యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. సోమవారం డసెల్డార్ఫ్ అరేనా వేదికగా ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. 90 నిమిషాల గేమ్‌లో ఫ్రాన్స్ ఒక్క గోల్ సాధించగా.. ఆస్ట్రియా మాత్రం ఒక్కగోల్ కూడా నమోదు చేయలేకపోయింది.
ఫ్రాన్స్‌కు బిగ్ షాక్..
ఇక ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె గాయపడ్డాడు. ఎంబాపే ముక్కుకు బలమైన గాయమైంది. ఈ మ్యాచ్ 86వ నిమిషంలో ఎంబాపే, ఆస్ట్రియన్ ఫార్వడ్డర్ కెవిన్ డాన్సో ఇద్దరూ అనూహ్యంగా ఒకరొకరు ఢీకొన్నారు.
ఈ క్రమంలో కెవిన్ డాన్సో భుజం ఎంబాపే ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడి ముక్కు నుంచి రక్తస్రావం ప్రారంభమైంది. వెంటనే ఫిజియో వచ్చి ఎంబాపేకు చికిత్స అందించాడు. అయినప్పటకి రక్తం ఆగకపోవడంతో మైదానం నుంచి అతడిని బయటకు తీసుకువెళ్లారు.
మ్యాచ్ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా.. ముక్కు ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఎంబాపే గాయంపై ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అప్‌డేట్ ఇచ్చింది. ముక్కు ఎముక విరిగినట్లు ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ సైతం ధువీకరించింది.
"కైలియన్ ఎంబాపే ఆస్పత్రి నుంచి తిరిగి ఫ్రెంచ్ జట్టు బేస్ క్యాంప్‌నకు తిరిగి వచ్చాడు. సోమవారం డ్యూసెల్‌డార్ఫ్‌లో జరిగిన ఆస్ట్రియా-ఫ్రాన్స్ మ్యాచ్ సెకెండ్ హాఫ్‌లో ఎంబాపే ముక్కుకు గాయమైంది. దురదృష్టవశాత్తూ అతడి ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయింది.
మా కెప్టెన్‌కు తొలుత వైద్య సిబ్బంది చికిత్స అందించగా.. ఆ తర్వాతి ఆస్పత్రిలో డాక్టర్ ఫ్రాంక్ లే గాల్ పరిశీలించారు. అతడికి ముక్కు ఎముక విరిగినట్లు ఫ్రాంక్ లే నిర్ధారించాడు. అతడు కొద్ది రోజుల పాలు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నాడు.
అయితే ఎంబాపేకు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అతడు గాయం నుంచి కోలుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన మాస్క్‌ను ఇవ్వనున్నారు. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నామని ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎంబాపే టోర్నీ మొత్తానికి దూరమైతే ఫ్రాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
🚨🇫🇷 Kylian Mbappé has just left the hospital after it was confirmed that he broke his nose.
Mbappé will not undergo surgery despite initial indications, waiting to decide how to manage him for upcoming two games. pic.twitter.com/Fhbhft1OAO— Fabrizio Romano (@FabrizioRomano) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment