![malayalam actress anna ben plays a key role in prabhas kalki 2898 ad - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/22/anna%20ben.jpg.webp?itok=VTcJRZSC)
మలయాళంలో ‘హెలెన్’ (2019), ‘కప్పెలా’ (2020) వంటి సినిమాల్లో నటించిన అన్నా బెన్‌ను ఓ బంపర్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రధారులు.
రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ అన్నా బెన్ పేరు తెరపైకి వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి పాన్ వరల్డ్ మూవీలో చాన్స్ అంటే.. అది బంఫర్ ఆఫర్ అనొచ్చు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment