ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ ఒకటి. రియల్ మాడ్రిడ్, ఎఫ్‌సీ బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తర్వాత అత్యంత క్రేజు సంపాదించుకున్న క్లబ్‌లలో సెయింట్ జెర్మన్ క్లబ్ అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ క్లబ్ తరపున ఆడాలని ప్రతీ ఆటగాడు కలలు కంటాడు. అయితే దాదాపు 52 ఏళ్ల చరిత్ర కలిగిన పారిస్ సెయింట్ జెర్మన్ (పీఎస్‌జీ) క్లబ్‌లో ప్రస్తుతం ఏదో జరుగుతోంది.
వరసగా స్టార్ ఆటగాళ్లు ఈ చారిత్రత్మక క్లబ్‌ను వీడుతున్నారు. ఇప్పటికే పీఎస్‌జీ క్లబ్‌కు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, సెర్జియో రామోస్ గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపే కూడా పీఎస్‌జీతో తన బంధాన్ని తెంచుకున్నాడు. పీఎస్‌జీతో తన కాంట్రాక్ట్‌ను పొడిగించడం లేదని ఎంబాపే ప్రకటించాడు. ఇక క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఎంబాపే కీలక వాఖ్యలు చేశాడు.
ఫ్రాన్స్‌లో మెస్సీకీ తగినంత గౌరవం దక్కలేదని, అందుకే అతడు తన కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని ఎంబాపే తెలిపాడు. ఎంబాపే చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక పీఎస్‌జీ క్లబ్ నుంచి బయటకు వచ్చిన మెస్సీ అమెరికాకు చెందిన మియామి క్లబ్ తరపున ఆడేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంబాపే రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా మెస్సీ తప్పుకోవడంతో పీఎస్‌జీ క్లబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. 10 లక్షల మంది ఫాలోవర్లు ఆ క్లబ్‌ను వీడారు. మెస్సీ ఉన్నప్పుడు పీఎస్‌జీ క్లబ్ ఫాలోవర్ల సంఖ్య 69.9 మిలియన్లు(6.9 కోట్లు). ప్రస్తుతం ఆ సంఖ్య 68.5 మిలియన్(6.8కోట్లు)కి చేరింది.
చదవండి: IND vs WI: విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా
Comments
Please login to add a commentAdd a comment