chances
-
IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
ఈ దఫా ఐపీఎల్ సీజన్ మస్త్ మజాను పంచబోతోంది. ఫేవరెట్‌గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ వెంటనే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా అవుట్ అయ్యింది. తాజాగా.. గుజరాత్ టైటాన్స్ కథ కూడా ముగిసింది. ఇంకోవైపు ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ అర్హత సాధించింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి.రాజస్థాన్ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది.ఆడినవి: 12పాయింట్లు: 16నెట్‌రన్‌రేట్: 0.349మిగిలిన మ్యాచ్‌లు: పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్రాజస్థాన్ తర్వాత మెరుగైన అవకాశాలున్నది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. నెట్‌రన్‌రేట్ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.ఆడినవి:12పాయింట్లు: 14నెట్ రన్‌రేట్: 0.406మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్లక్నో, ఢిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. కానీ, ఆ రెండు జట్లూ నెట్ రన్‌రేట్‌లో మైనస్ పాయింట్లతో బాగా వెనుకబడ్డాయి. ఢిల్లీకి ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలే ఉంది. అదీ లక్నోతో. నెట్ రన్ రేట్ ఢిల్లీకి తక్కువగా ఉంది. కాబట్టి 14 పాయింట్లు వచ్చినా ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం కష్టం. ఒకవేళ సన్‌రైజర్స్ భారీ తేడాతో తన రెండు మ్యాచ్‌లలో ఓడితే, సీఎస్కే ఆర్సీబీపై భారీ విజయం సాధిస్తే.. లక్నో ఓడిపోయి రన్‌రేట్‌తో ఢిల్లీ కంటే దిగువన ఉంటే గనుక.. అప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశం ఉండొచ్చు. ఇదంతా కష్టమే కాబట్టి ఢిల్లీకి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఆడినవి:13పాయింట్లు:12నెట్‌రన్‌రేట్:-0.482మిగిలిన మ్యాచ్: లక్నోలక్నో.. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. ఎల్ఎస్జీ నెట్‌రన్‌రేట్ (0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.ఆడినవి:12పాయింట్లు:12నెట్ రన్‌రేట్: -0.769మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ, ముంబై ఇండియన్స్ బెంగళూరు.. ఐదు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. నెట్‌రన్‌రేట్ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నైబెంగళూరు మ్యాచ్ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్ చేరుతుంది.ఆడినవి:13పాయింట్లు: 12నెట్‌రన్‌రేట్: 0.387మిగిలిన మ్యాచ్: సీఎస్కే13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్ రన్‌రేట్ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం కావచ్చు.ఆడినవి:13పాయింట్లు:14నెట్‌రన్‌రేట్: 0.528మిగిలిన మ్యాచ్: ఆర్సీబీ -
ఆ విషయం వాళ్లనే అడగాలి: ప్రియమణి హాట్ కామెంట్స్
మాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎదిగిన నటి ప్రియమణి. ముఖ్యంగా కోలీవుడ్‌లో భారతీరాజా, బాలుమహేంద్ర వంటి టా ప్ దర్శకుల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న లక్కీ బ్యూటీ ఆమె. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగు పాత్రలో పరకాయ ప్రవే శం చేసి జాతీయ ఉత్త మ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ చి త్రం తరువాత గ్లామర్ పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియమణి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్డున వంటి స్టార్ హీరోల సరసన నటించారు. కానీ కోలీవుడ్‌లో అలాంటి స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు రాలేదు. నిజం చెప్పాలంటే ఈమె తమిళంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించారు. కాగా ఆ మధ్య పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టిన ప్రియమణి చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే హీరోయిన్గా కాకుండా సపోర్టింగ్ పాత్రల్లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. కాగా చాలా కాలం క్రితమే బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ప్రియమణి మళ్లీ ఇటీవల హిందీ చిత్రాల అవకాశాలు పొందడం విశేషం. గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన షారూఖ్ ఖాన్ హీరోగా నటించి నిర్మించిన జవాన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా అజయ్‌దేవ్‌గన్ సరసన మైదాన్ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ప్రియమణి బదులిస్తూ తాను ఎవరినీ తప్పు పట్టలేనన్నారు. తనకు అవకాశం ఇస్తే నటనలో వారిని డామెనేట్ చేస్తానని కొందరు తనతో చెప్పారన్నారు. అయితే అందులో నిజం లేదన్నది తనకు తెలుసన్నారు. నిజం చెప్పాలంటే టాప్ హీరోలతో జత కట్టే అవకాశాలు రాకపోవడానికి కారణం తనకూ తెలియదన్నారు. ఆ విషయం గురించి ఆ హీరోలు, నిర్మాతలనే అడగాలని నటి ప్రియమణి పేర్కొన్నారు. -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్‌ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్‌కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
TRS: కొత్త రూట్లో ‘కారు’
టీఆర్ఎస్ ప్రస్తుతం 60 లక్షల మందికి పైగా సభ్యులతో అన్ని స్థాయిల్లో పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితిని అనువుగా మార్చుకుని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ప్రక్రియను కేసీఆర్ చాప కింద నీరులా కొనసాగిస్తున్నారని నేతలు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పాతతరం నేతల స్థానంలో కొత్తవారు, యువతకు అవకాశాలు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిపాయి. అధికారంలో ఉండటం ద్వారా తలెత్తే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం.. కొత్త రాజకీయ శక్తులు, విపక్షాల దూకుడుకు కళ్లెం వేయడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్ను తున్నారని.. అందులో భాగంగానే కొత్తవారు, యువతపై దృష్టిపెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ‘‘పార్టీలో ఉన్న యువతే భవిష్యత్తు నిర్మాతలు. నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా నాయకులు ఎక్కడి నుంచో రారు. ఇక్కడి నుంచే పుట్టుకొస్తారు. కొత్త నాయకత్వంతో మరింత వేగంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ముందటి నాగలి తర్వాత వెనుక నాగలి వచ్చినట్టు లైన్లో ఉన్న వారికి ఆటోమేటిగ్గా అవకాశాలు వస్తాయి..’’ హుజూరాబాద్ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలివి. పార్టీలో, పదవుల్లో యువతకు, కొత్తవారికి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగు తున్నట్టు ఆయన ఇచ్చిన సంకేతాలివి. సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతకాలంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ రెండోసారి గెలిచాక కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన ఆయన.. మెల్లగా యువతకు ప్రాధాన్యంపై దృష్టిపెట్టారు. కొత్తవారికి చాన్స్‌లు ఇస్తున్నారు. ఎవరి సామర్థ్యం ఏమిటో చూస్తూ.. వాస్తవానికి రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ రాజకీయ పునరేకీకరణపైనే కేసీఆర్ ఎక్కువగా దృష్టిపెట్టారని.. ప్రస్తుతం టీఆర్ఎస్లోకి వలసలు దాదాపు క్లై్లమాక్స్‌కు చేరాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీకి దీర్ఘకాలంగా సేవచేస్తున్నవారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు, యువ నాయకుల పనితీరును అంచనా వేసే పనిని కేసీఆర్ మొదలుపెట్టారని చెప్తున్నాయి. అవకాశమున్న ప్రతీచోటా సామాజిక సమీకరణాలు చూసుకుంటూ కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నాయి. పాత, కొత్త అనే తేడా లేకుండా.. యువ నాయకుల పనితీరు, వారి బలాలు, బలహీనతలను మదింపు చేసి, పార్టీ అవసరాల ఆధారంగా పదవులకు ఎంపిక చేయడమనే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి. దీనికి రాబోయే రోజుల్లో మరింత పదును పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ! ప్రస్తుతం శాసనసభలో టీఆర్ఎస్కు 103 మంది సభ్యుల బలం ఉంది. అందులో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు తొలిసారి, రెండోసారి గెలిచినవారే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో 25 మంది వరకు కొత్తతరం నాయకులు టీఆర్ఎస్ ద్వారా రాజకీయం అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని... కొందరు సీనియర్ నేతలు తమ వారసులను తెరమీదకు తేనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతల వారసులు ఇప్పటికే యువసేనలు, ట్రస్ట్‌లు, సేవా కార్యక్రమాల పేరిట నియోజకవర్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోచారం భాస్కర్‌రెడ్డి, జోగు ప్రేమేందర్, బాజిరెడ్డి జగన్, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, కోనేరు వంశీకృష్ణ, నడిపెల్లి విజిత్‌రావు, కడియం కావ్య, డీఎస్ రవిచంద్ర, అజ్మీరా ప్రహ్లాద్, బస్వరాజు శ్రీమాన్, పుట్ట శైలజ, వనమా రాఘవ, చిట్టెం సుచరిత, మైనంపల్లి రోహిత్, ఏ.సందీప్‌రెడ్డి వంటివారు చురుగ్గా ఉన్నారు. కొందరు ఇప్పటికే జిల్లాస్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కొందరికైనా భవిష్యత్తులో అవకాశం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ వారసత్వం లేని కొత్తతరం నాయకులు ముందుకు వస్తున్నారు. అన్నివర్గాల వారికి అవకాశం దిశగా.. రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్ఎస్లో కొత్తవారికి, పలుకుబడి కలిగిన వారు, ఉద్యమంలో పనిచేసినవారు, ప్రముఖులు, రాజకీయ వారసత్వం కలిగిన వారు తదితర కేటగిరీల్లో అవకాశాలు వస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తాజాగా గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయగా, ఇంతకుముందు ఇదే కోటాలో కవి, గాయకుడు గోరటి వెంకన్న, సామాజిక సేవా రంగానికి చెందిన భోగారపు దయానంద్‌కు అవకాశం లభించింది. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌ను నామినేట్ చేశారు. ప్రభుత్వ విప్‌లుగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, గొంగిడి సునీత వంటి కొత్తతరం నేతలకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ కమిటీల్లోనూ కొత్తవారికే చోటు కల్పించారు. యాదవ, పద్మశాలి, రజక, విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వంటి సామాజిక వర్గాలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అవకాశాల వేటలో విద్యార్థి నేతలు ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన కొందరు విద్యార్థి నేతలు టీఆర్ఎస్ ద్వారా రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, పిడమర్తి రవి, రాకేశ్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్ వంటి వారికి వివిధ రూపాల్లో రాజకీయ అవకాశాలు లభించాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజారామ్ యాదవ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి వంటి ఉద్యమ నేపథ్యమున్న విద్యార్థి నేతలు.. పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికైనా తమకు రాజకీయ అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నారు. -
మగవాళ్లకి కూడా తొమ్మిది నెలలే!
టెక్సాస్ : వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మగవాళ్లు కూడా గర్భం దాల్చే రోజులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. మగవారు కూడా పిల్లల్ని కనడానికి భవిష్యత్తులో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని డాక్టర్ రిచర్డ్ పాల్సన్ స్పష్టం చేశారు. అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు అయిన పాల్సన్ శాన్ ఆంటోనియోలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ అంశంపై ప్రసంగించారు. లింగమార్పిడి చేయించుకున్న పురుషులు... గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చని ఆయన అన్నారు. లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. సాధారణ పురుషుల్లో కాన్పు మాములు విషయం కాదని ఆయన చెప్పారు. పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం తేడాగా ఉండటమే అందుకు కారణమని పాల్సన్ తెలిపారు. అయితే క్లిష్ట తరమైన ఈ సమస్యకు సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయాని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మగవారికి అవసరమైన మందులు మార్కెట్లలో విరివిగా ఉన్నాయని... దీని కారణంగా మగవారు పిల్లలను కనొచ్చని చెప్పారు. అయితే దీనిపై అభ్యంతరాలు లేవనెత్తవాళ్లు నుంచి మాత్రమే సమస్య ఉండొచ్చన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. -
అవకాశాలకు ఆకాశమే హద్దు
సందర్భం దాదాపు 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల అక్షరవనం సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినందనీయం. ఉన్నత విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదు. మనిషిలో దాగి ఉన్న పరిమళాన్ని ప్రపంచానికి చాటడా నికి ఒక మాధ్యమం మాత్రమే. ప్రతి మనిషిలో ప్రతిభ దాగి ఉంటుంది. నిద్రాణంగా ఉన్న ఆ ప్రతిభను సమాజపరం చేయడానికి ఉన్నత విద్య ఒక మాధ్యమం. సమాజం అందరికీ సమానమైన అవకాశం కల్పించాలి. ఎవరికి ప్రతిభ ఎందులో దాగి ఉంటుందో తెలియదు. బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అన్న చందంగా సమాజం అన్ని అభిరుచులకు అది బఫే భోజనం. ఎవరికి ఎందులో ఆసక్తి, అభిరుచి ఉంటాయో వారి వారి అభిరుచుల మేరకు ఆయా రుచులతో కూడిన పదా ర్థాలను అందుకుంటారు. సమాజం సకల అభిరుచుల సమ్మేళనం. అభిరుచులను అందుకోవడం కష్టం. అవకా శాలు కల్పిస్తే ఆశయాలు మొగ్గ తొడుగుతాయి. వాటికి పదును పెడితే అపారమైన ప్రతిభ వెలికివచ్చి ప్రపంచానికి సంపదను సృష్టించి సమాజ అవసరాలను తీరు స్తాయి. ప్రతిభావంతమైన జాతి నిర్మాణానికి వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో అక్షరవనం అనే వేదికను ఏర్పాటు చేసింది. అపారమైన మానవ సంపదగల ఈ జిల్లాలో విద్యార్థుల లోని అంతర్లీనంగా ఉన్న ఆసక్తులను వెలికితీసేందుకు వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక బఫేలాగా విద్యార్థులు వాడుకుంటున్నారు. ఇక్కడ తినుబండా రాలు కావు మైండ్‌కు కావలసిన బండారాలను వందేమాతరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని సంద ర్శించినప్పుడు నేను అపారమైన నాట్య, వాద్య, గాత్ర, సాహిత్య, జానపద, చిత్ర, జ్ఞాన, గణిత కళలలో అబ్బో ఒకటేమిటి 14 రంగాలలో ప్రతిభా పాటవాలను వెలికి తీస్తున్నారు. ఒక గదికి వెళితే తబలా వాయించడం, మరో గదికి వెళితే డప్పు కొట్టడం, మరో గదిలో భరతనాట్యం చేయించడం, మరో చోట పల్లెపాటలు, నాట్లు వేసేటప్పుడు పాడే పాటలు ఈ విధంగా ఆట పాటలను మాటలతో కలిపి చిన్నపిల్లలో దాగి ఉన్నటు వంటి ప్రతిభను గిచ్చి లేపుతున్నారు. మనిషిని గిచ్చితే తెలవకుండానే తొడ జాడిస్తాడు. అదే విధంగా 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల ఆ సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినంద నీయం. దీనికి చేయూతనిస్తున్న ఆ జిల్లా కలెక్టర్ మాతృ హృదయాన్ని చాటుతుంది. పిల్లల కోసం అమ్మవలె ఆరాటపడిన తీరు జిల్లా కలెక్టర్ ముఖంలో కనబడింది. జిల్లా వ్యాప్తంగా ఆమె చొరవ తీసుకొని 2000 మంది పిల్లలకు తల్లిగా మారి శిబిరాల నిర్వహణకు ఆరాట పడుతున్న తీరు నన్నెంతగానో కదిలించింది. అక్షర వనానికి స్థలాన్ని విరాళమిచ్చిన ఫౌండేషన్ కార్యదర్శి మాధవ్ ముఖంలో జీవితం సార్థకమైనదన్న సంతృప్తి కనిపించింది. వెలికి వస్తున్న పిల్లల ప్రతిభను చూసి ఎంతో ఆనందంతో మాధవ్ మాట్లాడుతూ నాట్యం చేస్తాడు. నిన్నటి వరకు బెంగళూరు నుంచి కూలీలను తీసుకు పోవడానికి యజమానులు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చేవారు. కానీ ఈరోజు అదే యజమానులు విజ్ఞాన సంస్థలను సందర్శించడానికి మహబూబ్‌నగర్‌కు వస్తు న్నారు. ఆ మార్పుకు కారణమైన వాటిలో మా మాధవ రెడ్డి పాత్ర ఉంది అంటే అది అతిశయోక్తి కాదేమో. ఇది కేవలం ఆటే కదా అనుకున్నాను. బహుశా నాలో దాగి ఉన్న జిజ్ఞాసను గిల గిల పెట్టించడానికి ఒక గదిలోకి తీసుకెళ్లారు. తాతా గణితం నువ్వే చెప్పగల్గుతావని అను కున్నావు కదా! కానీ నేను కూడా చెప్పగలనని పదేళ్ల పిల్లవాడు లిటిల్ టీచర్లా నా ముందుకొచ్చి గణితంలో ప్రాథమిక సూత్రాలు గబగబా చెబుతుంటే, సున్నాను కనుక్కున్న వారెవరో కానీ ఆ చిన్నారి మాత్రం ప్రస్ఫు టంగా బాల గణిత మేధావిగా కనిపించాడు. మనిషిలోని మనసుతో అభీష్టాన్ని బయటకు లాగడానికి వీరు వేసవి సెలవులలో క్యాంపులను నడిపిస్తారు. కొందరికి టెక్నాలజీ, సైన్స్ మీద అభిలాష, మరికొందరికి తను చేసే వృత్తిపై అభిరుచి, పిల్లల ప్రవృత్తికి తల్లిదండ్రులు అవకాశాలను సమకూరుస్తారు. అమెరికాలోని సిన్సినాటీలో నా స్వంత మనవడు న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. వాడు 9వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాడి ఆసక్తిని గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ రోగులకు మందులు సర ఫరా చేయడం అలవాటు చేశారు. నా కూతురు, అల్లుడితో ‘ఇదేనా మీరు నేర్పించింది’ అన్నాను. అప్పుడు వారు ‘మీకు కనబడింది ఇంతే’ అన్నారు. ‘దాని వెనుక రోగిపట్ల సంరక్షణ, వాత్సల్యత వృద్ధి చెంది, వైద్యం పట్ల పెరిగిన నిబద్ధత వాడి మొహంలో కనబడట్లేదా’ అన్నారు. ‘ఇదే ప్రాక్టికల్ లెర్నింగ్’ అన్నారు. వేసవిలో ఆ పిల్లవాడు ఇండియాకు వచ్చాడు. తాత, అమ్మమ్మలకు మనవడు కాబట్టి చిట్టి పంజరంలో చిలుకను పెంచినట్లు పెంచేద్దాం అనుకున్నాం. కానీ వాడు ఇంట్లో ఉంటే కదా..! రెక్కలు వచ్చిన పక్షిలా, మా బంధువుకు ఆపరేషన్ అవుతుంటే థియేటర్లో ప్రత్య క్షంగా చూడడానికి వెళ్లాడు. ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుండే కలలు కంటాడు. అమ్మ, నాన్నలుగా వారికి అవకాశాలు కల్పించాలి. ఇలాంటి అవకాశాలకు అక్షరవనం ఒక వేదిక అయింది. చదువు చెప్పడం కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. తనకు తానుగా ఆసక్తితో తన చుట్టూ ఉన్న అవకాశాలను అంది పుచ్చుకుని ఆశయాలను మెరుగు పరచుకుంటున్న తీరు ఆసక్తికరంగా ఉంది. పాఠశాల స్థాయిలో పిల్లల్ని పట్టు కొని పాఠాలు చెప్పడం పరిపాటి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకున్న ఇక్కడి విద్యార్థులకు ఉపాధ్యాయుల వద్ద పాఠాలు ఎలా నేర్చుకోవాలో అర్థమైంది. ఇది తెలియక సందేహాలను నివృత్తి చేసుకోలేక చదువులో వెనుకబడు తున్నారు. పాలమూరు జిల్లాకు అక్షరవనం ఒక విద్యా వర ప్రదాయిని. ఈ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న ప్రయత్నం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విస్తరించాలి. పిల్లల్లో నిద్రాణంగా ఉన్న జ్ఞాన కిరణాలను తట్టి లేపాలి. తనకు ఏది కావాలో వెతుక్కునే అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా పిల్లలు దూసుకుపోతారు. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
గాయాల నుండి కోలుకుంటున్న సింధు