నాదల్ ఫటాఫట్... | Nadal Battles Past Kuznetsov US Open 2016 3R | Sakshi
Sakshi News home page

నాదల్ ఫటాఫట్...

Published Sun, Sep 4 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

నాదల్ ఫటాఫట్...

నాదల్ ఫటాఫట్...

ప్రిక్వార్టర్స్‌లోకి మాజీ చాంపియన్
వరుసగా మూడో అలవోక విజయం
యూఎస్ ఓపెన్ టోర్నీ


గాయాల బారిన పడటం.. ఫామ్ కోల్పోవడం... జొకోవిచ్, ఆండీ ముర్రేల జోరు పెరగడం... ఫలితంగా స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ కెరీర్ అయోమయంగా తయారైంది. రెండేళ్ల క్రితం చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన తర్వాత నాదల్ ఆడిన ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. దాంతో నాదల్ పనైపోరుుందనే ఊహాగానాలు వినిపించారుు. కానీ ఈ మాజీ నంబర్‌వన్ పట్టుదల కోల్పోకుండా ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంతోపాటు తన ఆటతీరులోనూ మార్పులు చేసుకొని మళ్లీ గాడిలో పడ్డాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి వెళ్లాడు.

న్యూయార్క్: తన సహజశైలిలో దూకుడుగా ఆడుతూ స్పెరుున్ టెన్నిస్ స్టార్ రాఫెల్‌నాదల్ యూఎస్ ఓపెన్‌లో ముందంజ వేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ నాదల్ 6-1, 6-4, 6-2తో కుజ్‌నెత్సోవ్ (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ ఏడు బ్రేక్ పారుుంట్లు సాధించడంతోపాటు 22 విన్నర్స్ కొట్టాడు. ఇప్పటిదాకా ఈ టోర్నీలో నాదల్ ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. ఓవరాల్‌గా 20 గేమ్‌లు మాత్రమే ప్రత్యర్థులకు కోల్పోయాడు. ముఖ్యంగా కాళ్ల మధ్యలో నుంచి నాదల్ సంధించిన ‘ట్వీనర్’ షాట్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో వెనుదిరిగాడు. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగలేదు. ‘మనం సహనంతో ఉండాలి. కోలుకోవడానికి అవసరమైనంత సమయం తీసుకోవాలి. తీవ్రంగా కష్టపడాలి. నేను అదే చేశాను. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాను’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. 

 సిలిచ్‌కు షాక్
పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్, 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) మూడో రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. 26వ సీడ్, అమెరికా ఆశాకిరణం జాక్ సాక్ 6-4, 6-3, 6-3తో సిలిచ్‌పై సంచలన విజయం సాధించి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాక్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు సిలిచ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికా స్టార్, 20వ సీడ్ జాన్ ఇస్నెర్ అనూహ్య పరాజయం చవిచూశాడు.

అన్‌సీడెడ్ కై ల్ ఎడ్మండ్ (బ్రిటన్) 6-4, 3-6, 6-2, 7-6 (7/5)తో ఇస్నెర్‌ను ఓడిం చాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్‌‌స) 6-3, 6-4, 7-6 (7/4)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, పదో సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్‌‌స) 6-4, 6-2, 6-4తో నికొలస్ అల్మాగ్రో (స్పెరుున్)పై గెలుపొం దగా... లుకాస్ పౌలీ (ఫ్రాన్‌‌స) 3-6, 7-5, 2-6, 7-5, 6-1తో 15వ సీడ్ అగుట్ (స్పెరుున్)ను బోల్తా కొట్టిం చాడు. మరోవైపు టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) విజయపరంపర కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూజ్నీ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌లో జొకోవిచ్ 4-2తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా యూజ్నీ వైదొలిగాడు.

 శ్రమించి నెగ్గిన హలెప్
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), 11వ సీడ్ కార్లా నవారో (స్పెరుున్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్‌లో హలెప్ 6-1, 2-6, 6-4తో 31వ సీడ్ తిమియా బాబోస్ (హంగేరి)పై శ్రమించి గెలుపొందగా... కార్లా నవారో 6-4, 6-3తో 19వ సీడ్ వెస్నినా (రష్యా)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో కెర్బర్ 6-1, 6-1తో కాథరీన్ బెలిస్ (అమెరికా)ను ఓడించింది. ఎనిమిదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), 14వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), సురెంకో (ఉక్రెరుున్), 13వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) కూడా తమ ప్రత్యర్థులపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement