ముర్రేకు 'చెక్' పెట్టాడు! | Novak Djokovic ends Andy Murray's 28-win streak in Qatar triumph | Sakshi
Sakshi News home page

ముర్రేకు 'చెక్' పెట్టాడు!

Published Sun, Jan 8 2017 1:52 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

ముర్రేకు 'చెక్' పెట్టాడు!

ముర్రేకు 'చెక్' పెట్టాడు!

దోహా:గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రేకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ బ్రేక్ వేశాడు. ఖతార్ ఓపెన్లో భాగంగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 5-7, 6-4 తేడాతో ముర్రేపై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. ఇదే క్రమంలో ముర్రే 28 వరుస విజయాలకు జొకోవిచ్ చెక్ పెట్టాడు.

హోరాహోరీగా సాగిన తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. గతంలో ముర్రేపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ టైటిల్ ను వరుసగా రెండోసారి చేజిక్కించుకున్నాడు. ఈ విజయంపై జొకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు. 2017లో టైటిల్తో శుభారంభం చేయడం ఆనందంగా ఉందన్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement