
ఛావా(Chhaava )..ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. విక్కీ కౌశల్, రష్మిక(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో రిలీజై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.31 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్(రూ.31 కోట్లు) సొంతం చేసుకున్న చిత్రంగా ఛావా నిలిచింది. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఛావా రికార్డుకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారీ ధరకు ఓటీటీ రైట్స్
ఛావా చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రైట్స్‌ని భారీ ధరకే కొనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. యావరేజ్ టాక్ వస్తే నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ ఊహించని విధంగా భారీ హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంటే ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
ఛావా కథేంటంటే..
ఛత్రపతి శివాజీ మరణం మరాఠా సామ్రాజ్యంపై మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) కన్నేస్తాడు. వారిని ఎదుర్కొని తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు రంగంలోకి దిగుతాడు శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్). ఈ విషయం ఔరంగజేబుకు తెలిసి తానే స్వయంగా సైన్యంతో యుద్ధానికి బయల్దేరుతాడు. శక్తిమంతమైన మొగల్ సేనను శంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ యుద్దంలో సంభాజీకి ఆయన సతీమణి మహారాణి ఏసుభాయి(రష్మిక) ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు? చివరకు మొఘల్ అహంకారాన్ని తన పోరాటంతో ఎలా అణచివేశాడు? అనేది ఈ సినిమా కథ.
Comments
Please login to add a commentAdd a comment