ప్రపంచకప్ సాధించిన లియోనల్ మెస్సీ
FIFA WC 2022 World Champions Argentina- Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... కీలక సమయంలో స్ట్రైకర్ ఎంబాపె గోల్స్ కొట్టడం ఫ్రాన్స్ అభిమానులకు కన్నుల పండువగా ఉన్నా.. మెస్సీ నామస్మరణలో మునిగిపోయిన మిగతా ప్రపంచానికి మాత్రం మింగుడుపడలేదు. ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన లియోనల్ మెస్సీకి అంత సులువుగా గెలుపు అందనిస్తానా అన్న చందంగా.. అదనపు సమయంలోనూ అతడు కొట్టిన గోల్ ఫ్యాన్స్ గుండెదడ పెంచింది.
అయితే, అందరూ కోరుకున్నట్టుగా ఎట్టకేలకు పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది. 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత ట్రోఫీని అందుకోవడమే గాకుండా మెస్సీ కీర్తికిరీటంలో ప్రపంచకప్ అనే కలికితురాయిని చేర్చింది. దీంతో మెస్సీ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
మెస్సీ ట్రోఫీని ముద్దాడిన క్షణాలు చూసి వారందరి కళ్లు చెమర్చాయి. కలను సాకారం చేసుకున్న ఈ దిగ్గజ ఆటగాడి భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఆనంద భాష్పాలు రాలుస్తూ.. కేరింతలు కొడుతూ అతడి విజయాన్ని ఆస్వాదించారు. కేవలం అర్జెంటీనాలోనే మాత్రమే కాదు.. మెస్సీని అభిమానించే ప్రతీ దేశంలోనూ సంబరాలు అంబరాన్నంటాయి.
స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ మెస్సీ స్వదేశంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఫుట్‌బాల్ క్రీడను అభిమానించే భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లోనూ క్రాకర్లు పేలుస్తూ, మెస్సీ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. కోల్‌కతా వీధుల్లో డాన్సుల చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెస్సీ నామసర్మణతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. దీంతో అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
చదవండి: FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
#Argentina fans in one part of the city are celebrating with Jumma Chumma De De! #Kolkata’s colour scheme is anyways similar to #Argentina! #Messi𓃵 #Messi #LionelMessi𓃵 #LionelMessi #FIFAWorldCup #WorldCup pic.twitter.com/kMLXRgg9ZD
— Saurabh Gupta(Micky) (@MickyGupta84) December 18, 2022
Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022
Comments
Please login to add a commentAdd a comment