జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు | Djokovic, Serena Laureus Sports Awards | Sakshi
Sakshi News home page

జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు

Published Wed, Apr 20 2016 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

జొకోవిచ్, సెరెనాలకు  లారెస్ స్పోర్ట్స్ అవార్డులు

జొకోవిచ్, సెరెనాలకు లారెస్ స్పోర్ట్స్ అవార్డులు

బెర్లిన్:  ప్రపంచ టెన్నిస్ నంబర్ వన్ ఆటగాడు నొవాన్ జొకోవిచ్‌కు ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు దక్కింది. ‘స్టోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ విభాగంలో తను వరుసగా రెండో ఏడాది ఈ అవార్డు దక్కించుకోగా ఓవరాల్‌గా మూడోది. గతేడాది తను ఆస్ట్రేలియన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లను సాధించడంతో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఐదోసారి నామినేట్ అయినా అవార్డు దక్కించుకోలేకపోయాడు.

ఇక మహిళల విభాగంలో ‘స్పోర్ట్స్‌వుమెన్ ఆఫ్ ద ఇయర్’గా సెరెనా విలియమ్స్ నిలిచింది. 2015లో తను మూడు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గింది. తనకు కూడా ఇది మూడో అవార్డు. అయితే ఈ కార్యక్రమానికి సెరెనా హాజరుకాలేదు. వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆల్ బ్లాక్స్ (కివీస్ రగ్బీ జట్టు) అవార్డు దక్కించుకోగా... జీవిత సాఫల్య పురస్కారాన్ని మూడుసార్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement