pre quarter-final
-
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–13తో నూర్ మొహమ్మద్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జంటపై విజయం సాధించింది.పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. భారత రైజింగ్ స్టార్, ప్రపంచ 84వ ర్యాంకర్ మైస్నం మిరాబా లువాంగ్ వరుస గేముల్లో ప్రణయ్‌ను ఓడించి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు.55 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో మిరాబా 21–19, 21–18తో ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన కిరణ్ జార్జి, సతీశ్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కిరణ్ 15–21, 21–13, 17–21తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో... సతీశ్ 13–21, 17–21తో జేసన్ గుణవన్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు.అష్మిత మినహా...మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి ఐదుగురు బరిలోకి దిగగా... అష్మిత మినహా మిగతా నలుగురు ఉన్నతి హుడా, సామియా, మాళవిక, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అష్మిత 19–21, 21–15, 21–14తో ఎస్తర్ నురిమి (ఇండోనేసియా) పై గెలిచింది. ఉన్నతి 21–14, 14–21, 19–21తో లియాన్ టాన్ (బెల్జియం) చేతిలో, సామియా 13–21, 13–21తో గావో ఫాంగ్ జి (చైనా) చేతిలో ... మాళవిక 11–21, 10–21తో హాన్ యువె (చైనా) చేతిలో, ఆకర్షి 13–21, 8–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
నెంబర్‌వన్‌కు షాకిచ్చిన వింబుల్డన్ ఛాంపియన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా మహిళల టెన్నిస్ నెంబర్ వన్ ఇగా స్వియాటెకు షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కజకిస్తాన్ సంచలనం.. 23వ ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ ఎలెనా రైబాకినా చేతిలో 6-4, 6-4 వరుస సెట్లలో ఖంగుతింది. గంటన్నర పోరులో స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని రైబాకినా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌కు చేరడం రైబాకినాకు ఇదే తొలిసారి. కాగా స్వియాటెక్ ఇప్పటివరకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో రెండు ఫ్రెంచ్ ఓపెన్ కాగా.. మరొకటి యూఎస్ ఓపెన్ ఉంది. కాగా స్వియాటెక్ గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. Letting her racquet do the talking 🤫 🇰🇿 Elena Rybakina • @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/o42uktZv5v — #AusOpen (@AustralianOpen) January 22, 2023 చదవండి: 'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా' -
‘మిక్స్డ్’ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ
తన కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ్రస్టేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా–రోహన్ బోపన్న (భారత్) జోడీ 7–5, 6–3తో జైమీ ఫోర్లిస్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయంపై నెగ్గింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–బోపన్న ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. జీవన్–బాలాజీ ద్వయం సంచలనం చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత డబుల్స్ జోడీ జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జీవన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–6 (8/6), 2–6, 6–4తో ఐదో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
FIFA World Cup Qatar 2022: నాకౌట్‌కు దక్షిణ కొరియా
దోహా: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైన దక్షిణ కొరియా ఈసారి సత్తా చాటింది. కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో చెలరేగి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్‌తో జరిగిన గ్రూప్ ‘హెచ్’ పోరులో కొరియా 2–1తో గెలిచింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే హోర్టా గోల్ సాధించి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే కొరియా తరఫున 27వ నిమిషంలో కిమ్ యంగ్ గ్వాన్ గోల్ చేసి స్కోరును సమం చేయగా...మ్యాచ్ చివర్లో వాంగ్ హీ చాన్ చేసిన అద్భుతమైన కౌంటర్ అటాక్ గోల్ (90+1వ నిమిషంలో)తో కొరియా దూసుకుపోయింది. గ్రూప్‌లో ఈ మ్యాచ్‌కు ముందే 2 విజయాలు సాధించి నాకౌట్ చేరిన పోర్చుగల్‌తో పాటు రెండో జట్టుగా కొరియా ముందంజ వేసింది. ఘనాతో మ్యాచ్ ముగిశాక రిఫరీతో వాగ్వాదం చేసినందుకు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటుకు గురైన కొరియా కోచ్ పౌలో బెంటో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోని చూశారు. చదవండి: Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెస్సీకి అగ్ని పరీక్ష.. పోలాండ్ చేతిలో ఓడితే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బుధవారం అగ్నిపరీక్ష ఎదుర్కోనుంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అర్జెంటీనా కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్ అని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్‌కు చేరాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే గ్రూప్-సిలో అర్జెంటీనా సహా మిగతా అన్ని జట్లకు కూడా రౌండ్ ఆఫ్-16 అవకాశాలున్నాయి. అయితే చివరకు రెండు జట్లు మాత్రమే ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. మరి ఆ రెండు జట్లు ఏవి అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా, పోలాండ్‌కు ఎంత అవకాశం? ►బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. ►ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్ డ్రా కావాలి. సౌదీ అరేబియా, మెక్సికో ►సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి. అయితే సౌదీ అరేబియాతో పోలిస్తే మెక్సికోకు నాకౌట్ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రీ క్వార్టర్స్ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సిందే. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతుల్లో ఓడడం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పటికే బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లాంటి జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్-ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, అమెరికాలు ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. చదవండి: Lionel Messi: ఒక్క మ్యాచ్.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు పంత్‌కు గాయం.. బంగ్లా టూర్‌కు దూరం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్‌ను గోల్‌పోస్ట్‌లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్మన్ క్రాస్ షాట్‌ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు. ప్రపంచకప్‌లో నేడు జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
World TT Championship: ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో మానవ్ ఠక్కర్ 6–11, 8–11, 8–11తో అలెక్సిస్ చేతిలో... రెండో మ్యాచ్‌లో సత్యన్ 4–11, 2–11, 6–11తో ఫెలిక్స్ లెబ్రున్ చేతిలో... మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 13–11, 11–13, 11–7, 8–11, 7–11తో జులెస్ రొలాండ్ చేతిలో ఓడిపోయారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక జర్మనీ, ఫ్రాన్స్, భారత్ ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం మొత్తం ఏడు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లకు మిగతా రెండు బెర్త్‌లు లభిస్తాయి. ముఖాముఖి ఫలితాల ఆధారంగా గ్రూప్– 2 నుంచి జర్మనీ, ఫ్రాన్స్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందాయి. మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చైనాతో భారత పురుషుల జట్టు... చైనీస్ తైపీతో భారత మహిళల జట్టు తలపడతాయి. చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..! -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్ కథ ముగిసింది
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ కథ ముగిసింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో చేతిలో నాదల్.. 6-4, 4-6, 6-4, 6-3తో దారుణ పరాజయం చవిచూశాడు. ఇక కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నాదల్కు ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో నాదల్కు ఎదురైన తొలి ఓటమి ఇదే. కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన నాదల్ పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు, 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో 6-4,4-6,6-4,6-3 స్కోరుతో నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించాడు.పేలవ సర్వీసులు, రిటర్న్ లతో నిరాశ పరిచాడు. తొలి సెట్ నే కోల్పోయిన రఫెల్ రెండో సెట్ గెలిచి స్కోరు సమం చేశాడు. కానీ, తర్వాతి రెండు సెట్లలో తేలిపోయాడు. దాంతో, ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేస్తూ విజయం సాధించిన టియఫో తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ డానిల్ మెద్వెదెవ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో క్వార్టర్స్ కు ముందే ఇద్దరు టాప్ సీడ్ ఆటగాళ్లు ఇంటిదారి పట్టినట్టయింది. ఫ్రాన్సిస్ రికార్డ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆండీ రాడిక్, జేమ్స్ బ్లేక్‌లు మాత్రమే నాదల్‌ను ఓడించారు. ఇక ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఫ్రాన్సీస్ (24) గుర్తింపు సాధించాడు. నాదల్ ను ఓడించడం సంతోషంగా ఉందని ఫ్రాన్సిస్ టోయాఫే తెలిపాడు. నాదల్ ను ఓడించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. నాదల్ టెన్నిస్ లెజెండ్ అని..అతన్ని ఓడించానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. Have a moment Frances Tiafoe!#USOpen pic.twitter.com/egoIVDoRWh — US Open Tennis (@usopen) September 5, 2022 చదవండి: FIH Nations Cup: నేషన్స్ కప్ బరిలో భారత హాకీ జట్టు US Open 2022: మెద్వెదెవ్కు చుక్కెదురు -
US Open 2022: ఎదురులేని నాదల్
న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో విజయం సాధించేందుకు చెమటోడ్చిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మూడో రౌండ్లో మాత్రం రఫ్ఫాడించాడు. తన చిరకాల ప్రత్యర్థి రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం చలాయించి అతనిపై వరుసగా 18వ విజయం సాధించాడు. తద్వారా టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో నాదల్ 11వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 91వ ర్యాంకర్ రిచర్డ్ గాస్కేతో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ 6–0, 6–1, 7–5తో అలవోకగా గెలుపొందాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన నాదల్ 24 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫోతో ఆడతాడు. మూడో రౌండ్లో టియాఫో 7–6 (9/7), 6–4, 6–4తో 14వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–3, 6–3తో జెన్సన్ బ్రూక్స్‌బై (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 2–6, 6–7 (3/7), 6–4, 7–6 (10/7)తో షపోవలోవ్ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 6–3, 6–4తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–7 (6/8), 6–0తో యు యువాన్ (చైనా)పై, డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 7–6 (11/9)తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)పై, పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–3, 7–6 (12/10)తో తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్)పై, అజరెంకా (బెలారస్) 6–3, 6–0తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 5–7, 6–4, 6–3తో 13వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. -
BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం
తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తిస్తానని భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరూపించాడు. ఎంతో ప్రతిభ ఉన్నా.. తరచూ గాయాల బారిన పడుతూ... ఆశించినన్ని విజయాలు అందుకోలేకపోయిన ఈ కేరళ ప్లేయర్ అడపాదడపా అద్భుత విజయాలతో అలరిస్తుంటాడు. తాజాగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రణయ్ పెను సంచలనం సృష్టించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన జపాన్ స్టార్ కెంటో మొమోటాను ప్రణయ్ వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. గత సంవత్సరం రజత పతకం నెగ్గిన భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. టోక్యో: అత్యున్నత వేదికపై అద్భుత ఆటతీరుతో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ కేరళ ఆటగాడు సంచలన విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2018, 2019 ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)పై ప్రణయ్ వరుస గేముల్లో గెలిచి ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–16తో కెంటో మొమోటాను ఓడించాడు. గతంలో మొమోటాతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఎనిమిదో ప్రయత్నంలో విజయం సాధించడం విశేషం. మొమోటాతో 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ 4–4తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయిన ప్రణయ్ మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 10–5తో ముందంజ వేశాడు. ఇదే దూకుడును కొనసాగిస్తూ ప్రణయ్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో ప్రణయ్ 1–4తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ప్రణయ్ స్కోరును సమం చేశాడు. అనంతరం 8–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మొమోటాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ప్రణయ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్య సేన్ 36 నిమిషాల్లో 21–17, 21–10తో లూయిస్ ఎన్రిక్ పెనాల్వర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ అవుట్... గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ఈసారి మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 17–21తో ఓడిపోయాడు. పోరాడి ఓడిన శిఖా–అశ్విని జోడీ మహిళల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం బరిలోకి దిగిన నాలుగు భారత జోడీలు రెండో రౌండ్లోనే నిష్క్రమించాయి. శిఖా గౌతమ్–అశ్విని భట్ 5–21, 21–18, 13–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ కిమ్ సో యోంగ్–కాంగ్ హి యోంగ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 15–21, 10–21తో టాప్ సీడ్ చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ (చైనా) చేతిలో... దండు పూజ–సంజన 15–21, 7–21తో మూడో సీడ్ లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 8–21, 17–21తో పదో సీడ్ పియర్లీ తాన్–థినా మురళీధరన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. ధ్రువ్–అర్జున్ జోడీ అద్భుతం పురుషుల డబుల్స్‌లో భారత రెండు జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ ద్వయం 21–17, 21–16తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–8, 21–10తో సోలిస్ జొనాథన్–అనిబెల్ మార్క్విన్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జెప్ బే–లాసి మోల్డే (డెన్మార్క్)లతో సాత్విక్–చిరాగ్... హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ (సింగపూర్)లతో అర్జున్–ధ్రువ్ ఆడతారు. -
బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర.. కొడుకుతో కలిసి తల్లి ప్రపంచ రికార్డు
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని కొందరు అంటారు. వయసు ఎక్కువైతే ఆట ఆడొద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఎలాంటి ఆటైనా సరే వయసుతో సంబంధం ఉండదు(క్రికెట్, ఫుట్‌బాల్ లాంటివి మినహాయిస్తే). 99 ఏళ్ల వయసులోనూ కొందరు తాతలు, బామ్మలు పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల మహిళా ప్లేయర్ స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె జత కట్టింది ఎవరితో తెలుసా.. తన కన్నకొడుకు మిషా జిల్బర్మన్. అవునండీ స్వెత్లానా, మిషా జిల్బర్మన్లు తల్లి కొడుకు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్మన్ ద్వయం.. ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లి కొడుకు పోగొట్టుకున్నప్పటికి.. మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. ఇక 64 ఏళ్ల స్వెత్లానా.. ఆమె కొడుకు మిషా జిల్బర్మన్ను బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు అభినందనల్లో ముంచెత్తారు. ''64 ఏళ్ల వయసులో స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్‌లో మరో విజయాన్ని సాధించింది. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్ ఆడింది.ఈ విజయం మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా జిల్బర్మన్ 1986లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్డ్ డబుల్స్‌లో విజయాలు సాధించింది. #MondayMotivation At 6⃣4⃣ years old, Svetlana Zilberman 🇮🇱 has won her first #BWFWorldChampionships opening round match. 👏👏 She made her competition debut in 2⃣0⃣0⃣9⃣. 😮#Tokyo2022 📸 @badmintonphoto https://t.co/Ne3CgUTS9o pic.twitter.com/4odEEV3o5m — BWF (@bwfmedia) August 22, 2022 చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు -
French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు
పారిస్: రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టాడు. సోవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 40వ ర్యాంకర్, డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూనె 7–5, 3–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో హోల్గర్ రూనె తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హోల్గర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సిట్సిపాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డెన్మార్క్ టీనేజర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు. రూడ్ ముందంజ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తమ ప్రత్యర్థులపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రూడ్ 6–2, 6–3, 3–6, 6–3తో 12వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి తన కెరీర్లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... 11వ సీడ్ జాక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో రుబ్లెవ్ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయి రెండో సెట్‌ను 6–4తో నెగ్గి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో గాయం కారణంగా సినెర్ వైదొలిగాడు. ఈ గెలుపుతో రుబ్లెవ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వెరోనిరా కుదుర్మెతోవా (రష్యా) 1–6, 6–3, 6–1తో 22వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ కసత్కినా (రష్యా) 6–2, 6–2తో కామిలా జార్జి (ఇటలీ)పై, 11వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 6–2, 6–3తో ఇరీనా బేగూ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు..
స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2022లో చరిత్ర సృష్టించాడు. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తర్వాత అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సెబాస్టియర్ కోర్డాను 6-2, 6-4, 6-2తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా మాంటే కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెబాస్టియన్ చేతిలో ఓటమికి కార్లోస్ బదులు తీర్చుకున్నాడు. సెబాస్టియన్ క్లే కోర్టులో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఇంతకముందు 2006లో నొవాక్ జొకోవిచ్ అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక కార్లోస్ అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. చదవండి: French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు [6] @alcarazcarlos03 defeats [27] Korda 6-4 6-4 6-2 and is youngest man to reach 4R @RolandGarros since #Djokovic in 2006. #Alcaraz saved all 5 break pts faced (broke 4 times) en route to his 13th win in a row. Next: 1st meeting vs [21] @karenkhachanov (d [10] Norrie in 4 sets). — ATP Media Info (@ATPMediaInfo) May 27, 2022 -
శ్రమించి ముందుకు...
లండన్: తనకెంతో అచ్చొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 18వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 22వసారి ఆడుతోన్న ఫెడరర్‌కు మూడో రౌండ్లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల ఫెడరర్ 6–4, 6–4, 5–7, 6–4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్ తలపడతాడు. నోరీతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచాడు. 48 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 33 అనవసర తప్పిదాలు చేశాడు. నోరీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు కామెరాన్ నోరీ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తాజా విజయంతో పాంచో గొంజాలెస్ (అమెరికా–41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్ రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా–40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. ఆండీ ముర్రే పరాజయం మరోవైపు 2013, 2016 చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) కథ మూడో రౌండ్లో ముగిసింది. పదో సీడ్ షపవలోవ్ (కెనడా) 6–4, 6–4, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (3/7), 6–4, 6–3, 7–6 (7/4)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 6–4తో బెడెన్ (స్లొవేనియా)పై గెలిచాడు. కోకో గాఫ్ జోరు మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై గెలిచింది. ఇంతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) 2–6, 6–0, 6–1తో సస్నోవిచ్ (బెలారస్)పై, 14వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/1), 3–6, 7–5తో సెవస్తోవా (లాత్వియా)పై, 19వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో పావ్లుచెంకోవా (రష్యా)పై, పౌలా బదోసా (స్పెయిన్) 5–7, 6–2, 6–4తో లినెట్టి (పోలాండ్)పై గెలిచారు. సానియా జంట ఓటమి మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీ 4–6, 3–6తో కుదెర్మెతోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రణయ్ ముందంజ
బాసెల్ (స్విట్జర్లాండ్): డిఫెండింగ్ చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఐదో సీడ్ ప్రణయ్ 21–17, 21–19తో కిరాన్ మెరిలిస్ (స్కాట్లాండ్)పై గెలిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కియావో బిన్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. మరోవైపు భారత్‌కే చెందిన సమీర్ వర్మ రెండో రౌండ్లో 21–16, 15–21, 13–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో ఓడిపోగా... శుభాంకర్ డే 21–17, 21–18తో ఉత్రోసా (స్లొవేనియా)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంటకు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 8–21తో ఏడో సీడ్ ఫిత్రియాని (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి
సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని పోరాటం ముగిసింది. ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రుత్విక 16-21, 13-21తో టాప్ సీడ్ హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. జోరుమీదున్న చైనా అమ్మారుు కేవలం 29 నిమిషాల్లోనే వరుస గేముల్లో రుత్వికను ఇంటిదారి పట్టించింది. పురుషుల సింగిల్స్‌లో వర్మ సోదరులు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 14వ సీడ్ జూ సంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్ సౌరభ్ వర్మ 9-16తో వెనుకంజలో ఉన్న దశలో చైనా ఆటగాడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్ వర్మ 21-10, 21-16తో ఈటు హెరుునో (ఫిన్లాండ్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా)తో జతకట్టిన ప్రజక్తా సావంత్ 21-18, 21-17తో అండర్స్ రస్మ్సెన్- ఫ్రుయెర్గార్డ్ (డెన్మార్క్) జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో రుత్విక శివాని
సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మారుు గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రుత్విక శివాని 21-11, 21-13తో సొరాయ డి విష్ ఇజ్బెర్గన్ (నెదర్లాండ్స)పై విజయం సాధించింది. కేవలం 27 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రుత్వికకు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో తన్వీ లాడ్ (భారత్) 14-21, 17-21తో గేల్ మహులెట్టి (నెదర్లాండ్స) చేతిలో ఓడిపోరుుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో వర్మ సోదరులు సౌరభ్, సమీర్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో సౌరభ్ 21-16, 21-11తో రుడిగెర్ జెనెడిట్ (ఆస్ట్రియా)పై, సమీర్ 21-11, 21-11తో అలెగ్జాండర్ రూవర్స్ (జర్మనీ)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ 17-21, 16-21తో మౌలానా ముస్తఫా (ఇండోనేసియా) చేతిలో, శుభాంకర్ డే (భారత్) 19-21, 18-21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
నాదల్ ఫటాఫట్...
-
నాదల్ ఫటాఫట్...
♦ ప్రిక్వార్టర్స్‌లోకి మాజీ చాంపియన్ ♦ వరుసగా మూడో అలవోక విజయం ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ గాయాల బారిన పడటం.. ఫామ్ కోల్పోవడం... జొకోవిచ్, ఆండీ ముర్రేల జోరు పెరగడం... ఫలితంగా స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కెరీర్ అయోమయంగా తయారైంది. రెండేళ్ల క్రితం చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత నాదల్ ఆడిన ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. దాంతో నాదల్ పనైపోరుుందనే ఊహాగానాలు వినిపించారుు. కానీ ఈ మాజీ నంబర్‌వన్ పట్టుదల కోల్పోకుండా ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడంతోపాటు తన ఆటతీరులోనూ మార్పులు చేసుకొని మళ్లీ గాడిలో పడ్డాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి వెళ్లాడు. న్యూయార్క్: తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్‌నాదల్ యూఎస్ ఓపెన్‌లో ముందంజ వేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో నాలుగో సీడ్ నాదల్ 6-1, 6-4, 6-2తో కుజ్నెత్సోవ్ (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఏడు బ్రేక్ పారుుంట్లు సాధించడంతోపాటు 22 విన్నర్స్ కొట్టాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నాదల్ ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. ఓవరాల్‌గా 20 గేమ్‌లు మాత్రమే ప్రత్యర్థులకు కోల్పోయాడు. ముఖ్యంగా కాళ్ల మధ్యలో నుంచి నాదల్ సంధించిన ‘ట్వీనర్’ షాట్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లో వెనుదిరిగాడు. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగలేదు. ‘మనం సహనంతో ఉండాలి. కోలుకోవడానికి అవసరమైనంత సమయం తీసుకోవాలి. తీవ్రంగా కష్టపడాలి. నేను అదే చేశాను. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాను’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. సిలిచ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్, 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) మూడో రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. 26వ సీడ్, అమెరికా ఆశాకిరణం జాక్ సాక్ 6-4, 6-3, 6-3తో సిలిచ్‌పై సంచలన విజయం సాధించి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాక్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు సిలిచ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికా స్టార్, 20వ సీడ్ జాన్ ఇస్నెర్ అనూహ్య పరాజయం చవిచూశాడు. అన్‌సీడెడ్ కై ల్ ఎడ్మండ్ (బ్రిటన్) 6-4, 3-6, 6-2, 7-6 (7/5)తో ఇస్నెర్‌ను ఓడిం చాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స) 6-3, 6-4, 7-6 (7/4)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స) 6-4, 6-2, 6-4తో నికొలస్ అల్మాగ్రో (స్పెరుున్)పై గెలుపొం దగా... లుకాస్ పౌలీ (ఫ్రాన్స) 3-6, 7-5, 2-6, 7-5, 6-1తో 15వ సీడ్ అగుట్ (స్పెరుున్)ను బోల్తా కొట్టిం చాడు. మరోవైపు టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) విజయపరంపర కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూజ్నీ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్లో జొకోవిచ్ 4-2తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా యూజ్నీ వైదొలిగాడు. శ్రమించి నెగ్గిన హలెప్ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), 11వ సీడ్ కార్లా నవారో (స్పెరుున్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో హలెప్ 6-1, 2-6, 6-4తో 31వ సీడ్ తిమియా బాబోస్ (హంగేరి)పై శ్రమించి గెలుపొందగా... కార్లా నవారో 6-4, 6-3తో 19వ సీడ్ వెస్నినా (రష్యా)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో కెర్బర్ 6-1, 6-1తో కాథరీన్ బెలిస్ (అమెరికా)ను ఓడించింది. ఎనిమిదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), 14వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), సురెంకో (ఉక్రెరుున్), 13వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) కూడా తమ ప్రత్యర్థులపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
పిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
రెండో రౌండ్లో శ్రీకాంత్, జైరాం బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ‘బై’ లభించిన సైనా... మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సునాయాస విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 21-11, 21-9 తేడాతో రష్యాకు చెందిన నటాలియా పెర్మినోవాను చిత్తు చేసింది. 31 నిమిషాల్లోనే భారత నంబర్‌వన్ ప్లేయర్ ఈ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12 స్కోరుతో ఇజ్టోక్ ఉట్రోసా (స్లొవేకియా)ను ఓడించాడు. మరో భారత ఆటగాడు అజయ్ జైరాంకు ‘వాకోవర్’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. తొలి రౌండ్లో అతను నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో తలపడాల్సి ఉండగా...చివరి నిమిషంలో కెనిచి తప్పుకోవడంతో అజయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ప్రజక్తా సావంత్-ఆరతి సారా సునీల్ జోడి ప్రత్యర్థికి ‘వాకోవర్’ ఇచ్చింది. ఫలితంగా పుతీతా సుప్రజిరకుల్- సప్సిరీ (థాయిలాండ్) జంట రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత జోడి అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరో సీడ్ మైకేల్ ఫక్స్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) 21-14, 21-11 తో అరుణ్-అపర్ణలపై గెలుపొందింది. కశ్యప్ నిష్ర్కమణ కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గి ఉత్సాహం మీదున్న పారుపల్లి కశ్యప్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 24-26, 21-13, 18-21తో డీటర్ డోమ్కీ (జర్మనీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.