పారిస్: వరల్డ్ కప్ ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాను పడగొట్టిన కొత్త సంచలనం, 19 ఏళ్ల ఫ్రాన్స్ హీరో కైలియాన్ ఎంబాపె తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ప్రపంచకప్ ద్వారా తనకు లభిస్తున్న మొత్తాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు. ‘దేశం తరఫున ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడమే పెద్ద గౌరవం. దీని ద్వారా నా కల నిజమైంది. ఆడితే డబ్బులు వస్తాయి.
కానీ నేను దాని కోసం ఆడటం లేదు’ అని ఎంబాపె పేర్కొ న్నాడు. ‘ఫిఫా’ వరల్డ్ కప్‌లో ఎంబాపెకు ఒక్కో మ్యాచ్‌కు 17 వేల పౌండ్లు (దాదాపు రూ.15 లక్షలు) చొప్పున మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇది కాకుండా ఇతర బోనస్‌ల రూపంలో మరో 3 వేల పౌండ్లు (రూ. 2 లక్షల 71 వేలు) దక్కుతాయి. ఫ్రాన్స్ ప్రపంచ కప్ గెలిస్తే మాత్రం ఈ యువ ఆటగాడికి మరో 2 లక్షల 65 వేల పౌండ్లు (రూ. 2.4 కోట్లు) కూడా లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment