FIFA World Cup 2022: Full List Of Award Winners, Prize Money And Other Details - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు

Published Mon, Dec 19 2022 9:07 AM | Last Updated on Mon, Dec 19 2022 4:02 PM

FIFA WC 2022: List Of Award Winners Prize Money And Other Details - Sakshi

గోల్డెన్‌ బూట్‌ విజేత ఫ్రాన్స్‌ కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపె (FIFA World Cup)

FIFA World Cup Qatar 2022: దాదాపు నెల రోజులుగా ఖతర్‌ వేదికగా సాగిన సాకర్‌ సమరం ముగిసింది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించిన అర్జెంటీనా జగజ్జేతగా నిలిచింది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సారథ్యంలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌-2022 అవార్డులు, విజేత, రన్నరప్‌, లీగ్‌ దశలో నిష్క్రమించిన జట్లకు దక్కిన ప్రైజ్‌మనీ సహా ఇతర విశేషాలు తెలుసుకుందాం! 

వరల్డ్‌కప్‌–2022 అవార్డులు 
గోల్డెన్‌ బాల్‌ (బెస్ట్‌ ప్లేయర్‌) 
లియోనల్‌ మెస్సీ (7 గోల్స్‌)- అర్జెంటీనా 

గోల్డెన్‌ బూట్‌ (టాప్‌ స్కోరర్‌) 
కైలియన్‌ ఎంబాపె- 8 గోల్స్‌- ఫ్రాన్స్‌

గోల్డెన్‌ గ్లౌవ్‌ (బెస్ట్‌ గోల్‌కీపర్‌) 
మార్టినెజ్‌ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్‌ నిలువరించాడు) 

బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌ 
ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా) 

మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ 
లియోనల్‌ మెస్సీ 

ఫెయిర్‌ ప్లే అవార్డు 
ఇంగ్లండ్‌  

ప్రపంచకప్‌ విశేషాలు 
►172- ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్‌ చొప్పున నమోదయ్యాయి.  
►64- జరిగిన మ్యాచ్‌లు 
►217-ఎల్లో కార్డులు 
►3- రెడ్‌ కార్డులు 
►16- టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్టు (ఫ్రాన్స్‌) 
►8- ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్‌      (ఇంగ్లండ్‌ 6, ఇరాన్‌ 2) 
►2- టోర్నీలో నమోదైన సెల్ఫ్‌ గోల్స్‌ 
►2- టోర్నీలో నమోదైన ‘హ్యాట్రిక్‌’లు (ఎంబాపె, గొం​కాలో రామోస్‌) 

ఎవరికెంత వచ్చాయంటే... 
విజేత: అర్జెంటీనా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు) 
రన్నరప్‌: ఫ్రాన్స్‌ -3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు) 
మూడో స్థానం: క్రొయేషియా -2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు) 

నాలుగో స్థానం: మొరాకో -2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) 
క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) -కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున) 
ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) -కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున) 
గ్రూప్‌ లీగ్‌ దశలో నిష్క్రమించిన జట్లకు (16) -90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున)   

చదవండి: FIFA WC 2022: వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్‌!
Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్‌కతాలోనూ సంబరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement