ఆ విషయం వాళ్లనే అడగాలి: ప్రియమణి హాట్‌ కామెంట్స్‌ | Tollywood Actress Priyamani Open Comments About Movie Chances With Kollywood Stars, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyamai: 'స్టార్‌ హీరోలతో అవకాశాలు'.. అది నిజం కాదంటోన్న ప్రియమణి!

Published Fri, Apr 12 2024 6:52 AM | Last Updated on Fri, Apr 12 2024 10:01 AM

Star Actress Priyamani Open About Movie Chances In Kollywood Stars - Sakshi

మాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ ఎదిగిన నటి ప్రియమణి. ముఖ్యంగా కోలీవుడ్‌లో భారతీరాజా, బాలుమహేంద్ర వంటి టా ప్‌ దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న లక్కీ బ్యూటీ ఆమె. పరుత్తివీరన్‌ చిత్రంలో ముత్తళగు పాత్రలో పరకాయ ప్రవే శం చేసి జాతీయ ఉత్త మ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ చి త్రం తరువాత గ్లామర్‌ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియమణి తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగార్డున వంటి స్టార్‌ హీరోల సరసన నటించారు.

కానీ కోలీవుడ్‌లో అలాంటి స్టార్స్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదు. నిజం చెప్పాలంటే ఈమె తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. కాగా ఆ మధ్య పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన ప్రియమణి చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే హీరోయిన్‌గా కాకుండా సపోర్టింగ్‌ పాత్రల్లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. కాగా చాలా కాలం క్రితమే బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియమణి మళ్లీ ఇటీవల హిందీ చిత్రాల అవకాశాలు పొందడం విశేషం. 

గతేడాది సూపర్‌ హిట్‌గా నిలిచిన షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించి నిర్మించిన జవాన్‌ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌ సరసన మైదాన్‌ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రియమణి బదులిస్తూ తాను ఎవరినీ తప్పు పట్టలేనన్నారు. తనకు అవకాశం ఇస్తే నటనలో వారిని డామెనేట్‌ చేస్తానని కొందరు తనతో చెప్పారన్నారు. అయితే అందులో నిజం లేదన్నది తనకు తెలుసన్నారు. నిజం చెప్పాలంటే టాప్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు రాకపోవడానికి కారణం తనకూ తెలియదన్నారు. ఆ విషయం గురించి ఆ హీరోలు, నిర్మాతలనే అడగాలని నటి ప్రియమణి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement