమిండియా వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. నాడు విజేతగా నిలిచిన ఆ జట్టులో ఒక వ్యక్తి మాత్రం నిస్సందేహంగా అందరికంటే ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో పాల్గొన్నా విజయం అందని ద్రాక్షగా మారిపోయిన వేళ ఆరో ప్రయత్నంలో జగజ్జేత జట్టులో భాగమైన ఆ వ్యక్తి సచిన్ టెండూల్కర్. తమకు పెద్దన్నయ్యలాంటి సచిన్‌ను భారత జట్టు సభ్యులందరూ తమ భుజాలపై మోసి మైదానంలో కలియతిరిగారు. ఇప్పుడు అదే ఘట్టానికి ప్రతిష్టాత్మక ‘లారియస్’ పురస్కారం దక్కింది. బెర్లిన్: ‘సచిన్ టెండూల్కర్ ఇరవై ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోశాడు. ఇప్పుడు అతడిని మా భుజాలపై మోయడానికి మాకు ఇదే సరైన సమయం’... 2011 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. నాడు వాంఖడే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులే కాదు భారత జాతి మొత్తం ఆ క్షణాన్ని సగర్వంగా ఆస్వాదించింది. ఇప్పుడు అదే సంబరాలకు ప్రఖ్యాత క్రీడా పురస్కారం లభించింది. ‘లారియస్’ అవార్డుల్లో గత 20 ఏళ్లలో అత్యుత్తమ క్రీడా ఘట్టంగా ‘స్పోర్టింగ్ మూమెంట్’ అవార్డు లభించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, మాజీ టెన్నిస్ స్టార్ బోరిస్ బెకర్ చేతుల మీదుగా స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును అందుకున్నాడు. రెండు దశాబ్దాల ‘లారియస్ క్రీడా పురస్కారాల చరిత్ర’లో భారత్ లేదా భారత క్రీడాకారుడు ఒక అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఓటింగ్‌తో... గత ఇరవై ఏళ్లలో (2000–2020) ఇరవై అత్యుత్తమ క్రీడా ఘట్టాలను ‘లారియస్’ ముందుగా ఎంపిక చేసింది. మూడు రౌండ్ల ద్వారా విజేతను తేల్చారు. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 16 మధ్య ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు దీనికి ఓటింగ్ చేసే అవకాశం కల్పించగా... జాబితాను ముందుగా టాప్–10కు, ఆ తర్వాత టాప్–5కు కుదించి చివరకు అత్యుత్తమ క్షణాన్ని ప్రకటించారు. ఫైనల్ రౌండ్లో మిగిలిన నాలుగు నామినేషన్లను వెనక్కి నెట్టిన ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’కు అవార్డు దక్కింది. ఈ అవార్డుకు సాధారణ మ్యాచ్‌ల ఫలితాలు, స్కోర్లు తదితర అంశాలతో సంబంధం లేకుండా ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన ఘట్టాలనే ఎంపిక చేసి నామినేట్ చేశారు. ప్రపంచ కప్ గెలిచిన అనుభూతి అద్భుతం. దానిని మాటల్లో వర్ణించలేను. రెండో మాటకు తావు లేకుండా అందరూ ఒక తరహా భావనతో ఉండే ఘట్టాలు చాలా అరుదు. దేశం మొత్తం ఒకేసారి సంబరాలు చేసుకోవడం అలాంటిదే. క్రీడలు ఎంత గొప్పవో, అవి మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుంది. ఇప్పుడు కూడా ఆ క్షణాలను చూస్తూ నేను తన్మయత్వానికి లోనవుతాను. 1983లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచినప్పుడు పదేళ్ల వయసులో నా క్రికెట్ ప్రస్థానం మొదలైంది. ఆ గెలుపు ప్రత్యేకత ఏమిటో నాకు అప్పుడు తెలీదు. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి నేనూ భాగమయ్యాను. అయితే దీనికి ఏదో విశేషం ఉందని, నేను కూడా అలాంటి అనుభూతిని పొందాలని మాత్రం అనిపించింది. 22 ఏళ్లు వేచి చూసిన తర్వాత ట్రోఫీని అందుకోవడం నేనెప్పటికీ గర్వపడే క్షణం. నా దేశ ప్రజల తరఫున ఆ ట్రోఫీని పట్టుకున్నట్లు భావించాను. నాపై నెల్సన్ మండేలా ప్రభావం ఉంది. ఆయన పడిన కష్టాలు నాయకుడిగా ఎదగడంలో అడ్డు రాలేదు. మండేలా చెప్పిన ఎన్నో గొప్ప మాటల్లో క్రీడలకు ప్రతీ ఒక్కరినీ కలిపే శక్తి ఉందని చెప్పిన మాట నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు ఎంతో మంది గొప్ప అథ్లెట్లతో కలిసి కూర్చున్నాను. ఎన్ని సమస్యలు ఉన్నా అన్నీ అధిగమించి విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినవారందరికీ నా కృతజ్ఞతలు. ఈ ట్రోఫీ నా ఒక్కడిదే కాదు, మన అందరిదీ కూడా. –పురస్కారం స్వీకరించిన అనంతరం సచిన్ ప్రసంగం అవార్డు గెలుచుకోకపోయినా ‘సచిన్ క్షణం’తో పోటీ పడిన మిగిలిన నాలుగు నామినేషన్లను చూస్తే... దక్షిణాఫ్రికాకు చెందిన స్విమ్మర్ నటాలీ డు టొయిట్ 14 ఏళ్ల వయసులో కామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలు పోగొట్టుకుంది. అయితే పట్టుదలగా పోరాడిన నటాలీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు ఓపెన్ విభాగంలో (వికలాంగుల పారాలింపిక్స్‌లో కాకుండా) అర్హత పొందింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన విఖ్యాత రేసర్ మైకేల్ షుమాకర్ బాటలోనే అతని కొడుకు మిక్ కూడా రేసింగ్‌లోకి అడుగు పెట్టాడు. 2004లో జర్మన్ గ్రాండ్‌ప్రిలో షుమాకర్ విజేతగా నిలబడిన హోకెన్హీమ్ వేదిక వద్దే 15 ఏళ్ల తర్వాత నాటి కారులోనే మిక్ రేసింగ్ చేయడం ఎఫ్1 అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. 2016 కోపా సుడ్ అమెరికానా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో ‘కాపికోన్స్’ టీమ్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. 77 మందిలో 71 మంది చనిపోగా... మిగిలిన ఆరుగురిలో ముగ్గురు ఆ జట్టు ఆటగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత 50 వేల మంది పాల్గొన్న స్మారక సభలో ప్రత్యర్థి జట్టు అట్లెటికో నకోనియల్ టైటిల్‌ను ‘కాపికోన్స్’కు అందజేస్తున్నట్లు ప్రకటించింది. కొన్నాళ్లకు జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆ ముగ్గురు ఆటగాళ్లు ఫాల్మన్, రషెల్, నెటో కన్నీళ్లపర్యంతమవుతూ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికులను ఆ ఘటన కలచివేసింది. చైనాకు చెందిన జియా బోయు 1975లో తొలిసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో విఫలమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించాలని భావిస్తే క్యాన్సర్ కారణంగా అతని రెండు కాళ్లు తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత మరిన్ని సార్లు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయితే 2018లో ఎట్టకేలకు 69 ఏళ్ల వయసులో బోయు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. రెండు కాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ఎవరెస్ట్‌ను ఎక్కిన రెండో వ్యక్తిగా గుర్తింపు పొందాడు. లారియస్ ఇతర అవార్డుల విజేతల వివరాలు ►స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ద ఇయర్: లూయిస్ హామిల్టన్ (ఫార్ములావన్–బ్రిటన్), లయోనల్ మెస్సీ (ఫుట్‌బాల్–అర్జెంటీనా) ►స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్: సిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్–అమెరికా) ►వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్: దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ►వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్: ఎగాన్ బెర్నాల్ (సైక్లింగ్–కొలంబియా) ►వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్: సోఫియా ఫ్లోర్ష్ (రేసింగ్–జర్మనీ) ►స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ విత్ డిస్‌ఎబిలిటీ: ఒక్సానా మాస్టర్స్ (పారా రోయింగ్–అమెరికా) ►యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్: కోయి కిమ్ (స్నో బోర్డింగ్–అమెరికా) ►స్పోర్ట్ ఫర్ గుడ్: సౌత్ బ్రాంక్స్ యునైటెడ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్: డర్క్ నొవిట్జీ (బాస్కెట్‌బాల్–జర్మనీ) ►అకాడమీ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్: స్పానిష్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ -
యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్
‘ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం’ ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం అంతా ఊరేగిన సందర్భంలో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి ఆరోజు పలికిన మాటలు ఇవి. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసిన యావత్ ప్రపంచం ఆనందభాష్పాలకు లోనయింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని సెల్యూట్ చేశాడు. తాజాగా లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు కూడా ఆ అరుదైన ఘట్టానికి సలాం చేసింది. బెర్లిన్: టీమిండియా దిగ్గజ ఆటగాడు, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డు మాస్టర్ బ్లాస్టర్‌ను వరించింది. బెర్లిన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నాడు. గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం పోటీ నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఈ పోటీలో 19 మంది పోటీ పడగా అత్యధిక ఓట్లు రావడంతో సచిన్ విజేతగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం తర్వాత సచిన్‌ను సహచర ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా ఊరేగించారు. క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నేషన్ (దేశాన్ని భుజాలపై ఊరేగించారు) అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించారు. ఈ మూమెంట్‌కే ప్రస్తుతం అవార్డు దక్కింది. కాగా, 2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారస్ ప్రారంభించింది. గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో బెస్ట్ మూమెంట్‌ను ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డు సచిన్‌కు రావడం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తోంది. చదవండి: ఈ సారథ్యం నాకొద్దు! ఆడకుండా.. నన్ను కిడ్నాప్ చేశారు -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో 2011 ప్రపంచకప్ ఫైనల్
లండన్: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరచిపోలేని తేదీ. 28 ఏళ్ల తర్వాత మన టీమ్ మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముఖ్యంగా సీనియర్ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. అంతకుముందు సచిన్ ఆడిన ఐదు ప్రపంచకప్‌లు నిరాశను మిగిల్చగా... ఆరో ప్రయత్నంలో అతను విశ్వ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. నాడు జట్టు సహచరులు అతడిని తమ భుజాలపై మోసి వాంఖడే మైదానంలో ఊరేగించారు. ఇప్పుడు అదే క్షణం ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుల రేసులో నిలిచింది. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్ చేశారు. టీమిండియా గెలిచిన క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్ ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అని టైటిల్ పెట్టింది. విజేతను తేల్చేందుకు పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 17న బెర్లిన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో లారెస్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటిస్తారు. -
జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు
బెర్లిన్: ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు నొవాన్ జొకోవిచ్‌కు ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు దక్కింది. ‘స్టోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ విభాగంలో తను వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కించుకోగా ఓవరాల్‌గా మూడోది. గతేడాది తను ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను సాధించడంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఐదోసారి నామినేట్ అయినా అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఇక మహిళల విభాగంలో ‘స్పోర్ట్స్‌వుమెన్ ఆఫ్ ద ఇయర్’గా సెరెనా విలియమ్స్ నిలిచింది. 2015లో తను మూడు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గింది. తనకు కూడా ఇది మూడో అవార్డు. అయితే ఈ కార్యక్రమానికి సెరెనా హాజరుకాలేదు. వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆల్ బ్లాక్స్ (కివీస్ రగ్బీ జట్టు) అవార్డు దక్కించుకోగా... జీవిత సాఫల్య పురస్కారాన్ని మూడుసార్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా అందుకున్నారు.