
రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా చూశారా? ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన మీరా జాస్మిన్ తన అమాయకపు చూపులతో అదరగొట్టింది. తెలుగులో రన్ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. 'అమ్మాయి బాగుంది' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తమిళ చిత్రాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది.
(ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్! )
అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. తాజాగా విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మరో చిత్రం టెస్ట్ లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తానెందుకు నటనకు దూరం కావాల్సి వచ్చిందో వివరించింది.
మీరా జాస్మిన్ మాట్లాడుతూ..'నేను నటిగా ఇప్పటి వరకు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించా. హీరోయిన్‌గా ఆదరణ పొందడం గౌరవంగా ఉంది. ఇంకా మెరుగ్గా రాణించేందుకు కొన్నేళ్లపాటు బ్రేక్ తీసుకున్నా. తాజాగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ ప్రారంభించినంతగా ఫీలింగ్ కలిగింది.' అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. కాగా.. టెస్ట్ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార నటిస్తున్నారు. దర్శకుడు శశికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
(ఇది చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment