స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2022లో చరిత్ర సృష్టించాడు. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తర్వాత అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సెబాస్టియర్ కోర్డాను 6-2, 6-4, 6-2తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు.
కాగా మాంటే కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెబాస్టియన్ చేతిలో ఓటమికి కార్లోస్ బదులు తీర్చుకున్నాడు. సెబాస్టియన్ క్లే కోర్టులో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఇంతకముందు 2006లో నొవాక్ జొకోవిచ్ అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక కార్లోస్ అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు.
చదవండి: French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు
[6] @alcarazcarlos03 defeats [27] Korda 6-4 6-4 6-2 and is youngest man to reach 4R @RolandGarros since #Djokovic in 2006. #Alcaraz saved all 5 break pts faced (broke 4 times) en route to his 13th win in a row.
— ATP Media Info (@ATPMediaInfo) May 27, 2022
Next: 1st meeting vs [21] @karenkhachanov (d [10] Norrie in 4 sets).
Comments
Please login to add a commentAdd a comment