![Kylian Mbappe Wins Golden Boot In FIFA World Cup 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/19/golden-boot.jpg.webp?itok=k8Z63SrN)
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది.
అయితే, ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్‌కప్‌లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్‌ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్‌లో జన్మించాడు. బాండీలో ఫుట్‌బాల్ కేరీర్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్‌గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు.
The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
Comments
Please login to add a commentAdd a comment