Tamannaah Bhatia Reveals About Her Experience With Hollywood Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: 'ఆ సినిమా చూసి అలాంటి పని మానేశా'

Published Tue, Apr 30 2024 9:49 PM | Last Updated on Wed, May 1 2024 6:27 PM

Tamannaah Bhatia Reveals About Her Experience with Hollywood Movie

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాక్‌ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరణ్మనై-4తో వస్తోన్న ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో తమన్నా, రాశి ఖన్నా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఓ హాలీవుడ్‌ ఫిల్మ్‌ని చూశాక వ్యాక్సింగ్‌ (చర్మంపై రోమాలు తొలగించడం) మానేశానని తెలిపారు. హాలీవుడ్ చిత్రం హౌజ్‌ ఆఫ్‌ వ్యాక్స్‌ చిత్రంలో వ్యాక్స్‌తోనే పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాకే వ్యాక్సింగ్‌ మానేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. రాశి ఖన్నాతో కలిసి వేదికపై మెరిసింది. కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement