ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్‌జీ క్లబ్)తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.కాంట్రాక్ట్ పొడిగించుకోవడానికి ఎంబాపె ఇష్టపడకపోవడంతో అతన్ని వదులుకోవాలని పీఎస్‌జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంబాపె వదులుకున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం అని చెప్పొచ్చు.
ఎంబాపెతో బంధాన్ని కొనసాగించేందుకు పీఎస్‌జీ క్లబ్ అతనికి పదేళ్ల కాలానికి గానూ దాదాపు 1 బిలియన్ యూరోలు(ఇండియన్ కరెన్సీలో సుమారుగా 9వేల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎంబాపె అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ప్రస్తుతం లీగ్ వన్ క్లబ్‌లో ఆడుతున్న ఎంబాపెకు పీఎస్‌జీ తరపున ఇదే చివరి సీజన్ కానుంది. ఆ తర్వాత జరగనున్న ప్రీ-సీజన్ జపాన్ టూర్‌కు ఎంబాపె వేరే క్లబ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత పీఎస్‌జీ క్లబ్ ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే భారీ ఆఫర్‌ను మూటజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎంబాపె తిరస్కరించడంతో చేసేదేం లేక అతన్ని వదులుకోవడానికి సిద్ధమైంది.
ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్‌లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
చదవండి: Smriti Mandhana: 'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!'
MLC 2023: నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
Comments
Please login to add a commentAdd a comment