Malayalam Beauty
-
Akhila Bhargavan: సముద్రతీరంలో మలయాళ బ్యూటీ అందాలు.. ఫోటోలు
-
బంపర్ ఆఫర్
మలయాళంలో ‘హెలెన్’ (2019), ‘కప్పెలా’ (2020) వంటి సినిమాల్లో నటించిన అన్నా బెన్ను ఓ బంపర్ ఆఫర్ వరించినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రధారులు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ అన్నా బెన్ పేరు తెరపైకి వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి పాన్ వరల్డ్ మూవీలో చాన్స్ అంటే.. అది బంఫర్ ఆఫర్ అనొచ్చు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. -
అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా చూశారా? ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన మీరా జాస్మిన్ తన అమాయకపు చూపులతో అదరగొట్టింది. తెలుగులో రన్ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. 'అమ్మాయి బాగుంది' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తమిళ చిత్రాల్లోనూ నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్! ) అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. తాజాగా విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మరో చిత్రం టెస్ట్ లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తానెందుకు నటనకు దూరం కావాల్సి వచ్చిందో వివరించింది. మీరా జాస్మిన్ మాట్లాడుతూ..'నేను నటిగా ఇప్పటి వరకు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించా. హీరోయిన్గా ఆదరణ పొందడం గౌరవంగా ఉంది. ఇంకా మెరుగ్గా రాణించేందుకు కొన్నేళ్లపాటు బ్రేక్ తీసుకున్నా. తాజాగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ ప్రారంభించినంతగా ఫీలింగ్ కలిగింది.' అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. కాగా.. టెస్ట్ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార నటిస్తున్నారు. దర్శకుడు శశికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) -
వివాదంలో శ్రీదేవి బంగ్లా!
కన్ను కొట్టి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడు ఆమె ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్ మమ్బ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్ ఎస్.కె, ఎమ్. ఎన్. పింప్లీ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్‌లోని విజువల్స్ తన భార్య శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్నాయని బోనీకపూర్ ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక.. ‘శ్రీదేవి బంగ్లా’ వివాదం విషయానికొస్తే.. ‘‘ఈ సినిమా టైటిల్లో శ్రీదేవి పేరును వెంటనే మార్చడంతో పాటు వేరే మార్పులు చేయాల్సి ఉంటుందన్న విధంగా బోనీకపూర్ మాకు నోటీసులు పంపారు. బయోపిక్కు అనుమతులు తీసుకోవాలన్న విషయం తెలుసు. శ్రీదేవి అనే పేరు గల నటి లండన్ వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి వచ్చిందనే అంశాల ఆధారంగా మా సినిమా ఉంటుంది. ఇది ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు స్టోరీ లైన్ గురించి ఇంతకన్నా చెప్పలేం. శ్రీదేవి అనేది కామన్ నేమ్. రిలీజ్ కాకుండానే శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందనడం సరికాదు. విడుదలయ్యాక ఇది శ్రీదేవి బయోపిక్ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ సినిమాకి ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నాం. కానీ సౌత్‌లో మరింత రీచ్ ఉండాలని ప్రియా ప్రకాశ్ వారియర్‌ను తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు ప్రశాంత్. ‘‘సినిమాలో శ్రీదేవి అనేది నా పాత్ర పేరు. ఆమె పేరుతో ఎవరూ వివాదాలు సృష్టించాలనుకోరు’’ అని ప్రియా ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. -
హైట్ తగ్గడానికి దారి లేదే!
తమిళ సినిమాల్లో రాణిస్తే ఇతర చిత్ర పరిశ్రమలో ఆదరణ బలంగా ఉంటుంది. వర్ధమాన నటి ఇషారా నాయర్ కూడా ఇదే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లో నటి అనుష్క తరువాత ఆ స్థాయి హైట్ (5.8 అడుగులు) గల నటి ఇషారా వెణ్‌మేగం చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళకుట్టి చదివిందంతా తమిళనాడులోనేనట. ఈ అమ్మడు నటించిన వెణ్‌మేగం, పప్పాళి, చదురంగవెట్టై చిత్రాలు ఇప్పటికే తెరపై కొచ్చాయి. ప్రస్తుతం అతి మేధావి, పప్పరప్పం చిత్రాలతో పాటు తెలుగులో ఒక్కసారి అనే చిత్రంలోను నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇషారతో చిట్‌చాట్. చిత్ర రంగ పరిచయం గురించి? నా కుటుంబానికి నచ్చని రంగం ఇది. నాకైతే చాలా ఇష్టం. అలాగని నటించాలని ఆలోచన లేదు. అందుకు సరైన పర్సనాలిటీ నాకు లేదనే భావనలో ఉండేదాన్ని. తమిళనాడులోని తిరుసెంగోడులోగల వివేకానంద కళాశాలలో చదువుతున్న సమయంలో బాహ్య ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రతి ఏడాది కేరళలో జరిగే మిస్ కేరళ పోటీల్లో జయించిన వాళ్లను చూస్తుంటే వాళ్లకంటే నేనే అందంగా ఉన్నాననిపించేది. 2010లో సరదాగా నా రెండు ఫొటోగ్రాప్స్కు మిస్ కేరళ పోటీకి మెయిల్ పంపాను. అప్పుడు ఊహించని రీతిలో మిస్ కేరళ పోటీకి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నా హైటే నాకు శాపం అయ్యింది. ఫైనల్ వరకు వచ్చి రెండో స్థానానికి సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాతే నటించాలనే ఆలోచన వచ్చింది. అయిష్టంగా అమ్మ సమ్మతించడంతో వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఆరంభిం చాను. ఆప్రకటనలు చూసే వెణ్‌మేగం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆరంభంలోనే ఒకేసారి నాలుగు చిత్రాల్లో నటించినట్లున్నారు. ఎలా సాధ్యం? నటించడానికి ఏమంత అనుభవం కావాలి. అనుభవజ్ఞులైన దర్శకులు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. అలా ఒకసారి పది చిత్రాల్లో కూడా నటించగలను. కేరళకుట్టి అయ్యుండి మలయాళ చిత్రాలు చేయడం లేదే? తమిళంలో నటిం చిన రెండు చిత్రాలు హిట్ అయితే అప్పుడు మలయాళంలో అధిక పారితోషికం ఇస్తారు. ఇది వృత్తి సీక్రెట్. మీ పొడవును మైనస్‌గా భావిస్తున్నారా? ఈ విషయం కరెక్ట్‌గా చెప్పలేను గానీ అమ్మాయి హైట్ మనకు సెట్ కాదు అని కొన్ని అవకాశాలు మిస్ అయిన సందర్భాలున్నాయి. పొడవు తగ్గితే ఏదైనా ఎనర్జీ ఫుడ్ తీసుకుని పెరిగే ప్రయత్నం చేయవచ్చు. హైట్ తగ్గడానికి ఎలాంటి దారి లేదే. ఎక్స్పోజింగ్ గురించి? పప్పాళి చిత్రంలో 1980 నాటి అమ్మాయిగా నటించాను. ఇళయరాజ నేపథ్య గీతానికి నటించాను. అతి మేధావి చిత్రంలో మోడ్రన్ గర్ల్‌గా నటించాను. ఇప్పటికీ ఈ వైవిధ్యం చాలా? ఎలాంటి పాత్రలను కోరుకుంటున్నారు? అన్ని రకాల పాత్రలు పోషించాలని కోరుకుంటున్నాను. ఏడాదికి కనీసం పది చిత్రాల్లో నటించాలి. తినడానికి, నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటూ కొందరు హీరోయిన్లు ఇంటర్వ్యూ ఇస్తుంటారే నేను అలాంటి ఇంటర్వ్యూ ఇచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నాను. అదే నా డ్రీమ్.