టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్ వన్.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 99వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన యోషియితో నిషియోకాను 6-3,6-1, 6-0తో వరుస సెట్లతో ఖంగుతినిపించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న సెర్బియా స్టార్.. క్లే కోర్టుపై తొలి రౌండ్‌లో ఉన్న రికార్డును కాపాడుకున్నాడు.
ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఒక్కసారి కూడా తొలి రౌండ్ ఓడిపోలేదు. 18-0తో జొకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్‌కు పారిస్ ఈవెంట్‌లో ఇది 82వ విజయం కావడం విశేషం. కాగా జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించింది. మూడేళ్ల పాటు జొకోవిచ్‌కు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం
🥇 No.1 @DjokerNole cruised in his first round matchup against Yoshihito Nishioka in today's late match -- catch the highlights:#RolandGarros pic.twitter.com/agxo5JfBuy
— Roland-Garros (@rolandgarros) May 23, 2022
Comments
Please login to add a commentAdd a comment