ఇకపై చాను ఐనాక్స్‌లో ఎక్కడైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు.. | Tokyo Olympics: Inox Announces Life Long Free Movie Tickets For Mirabai Chanu | Sakshi
Sakshi News home page

టోక్యో రజత పతక విజేతకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌

Jul 29 2021 4:38 PM | Updated on Jul 29 2021 4:38 PM

Tokyo Olympics: Inox Announces Life Long Free Movie Tickets For Mirabai Chanu - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో దేశానికి రజత పతకం అందించిన మీరాబాయి చానుపై సర్వత్రా ప్ర‌శంస‌ల‌ వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెను మరో బంపర్‌ ఆఫర్‌ వరించింది. చానుకు జీవిత‌కాలం పాటు సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామ‌ని ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌క‌టించింది. టోక్యోలో పతకం గెలిచే ప్ర‌తి భార‌త అథ్లెట్‌కు ఈ ఆఫ‌ర్ వర్తిస్తుందని స్ప‌ష్టం చేసింది. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్ర‌తి అథ్లెట్‌కు ఏడాది పాటు టికెట్లు ఫ్రీగా టికెట్లు ఇస్తామ‌ని పేర్కొంది. ఈ విష‌యాన్ని ఐనాక్స్ త‌మ ట్విట‌ర్‌లో పోస్ట్‌ చేసింది. కాగా, దేశంలో ఐనాక్స్‌కు మొత్తం 648 మ‌ల్టీప్లెక్స్‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, అంతకుముందు డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాను.. జీవితకాలం ఎన్ని పిజ్జాలు తిన్నా ఫ్రీ ఆఫర్‌ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌ పతకం అందుకుంటున్న సందర్భంగా పిజ్జా తినాలనుందని చాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొమినోస్ ఈ మేరకు స్పందించింది. ఇక విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన చానుపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ. 2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించడంతో పాటు ప్ర‌మోష‌న్ కూడా ఇచ్చింది. ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న ఆమెను ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా ప్ర‌మోట్ చేసింది. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా చానుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement