ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇవాళ(డిసెంబర్ 14న) మొరాకో, ఫ్రాన్స్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టు డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో డిఫెండర్ అచ్రాఫ్ హకీమిలు ప్రాణ స్నేహితులు.
ప్రస్తుతం పారిస్ సెయింట్-జర్మెన్‌కు(పీఎస్‌జీ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నెలన్నర వ్యవధిలో పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రం ఒక్కటే. ఎంబాపె గోల్ కొడితే.. అచ్రాఫ్ హకీమి సెలబ్రేట్ చేయడా.. అదే విధంగా హకీమి గోల్ కొడితే ఎంబాపె సంబరం చేసుకుంటాడు. హాలిడే టూర్ వెళ్లాల్సి వస్తే ఇద్దరు కలిసే వెళ్తారు. అలాంటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు దేశం కోసం ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది.
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఫ్రాన్స్ తరపున ఎంబాపె.. మొరాకో తరపున అచ్రాఫ్ హకీమిలు ఎదురుపడనున్నారు. ఇంతకాలం స్నేహితులుగా ఉన్న వీళ్లలో ఎవరిరపై ఎవరు ఆధిపత్యం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ ఎంబాపె ఈ వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్ చేసిన ఎంబాపె అత్యధిక గోల్స్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ సెమీస్ చేరింది.
మరోవైపు మొరాకో మాత్రం సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూఫ్ దశలో బెల్జియంను, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్ లాంటి పటిష్టమైన జట్లకు షాక్ ఇస్తూ రోజురోజుకు మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో ఫ్రాన్స్ ముందు మొరాకో ఆటలు సాగుతాయా లేక ఛాంపియన్స్‌కు మొరాకో షాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ మొరాకో ఫైనల్ చేరితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్ర సృష్టించనుంది.
చదవండి: FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్
పదేళ్ల క్రితం మెస్సీ కోసం.. ఇప్పుడు మెస్సీతో కలిసి
Comments
Please login to add a commentAdd a comment