ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది | Actress Kajal Aggarwal Ask Me Anything on Instagram thrills fans | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది

Published Tue, Jan 19 2021 2:33 AM | Last Updated on Tue, Jan 19 2021 7:09 AM

Actress Kajal Aggarwal Ask Me Anything on Instagram thrills fans - Sakshi

ప్రతీరోజు కృతజ్ఞతగా మొదలెడదాం. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేద్దాం. సంతోషం మనలోనే ఉందని తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుందాం. పాత కాలపు ఆలోచనల్ని బద్దలు కొడదాం అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌.  ఏదైనా అడగండి, జవాబు చెబుతా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు కాజల్‌.  అంతే.. వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కాజల్‌ తన ఆలో చనల్ని జవాబులుగా ఇచ్చారు. అందులో కొన్ని ఇక్కడ ఉంచాం.

► మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది?
లేవగానే ఇంకో రోజు వచ్చిందని చాలా కృతజ్ఞతగా ఉంటాను. పెద్ద గ్లాస్‌ వేడినీళ్లలో పసుపు, అల్లం వేసుకుని తాగుతాను. మహా మంత్రాన్ని జపించి, కాసేపు థ్రెడ్‌ మిల్‌ మీద పరిగెడతాను. అలానే మా ఆయనకో పెద్ద హగ్‌ ఇస్తాను.

► నటిగా మీకు సంతృప్తిని కలిగించే విషయం?
దర్శకుడు అనుకున్న షాట్‌ను అనుకున్నట్టు వచ్చేలా నేను నటించడం. కెమెరా ముందు ఉండటం అంటే నాకు ధ్యానం చేస్తున్నట్టే.

► కొత్త ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలేంటి?
వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్‌ చేయడం. జీవితంలో ప్రతీ విషయంలో ఏదో విధంగా వృద్ధి చెందడం.

► ఏ విషయంలో మీకు కోపం వస్తుంది?
హిపోక్రసీ. అబద్ధాలు. ఈ రెండు విషయాలు గతంలో చాలా కోపం తెప్పించేవి. కానీ ఇప్పుడు మాత్రం హిపోక్రసీ ఉన్నవాళ్లను, అబద్ధాలు ఆడేవాళ్లను చూస్తే పాపం అనిపిస్తుంది.

► యాక్టింగ్‌ కాకుండా మీకు మరేదైనా డ్రీమ్‌ ఉందా?
ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది. మనం మన లాగా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండేలాగా. చాలా దయగా ఉండే ప్రపంచాన్ని సృష్టించాలని ఉంది.

► అతిగా ఆలోచించడం నుంచి బయటపడటం ఎలా?
ఏ విషయంలో అయినా సరే అందులోని పాజిటివ్‌ విషయాలేంటో చూడటం నేర్చుకోవాలి. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ని అలవాటు చేసుకోవాలి. ధ్యానం చేస్తుండాలి.

► పెళ్లికి ముందు.. తర్వాత మీలో మీరు గమనించిన మార్పు?
బాధ్యత పెరిగినట్టు అనిపించింది. అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత నా పార్టనర్‌కే ఇవ్వాలనుంది. అటు వైపు నుంచి కూడా అలానే ఉండాలనుంది.

► మీ చిన్నప్పటి గోల్‌ ఏంటి?
వ్యోమగామి అవ్వాలనుకున్నాను. స్క్రీన్‌ మీద అయినా ఆస్ట్రోనాట్‌ అవ్వాలనుంది. చూద్దాం!

► మీ సంతోషం ఎందులో ఉంటుంది?
నాకే కాదు, ఎవ్వరికైనా వాళ్ల సంతోషం వాళ్ల మనసులోనే ఉంటుంది. సంతోషంగా ఉండాలని బలంగా నిశ్చయించుకోవాలి. ప్రతీ క్షణాన్ని సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది.

► మీ ఫ్యాన్స్‌ గురించి చెప్పండి?
వాళ్లు ది బెస్ట్‌. నేను ఈ రోజు ఇలా ఉండటానికి, ఇంకా కష్టపడి పని చేయడానికి ముఖ్య కారణం వాళ్లే.

► ‘మోసగాళ్ళు’ సినిమాలో మీ పాత్ర గురించి?
చాలా ఆసక్తికరమైన పాత్ర అది. ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను.

► సినిమాలు చేయడం మానేస్తారా?
అస్సలు లేదు.  సినిమా నా ఫస్ట్‌ లవ్‌. సినిమాలు చేస్తూనే ఉంటాను.

► ‘ఆచార్య’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
చాలా పవర్‌ఫుల్‌ పాత్ర. ఈ మధ్య కాలంలో అలాంటి పాత్ర చేయలేదు.

► మీ ఫేవరెట్‌ డ్రింక్‌ ఏంటి?
నిమ్మకాయ రసం. ఎర్ల్‌ గ్రే టీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement