Qatar open
-
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్‌లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
ముర్రేకు 'చెక్' పెట్టాడు!
దోహా:గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రేకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ బ్రేక్ వేశాడు. ఖతార్ ఓపెన్‌లో భాగంగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 5-7, 6-4 తేడాతో ముర్రేపై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. ఇదే క్రమంలో ముర్రే 28 వరుస విజయాలకు జొకోవిచ్ చెక్ పెట్టాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. గతంలో ముర్రేపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ టైటిల్ ను వరుసగా రెండోసారి చేజిక్కించుకున్నాడు. ఈ విజయంపై జొకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు. 2017లో టైటిల్‌తో శుభారంభం చేయడం ఆనందంగా ఉందన్నాడు. -
సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్
దోహా: ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది. 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు(28) గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-హింగిస్ ద్వయం, 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించే క్రమంలో కేవలం కొన్ని అడుగులదూరంలో(41 విజయాలు) వెనుదిరిగారు. దీంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ లో అత్యధిక వరుస విజయాల రికార్డులో మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాగా, మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983- 85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. -
ఖతార్ ఓపెన్‌కు షరపోవా దూరం
మాస్కో: త్వరలో ప్రారంభం కానున్న ఖతార్ ఓపెన్ కు రష్యన్ స్టార్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా దూరం కానుంది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న షరపోవా.. ఖతార్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ఆ టోర్నీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా సెరెనా విలియమ్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ అనంతరం గాయం కారణంగా మరియా ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత వారం జరిగిన ఫెడ్ కప్ లో షరపోవాకు రష్యన్ స్క్వాడ్ లో చోటు కల్పించినా ఆమె వైదొలిగింది. 'నేను ఖతార్ ఓపెన్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేను. నా ఎడమ మోచేతి గాయంతో బాధపడుతున్నా. దాంతో టోర్నీకి దూరంగా కావాల్సి వస్తుంది' అని ఖతార్ ఓపెన్ నిర్వహకులు అందజేసిన నివేదికలో షరపోవా పేర్కొంది. టెన్నిస్ కు ఎక్కువ మంది అభిమానులున్న దోహాలో తాను ఆడకపోవడం నిరాశగురౌతున్నట్లు తెలిపింది. ఈ టోర్నీలో వచ్చే ఏడాది ఆడతానని ఆశిస్తున్నట్లు షరపోవా పేర్కొంది.