దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్‌ను గోల్‌పోస్ట్‌లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్‌మన్ క్రాస్ షాట్‌ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు.
ప్రపంచకప్‌లో నేడు
జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి
బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి
క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి
జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
Published Sun, Nov 27 2022 5:24 AM | Last Updated on Sun, Nov 27 2022 9:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment