
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. 2018 ఫిఫా ఛాంపియన్స అయిన ఫ్రాన్స్ వరుసగా రెండోసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది ఫ్రాన్స్ జట్టు. 1958, 1962లో బ్రెజిల్ వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది. తాజాగా 60 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌కు ఆ అవకాశం వచ్చింది. మరి ఫ్రాన్స్ కప్పును నిలుపుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ కిక్‌ను మిస్ చేయడంతో.. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆట 84వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ బంతిని గోల్‌పోస్టుపైకి తన్నాడు. ఇదే ఇంగ్లండ్ ఓటమికి బాటలు పరిచింది.
తొలిసారి పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న హ్యారీ కేన్.. రెండోసారి విఫలం కావడంతో ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె.. పట్టరాని సంతోషంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ తర్వాత హ్యారీ కేన్‌ను చూస్తూ ఎంబాపె ఫేస్‌తో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ మ్యాచ్‌కే హైలైట్ గా నిలిచింది.కేవలం పెనాల్టీ కిక్ పోయినందుకే ఇంత సెలబ్రేట్ చేసుకుంటే.. ఫ్రాన్స్ ప్రపంచకప్ సాధిస్తే ఎంబాపెను ఆపడం ఎవ్వరి తరం కాదని అభిమానులు కామెంట్స్ చేశారు.
⚽️ La réaction de Mbappe suite au pénalty manqué d’Harry Kane. 🇫🇷😂#FRAANG #Qatar2022 #WorldCup2022
— MOTH🦋 (@MOTHCREW) December 10, 2022
pic.twitter.com/Y9OMtkYoeu