golden boot
-
గోల్డెన్ బూట్ గెలుచుకున్న ఎంబాపే.. రికార్డులు బద్దలుకొడుతున్నాడు!
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా గెలిచి కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే, ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే.. తన సత్తా మరోసారి నిరూపించుకున్నాడు. ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపే ప్రయత్నం చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ఎంబాపే.. హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో, వరల్డ్‌కప్‌లో అధికంగా ఎనిమిది గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో, గోల్డెన్ బూట్‌ను అందుకున్నాడు. కాగా, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కైలియన్ ఎంబాపే.. 20 డిసెంబర్ 1998లో పారిస్‌లో జన్మించాడు. బాండీలో ఫుట్‌బాల్ కేరీర్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో 18 సంవత్సరాల వయస్సులో 2017లో ఫ్రాన్స్ తరపున అరంగేట్రం చేసాడు. 2018 ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్ కొట్టి ఎంబాపే అతి పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే తర్వాత స్కోర్ చేసిన రెండవ యంగ్ ప్లేయర్‌గా ఎంబాపే రికార్డుల్లోకి ఎక్కాడు. ఫ్రాన్స్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో ఎంబాపే.. రెండో అత్యధిక గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, ఫిఫా వరల్డ్ కప్ బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫ్రెంచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంబాపే తన మార్క్ ఆటతో ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాడు. ఫ్రాన్స్ విజయాల్లో కీలక పాత్ర కీలక పాత్ర పోషించాడు. The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022's top goalscorer 📊 — FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022 -
మెస్సీకి గోల్డెన్ బాల్, రోడ్రిగ్జ్‌కు గోల్డెన్ బూటు
అర్జెంటీనా ఫైనల్లో ఓడిపోయినా.. గోల్డెన్ బాల్ మాత్రం ఏస్ క్రీడాకారుడు, ఆ టీమ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీకే దక్కింది. 2014 ఫిఫా వరల్డ్ కప్‌కు గాను గోల్డెన్ బూట్ అవార్డును జేమ్స్ రోడ్రిగ్జ్ గెలుచుకున్నాడు. మార్కానా స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతుల్లో ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా 0-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయినా.. టోర్నమెంటు మొత్తమ్మీద అతడే మంచి ప్లేయర్ అని ఓటర్లంతా భావించారు. దాంతో గోల్డెన్ బాల్ అతడికే దక్కింది. జట్టు ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌లలోనూ పాల్గొన్న మెస్సీ (27) నాలుగు గోల్స్ కొట్టాడు. ఈ అవార్డుకు పోటీపడినవారిలో అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), నెయ్మార్ (బ్రెజిల్), జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), థామస్ ముల్లర్ (జర్మనీ) ఉన్నారు. ఇక కొలంబియా జట్టుకు ఆరు గోల్స్ అందించిన రోడ్రిగ్జ్ గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. ఇక ఐదు గోల్స్ చేసిన థామస్ ముల్లర్ వెండి బూటు గెలుచుకున్నాడు. టోర్నమెంటు మొత్తమ్మీద కేవలం నాలుగంటే నాలుగేసార్లు గోల్స్ ఇచ్చిన జర్మన్ గోల్ కీపర్ మాన్యుయెల్ నూయెర్ గోల్డెన్ గ్లోవ్ దక్కించుకున్నాడు. అవార్డుల జాబితా ఇలా ఉంది.. గోల్డెన్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), సిల్వర్ బాల్: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బాల్: అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్) గోల్డెన్ బూటు: జేమ్స్ రోడ్రిగ్జ్ (కొలంబియా), సిల్వర్ బూటు: థామస్ ముల్లర్ (జర్మనీ), బ్రాంజ్ బూటుష్ట్ర నెయ్మార్ (బ్రెజిల్) గోల్డెన్ గ్లోవ్: మాన్యుయెల్ నూయెర్ (జర్మనీ) యంగ్ ప్లేయర్ అవార్డు: పాల్ పోగ్బా (ఫ్రాన్స్) ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: కొలంబియా -
ఈ బూటు ఎవరి వశమో ?