
దోహా: కెరీర్‌లో 100వ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్‌లోనూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో మూడో సీడ్‌గా పోటీపడ్డ జొకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ మాజీ ఆరో ర్యాంకర్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో 37 ఏళ్ల జొకోవిచ్ 6–7 (4/7), 2–6తో ఓడిపోయాడు.
గతంలో జొకోవిచ్‌తో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన బెరెటిని ఐదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 9 ఏస్‌లు... బెరెటిని 13 ఏస్‌లు సంధించారు. బెరెటిని సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసేందుకు వచి్చన అవకాశాలను జోకోవిచ్ చేజార్చుకోగా... బెరెటిని తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment