
‘నన్నేమైనా అడగాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు?’ అంటూ ఫ్యాన్స్‌కి త్రిష బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతే.. ఫ్యాన్స్ ట్విట్టర్‌లో బోలెడన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి త్రిష షార్ట్ అండ్ స్వీట్‌గా సమాధానాలిచ్చారు.
⇒ రొమాంటిక్ ఫిల్మ్స్ ఇష్టమా..? యాక్షన్ మూవీసా?
♦ రొమాంటిక్ ఫిల్మ్స్.
⇒ మీకు ఇష్టమైన ఫెస్టివల్?
♦ దీపావళి.
⇒ ఫిజికల్‌గా, మెంటల్‌గా మీరు ఎంత స్ట్రాంగ్?
♦ మెంటల్లీ 90, ఫిజికల్లీ 70.
⇒ జయలలిత, కల్పనా చావ్లా, మార్లిన్ మన్రో.. ఈ ముగ్గురులో ఎవరి బయోపిక్‌లో నటించడం ఇష్టం
♦ జయలలిత. ఆమె అంటే నాకు ఎంతో అభిమానం.
⇒ కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎవర్ని సపోర్ట్ చేస్తారు?
♦ వారు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవర్ని సపోర్ట్ చేస్తానో అప్పుడు చెబుతాను.
⇒ మీకు స్ట్రీట్ ఫుడ్ ఇష్టమేనా..?
♦ ఫుల్‌గా లాగించేస్తా..
⇒ మీ ఫిజిక్, మీ అందం గురించి మాట్లాడితే మా ఆవిడకు అసూయ...
♦ నవ్వుతూ... ఆడవాళ్లను అసూయపడేలా చేయకండి. అది అంత మంచిది కాదు.
⇒ వర్షంలో ఆడుకోవడం అంటే మీకు ఇష్టమేనా?
♦ నెవర్ ఎవర్...
⇒ మీకు కోపం తెప్పించే విషయం?
♦ అబద్ధాలు చెప్పడం.
⇒ మీ ఫేవరెట్ ఫుడ్?
♦ నాకు ఫుడ్ అంటే ఇష్టం... చెబితే నవ్వుతారేమో... నేను తినడం కోసమే పుట్టాను.
⇒ మీలా ఉండాలనుకునేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి?
♦ మీరు మీలా ఉండండి. అద్భుతాలు జరుగుతాయి.
⇒ మీ దృష్టిలో స్నేహానికి నిర్వచనం?
♦ లాయల్టీ అండ్ ఫన్.
⇒ లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను నమ్ముతారా?
♦ నమ్ముతాను. కానీ ఓన్లీ విత్ యానిమల్స్.
⇒ మీరు నాకు హాయ్ చెబితే మరో పదేళ్ల వరకూ హ్యాపీగా ఉంటా?
♦ హాయ్.. పదేళ్లు సంతోషంగా ఉండండి.
⇒ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?
♦ ⇒మీరు మళ్లీ డేటింగ్ మొదలుపెట్టినప్పుడు.