కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించింది. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో పాటు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. ఇవాళ ఆమె నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులు రిలీజై 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఖుష్బు ఎమోషనల్ పోస్ట్ చేసింది.
ఖుష్బు ట్వీట్‌లో రాస్తూ..'నా సౌత్ ఇండియా మొదటి సినిమా 14 ఆగస్టు 1986న విడుదలైంది. వెంకటేశ్ పక్కన నటించడం నా అదృష్టం.. ఇప్పటికీ ఆయన నా ఫ్రెండ్‌గా ఉన్నారు. ఈ చిత్ర యూనిట్ అంతా ఒక కుటుంబంలా నన్ను ఆదరించారు. తెలుగు ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. డి రామానాయుడు నిర్మించారు. ఖుష్బు చివరిసారిగా అరణ్మనై-4 చిత్రంలో కనిపించింది.
It's been 38 years since my very first south Indian film released. #KaliyugaPandavalu released on 14th August 1986. I am eternally grateful to my dearest @VenkyMama for being the most precious co star & friend till date. @SureshProdns for treating me like a family.… pic.twitter.com/FOwH0wdrpw
— KhushbuSundar (@khushsundar) August 14, 2024
Comments
Please login to add a commentAdd a comment