inox theatres
-
క్యూ2లో పీవీఆర్ ఐనాక్స్ జోరు
న్యూఢిల్లీ: మలీ్టప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 166 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 71 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 686 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు దూసుకెళ్లింది. 2023 ఫిబ్రవరి 6నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమలులోకి రావడంతో ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,802 కోట్లుగా నమోదయ్యాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 4.84 కోట్ల మంది సినిమా హాళ్లను సందర్శించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సగటు టికెట్ ధర అత్యధికంగా రూ. 276కు చేరగా.. ఆహారం, పానీయాల సగటు వ్యయం సైతం రికార్డ్ నెలకొల్పుతూ రూ. 136ను తాకింది. ఈ కాలంలో 37 తెరలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో శ్రీలంకసహా 115 పట్టణాలలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 1,702కు చేరింది. అయితే ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో సరైన ఆదరణలేని మొత్తం 33 స్క్రీన్లను తొలగించింది. మరోవైపు పూర్తి ఏడాదిలో 150–160 కొత్త స్క్రీన్ల ఏర్పాటు బాటలో సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో ప్రధానంగా హిందీ సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,742 వద్ద ముగిసింది. -
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: రూ.699కే నెలంతా థియేటర్లో సినిమాలు!
సినీ ప్రేక్షకుల కోసం ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ 'PVR INOX పాస్‌పోర్ట్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేక్షకులను తరచూ థియేటర్లకు లక్ష్యంతో తీసుకొచ్చిన మొదటి సినిమా సబ్స్క్రిప్షన్ పాస్ ఇది. ఈ నెలవారీ సబ్స్క్రిప్షన్ పాస్‌లు అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ ద్వారా కేవలం రూ.699తో నెలకు 10 సినిమాల వరకు చూడవచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. పీవీఆర్ ఐనాక్స్ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం అవి ఏంటంటే.. ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది. ఐమ్యాక్స్, గోల్డ్, లక్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం థియేటర్లకు ఇది వర్తించదు. సినిమా చైన్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి కనీసం మూడు నెలల సబ్స్క్రిప్షన్ వ్యవధికి 'PVR INOX పాస్‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు. రిడీమ్ చేసుకోవడానికి వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ టికెట్లు కొంటున్నట్లయితే, ఒక టికెట్‌కు పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించవచ్చు. ఈ పాస్‌పోర్ట్ అనేది బదిలీ చేయలేని సబ్స్క్రిప్షన్. ఒకరే వినియోగించాల్సి ఉంటుంది. థియేటర్లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఇక ఆహారం, పానీయాల విషయంలోనూ పీవీఆర్ ఐనాక్స్ ఇదివరకే వాటి ధరలను 40 శాతం తగ్గించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ. 99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్ కాంబోలను పరిచయం చేసింది. -
పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది. మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది. -
ఊహించని విధంగా వందల కోట్ల నష్టం.. 50 స్క్రీన్లను మూసేస్తున్న పీవీఆర్?
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 333 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 105 కోట్లకుపైగా నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 536 కోట్ల నుంచి రూ. 1,143 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో పీవీఆర్, ఐనాక్స్ విలీనమై పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6 నుంచి విలీనం అమల్లోకి వచ్చింది. వెరసి అంతక్రితం ఏడాది క్యూ4తో తాజా ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 1,364 కోట్లను దాటాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం రూ. 336 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 3,751 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. రెండు సంస్థలూ కలిపి గతేడాది 168 కొత్త తెరలను ఆవిష్కరించాయి. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం బలపడిరూ. 1,464 వద్ద ముగిసింది. 50 స్క్రీన్లను మూసేస్తున్న కాగా, మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన పీవీఆర్ సంస్థ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఈ ఏడాది పీవీఆర్, ఐనాక్స్ విలీనం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం ఈ ఏడాదిలో పూర్తికావచ్చని అజయ్ బిజిలీ తాజాగా అంచనా వేశారు. విలీనం అనంతరం సంయుక్త సంస్థ ఐదేళ్ల కాలంలో 3,000–4,000 తెరలకు చేరనున్నట్లు పీవీఆర్ చైర్మన్ అజయ్ తెలియజేశారు. గత తొమ్మిది నెలల్లో మూవీలకు తరలివచ్చే ప్రేక్షకులు పెరగడం, ఫిల్మ్ పరిశ్రమ నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకోవడం వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 27న విలీనానికి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తెరతీశాయి. ఇందుకు వాటాదారులు, రుణదాతలు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. జనవరి 12న సమావేశంకానున్న ఎన్సీఎల్టీసహా నియంత్రణ సంస్థల నుంచి విలీనానికి త్వరలోనే ఆమోదముద్ర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
థియేటర్లలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు.. ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం
ఆస్ట్రేలియాకు వెళ్లి టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేని అభిమానులకు ఇదో గుడ్ న్యూస్. మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించే మల్టీప్లెక్స్‌ల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ మేరకు ఐసీసీతో దేశీయ మల్టీప్లెక్స్ దిగ్గజం ఐనాక్స్ ఒప్పందం కదుర్చుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను ఐనాక్స్ తన మల్టీప్లెక్స్‌ల్లో ప్రసారం చేయనుంది. అయితే ఐసీసీతో ఒప్పందం మేరకు ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను దేశంలోని 25 నగరాలకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 25 నగరాల జాబితాను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఐనాక్స్ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ సూపర్-12 మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈనెల 23న భారత్.. తమ తొలి సమరంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆతర్వాత 27న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న గ్రూప్-బిలో తొలి స్థానంలో ఉన్న జట్లతో తలపడనుంది. -
కిక్కు అంటే అదీ! ఆ షేర్లు ‘బ్రహ్మాండం’
సాక్షి,ముంబై: బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్లుమార్కెట్లోకి మల్టీప్లెక్స్ దిగ్గజ కంపెనీలకు జాక్‌పాట్ తగిలింది. ఈ మూవీ బాలీవుడ్ వసూళ్లు రూ.100 కోట్లు దాటడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు ఒక రేంజ్లో పుంజుకున్నాయి. బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వసూళ్లతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. అందులోనూ ఇటీవలి నష్టాలతో షేర్ ధర తక్కువకు అందుబాటులో ఉండటంతో మరింత ఉత్సాహం నెలకొంది. ఫలితంగా పీవీఆర్ షేర్ 4.06 శాతం లేదా రూ.74.45 మేర ఎగిసింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో, ఈ షేర్లు గరిష్టంగా రూ.1,926.20ని తాకాయి. ఐనాక్స్ లీజర్ షేర్లు 4.5 శాతం లేదా రూ. 22.55 పైగా ఎగిసి రూ.516.95 వద్ద ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనాల ప్రకారం శుక్రవారం రూ. 31.5 కోట్లు, శనివారం రూ. 37.5 కోట్లు, ఆదివారం రూ. 39.5 కోట్లు వసూలు చేసింది. ఫైనల్‌గా ఈ లెక్కే ఇంకా ఎక్కువే ఉండవచ్చని కూడా ఆయన అంచనావేశారు. జాతీయ స్థాయిలో మంచి వసూళ్లు సాధిస్తోందని ఆదర్శ్ అన్నారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు డీలాపడటంతో శుక్రవారం, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ దాదాపు 5 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా రణబీర్ కపూర్, అలియా నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మౌని రాయ్‌తోపాటు, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో అలరిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ , మలయాళ భాషలలో విడుదలైంది. 18 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నమోదు చేసింది. అంతేకాదు 'బ్రహ్మాస్త్రా పార్ట్ 2: దేవ్' అనే టైటిల్‌ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు వచ్చాయి. -
పీవీఆర్–ఐనాక్స్ విలీనం వాటిని దెబ్బతీస్తాయ్.. సీసీఐకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చైన్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం పోటీ నిబంధనలను దెబ్బతీస్తాయంటూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) వద్ద ఫిర్యాదు దాఖలైంది. విలీనం కారణంగా సినిమా పంపిణీ పరిశ్రమలో పోటీతత్వానికి తెరపడుతుందంటూ లాభరహిత సంస్థ కన్జూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ(సీయూటీఎస్) ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయవలసిందిగా సీసీఐను అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీన అంశాన్ని ప్రకటించిన విషయం విదితమే. తద్వారా దేశవ్యాప్తంగా 1,500 తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌కు తెరతీసేందుకు నిర్ణయించాయి. దీంతో చిన్న నగరాలు, పట్టణాలలో మరింత విస్తరించే వీలున్నట్లు తెలియజేశాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించనున్న కంపెనీ భవిష్యత్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లను ఇదే బ్రాండుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులకు అధిక టికెట్ ధరలు తదితరాల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని సీసీఐకు దాఖలు చేసిన ఫిర్యాదులో సీయూటీఎస్(కట్స్) అభిప్రాయపడింది. కాగా.. జూన్ 21న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం! చదవండి: స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే! -
ఎట్టకేలకు నెరవేరనున్న కశ్మీరీల కల!
శ్రీనగర్: మిలిటెంట్ దాడులు, ఎన్కౌంటర్లు, భద్రతా దళాల పహారాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది జమ్ము కశ్మీర్లో. అలాంటి చోట కశ్మీరీల చిరకాల కోరిక నెరవేరబోతోంది. దేశంలో మిగతా ప్రాంతాల్లోలాగే.. సరదాగా అయినవాళ్లతో సినిమాలు చూసే అవకాశం కలగబోతోంది అక్కడి ప్రజలకు. ఆ గడ్డపై మొట్టమొదటి మల్టీఫ్లెక్స్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఐనాక్స్ సంస్థ నిర్మించిన ఈ మల్టీఫ్లెక్స్.. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల కోసం అందుబాటులోకి రానుంది. మూడు సినిమా హాల్స్‌తో ఐదువందల మంది సినిమా వీక్షించేలా ఏర్పాటు చేస్తోంది ఐనాక్స్. ఫుడ్ కోర్టుతో పాటు పిల్లల కోసం ప్లే స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. పైగా కశ్మీరీ కల్చర్ ప్రతిబింబించేలా లాబీలు, వుడెన్ వర్క్‌తో ప్రత్యేక ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. అల్లకల్లోల పరిస్థితుల నడుమ 90వ దశకంలో కశ్మీర్లో థియేటర్లు మూతపడ్డాయి. అయితే.. 1999లో తిరిగి వాటిని తెరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. శ్రీనగర్‌లో నీలం, రెగల్, బ్రాడ్వేలు తెర్చుకున్నప్పటికీ.. మిలిటెంట్ల దాడులతో మళ్లీ అవి మూతపడ్డాయి. ఇన్నేళ్ల తర్వాత కశ్మీర్లో ఒక మల్టీఫ్లెక్స్ రాబోతుండడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం దురదృష్టకరం.. సిగ్గుచేటు -
రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ
Ram Gopal Varma Slams PVR, INOX: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్ ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. పీవీఆర్, ఐనాక్స్ డెంజరస్ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నాడు. చదవండి: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే.. కాగా ‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరి వర్మ ట్వీట్‌పై పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. కాగా ఇద్దరు యువుతుల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ డేంజరస్ చిత్రాన్ని రూపొందించాడు. చదవండి: చైతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్ -
సినిమా టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో, ఐనాక్స్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్లైన్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్లైన్లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే -
రూ. 88 కోట్లకు పెరిగిన ఐనాక్స్ లీజర్ నష్టం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మల్టిప్లెక్స్ స్క్రీన్ల ఆపరేటింగ్ సంస్థ ఐనాక్స్ లీజర్ నికర నష్టం మరింత పెరిగి, రూ. 88 కోట్లకు చేరింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ కట్టడిపరమైన ఆంక్షల కారణంగా సినిమా ప్రదర్శన వ్యాపారం దెబ్బతినడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నష్టం రూ. 68 కోట్లు. సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 95 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెరిగాయి. ఐనాక్స్ లీజర్‌కు దేశవ్యాప్తంగా 70 నగరాల్లో 156 మల్టీప్లెక్స్‌ల్లో 658 స్క్రీన్లు నిర్వహిస్తోంది. 2021 జూలై నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చే కొద్దీ క్రమంగా మల్టిప్లెక్స్‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. క్యూ2లో కొత్తగా ఆరు స్క్రీన్లతో రెండు ప్రాపర్టీలు జతయినట్లు ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. అనిశ్చితితో కూడుకున్న పలు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్లో తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణ దిశగా ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. సుమారు 10 శాతం ఆక్యుపెన్సీ రేటు, సగటు టికెట్ ధర రూ. 178, ఒక్కో వ్యక్తి చేసే వ్యయం (ఎస్‌పీహెచ్) రూ. 92గా నమోదైందని, ఇది కోవిడ్ పూర్వ స్థాయికి దాదాపు సమానమని జైన్ చెప్పారు. -
క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 7వ ఎడిషన్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది. ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. మార్క్యూ లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. (చదవండి: AICF: చెస్‌కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..) క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్లో భారీ మెగాప్లెక్స్ ప్రారంభించింది. పీవీఆర్ సినిమాస్ ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.(చదవండి: బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!) -
ఇకపై చాను ఐనాక్స్‌లో ఎక్కడైనా ఫ్రీగా సినిమా చూడొచ్చు..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో దేశానికి రజత పతకం అందించిన మీరాబాయి చానుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. దీంతో పాటు ఆమెకు భారీ స్థాయిలో అవార్డులు, రివార్డులు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెను మరో బంపర్ ఆఫర్ వరించింది. చానుకు జీవితకాలం పాటు సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తామని ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రకటించింది. టోక్యోలో పతకం గెలిచే ప్రతి భారత అథ్లెట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీరితో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతి అథ్లెట్‌కు ఏడాది పాటు టికెట్లు ఫ్రీగా టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని ఐనాక్స్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ఐనాక్స్కు మొత్తం 648 మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. INOX takes immense pride in all the endeavors of #TeamIndia at #Tokyo2020 🌟✨We are happy to announce free movie tickets for lifetime for all the medal winners🏅& for one year for all the other athletes🎟️🎟️#AayegaIndia #INOXForTeamIndia #EkIndiaTeamIndia #Respect #JaiHind 🇮🇳 pic.twitter.com/evaAAJbgKx— INOX Leisure Ltd. (@INOXMovies) July 27, 2021 ఇదిలా ఉంటే, అంతకుముందు డొమినోస్ ఇండియా పిజ్జా వారు కూడా చానుకు లైఫ్‌టైం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాను.. జీవితకాలం ఎన్ని పిజ్జాలు తిన్నా ఫ్రీ ఆఫర్ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పతకం అందుకుంటున్న సందర్భంగా పిజ్జా తినాలనుందని చాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డొమినోస్ ఈ మేరకు స్పందించింది. ఇక విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపాలాడించిన చానుపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ. 2కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఈశాన్య రైల్వేలో పని చేస్తున్న ఆమెను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (స్పోర్ట్స్)గా ప్రమోట్ చేసింది. మరోవైపు మణిపూర్ సర్కార్ కూడా చానుకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించింది. -
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
ఓవర్ ది టాప్
‘సృష్టిలో స్థిరమైనది మార్పు మాత్రమే’ అన్నది గ్రీకు ఫిలాసఫీ. ‘సినిమా’ రంగంలో మార్పు గమనిస్తే... మూకీ సినిమా మాటలు నేర్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ స్టయిలుగా రంగులేసుకుంది. రీలును చుట్టి చిప్‌లో పెట్టారు. ఇది సినిమా తయారవడంలో వచ్చిన మార్పు. సినిమా ఎన్నో సవాళ్లను చూస్తూ వస్తోంది. సినిమా మొదలయినప్పుడు నాటకం నడక వేగం తగ్గిందన్నది నిజం. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది. బుల్లితెరకు అంటుకుపోతున్నవాళ్లను పెద్ద తెరకు తీసుకురావడం కొంచెం కష్టం అవుతోంది. ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్స్ (అమేజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్‌స్టార్, జీ5 వంటివి) వచ్చాయి. ఓవర్ ది టాప్ అంటూ దూసుకొచ్చిన ఈ మాధ్యమం సినిమా బిజినెస్‌ని అధిగమిస్తుందా? ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్ ఈ ఓటీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే వరకే ఓటీటీ ప్రత్యామ్నాయమా? భవిష్యత్తులో థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ను ఓటీటీ ఆపేస్తుందా? లేదంటే ఓటీటీయే భవిష్యత్తా? ఓటీటీకి అందరం అలవాటు పడాలా? ప్రస్తుతం అన్నీ ప్రశ్నలే. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచం స్తంభించింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. షూటింగ్ నుంచి విడుదల వరకూ అన్నీ బంద్. విడుదలకు సిద్ధమైన సినిమాలు పలు కారణాలతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలో విడుదలకు సిద్ధపడ్డాయి. ఇదో సంచలనాత్మకమైన మార్పు. సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పలు మల్టీప్లెక్స్ చైన్ల అధినేతలు, కొందరు పంపిణీదారులు, థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. థియేటరా? ఓటీటీయా? సినిమాను థియేటర్లో చూడాలా? ఎవరింట్లో వాళ్లు ఓటీటీలో చూసుకోవాలా? సినిమా చూడటం అనేది ఓ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో ఒక రెండు వందల మంది సినిమాలోని ఒక ఎమోషన్ని సమానంగా ఫీలవడం. ‘సినిమాను సినిమాలాగా చూడటం థియేటర్లోనే జరుగుతుంది. సినిమాను థియేటర్లోనే అనుభూతి చెందాలి’ అని ఒక వాదన. మరోవైపు ‘ప్రతీ సినిమాను థియేటర్లో చూడలేం. పెరిగే టికెట్ రేట్లను ఫ్యామిలీ అందరం భరించలేం. ఓటీటీలో అయితే అందరూ ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకోవచ్చు. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే థియేటర్‌కి వస్తాం కదా?’ అనేది మరో వాదన. అభిప్రాయాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ‘ఖచ్చితంగా ఇదే కరెక్ట్’ అని ఏదీ చెప్పలేం. ప్రేక్షకుడు సినిమాను థియేటర్లో నలుగురితో చూడాలా? ఏకాంతంగా తన ల్యాప్టాప్లోనా, టీవీలోనా? అనేది తన నిర్ణయం. ప్రస్తుతానికి మాత్రం ఏడు సినిమాలు ‘ఓటీటీ’కి రావడానికి రెడీ అయ్యాయి. ఓటీటీకే మా ఓటు లాక్డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన పలు సినిమాలు మా ఓటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే అని డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఆ చిత్రాల వివరాలు.. పొన్ మగళ్ వందాళ్: ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు మొదట ప్రకటించబడిన తమిళ సినిమా జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’. సూర్య నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్య–జ్యోతిక సినిమాలు థియేటర్స్‌లో ప్రదర్శించం అని స్టేట్మెంట్లు విడుదల చేశారు. అయితే మే 29 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. గులాబో సితాబో: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రల్లో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘గులాబో సితాబో’. ఈ సినిమా జూన్ 12 నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ –‘‘నా కెరీర్లో ఎన్నో మార్పులు, సవాళ్లు చూస్తూ వచ్చాను. డిజిటల్ రిలీజ్ అనేది మరో కొత్త సవాల్’’ అన్నారు. పెంగ్విన్: కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్’. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో కనిపిస్తారు కీర్తి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ను జూన్ 19 నుంచి చూడొచ్చు. కన్నడ చిత్రాలు ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ జూన్ 26, జూలై 24వ తేదీలనుంచి లభ్యమవుతాయి. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ నిర్మాత. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా విద్యా బాలన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. జయసూర్య, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఈ రెండు చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రైమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ విడుదల తేదీలు ప్రకటించలేదు. మార్పు మొదలైన వెంటనే భవిష్యత్తు ఇదే అని తుది నిర్ణయానికి రావడం అన్నిసార్లూ సరి కాదు. సాంకేతికత పెరిగేకొద్దీ సినిమా థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓటీటీ కూడా థియేట్రికల్ బిజినెస్‌కి ఇబ్బంది అవుతుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా మీడియమ్ మారబోతోందా? సినిమాల మీద ఓటీటీ ప్రభావం చూపిస్తుందా? సమాధానాల కోసం వెతకడం కంటే వేచి చూడటమే కొన్నిసార్లు ఉత్తమమేమో? పెద్ద తెర అనుభూతి వేరు – ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్రావు ► ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ టీవీ 65 ఇంచెస్ ఉన్నప్పటికీ థియేటర్లో పెద్ద తెర మీద సినిమాను వీక్షిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ అనుభూతి వేరు. థియేటర్లో దాదాపు 20–40లక్షల ఖర్చుతో ఉన్న సౌండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను వీక్షిస్తే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతగా కలగకపోవచ్చు. ► నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్ రిలీజై హిట్ సాధిస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఈ వసూళ్ల రూపంలో వచ్చేంత డబ్బును ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాతలకు చెల్లించలేవు. ► కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. భవిష్యత్‌లో థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారో? రారో? అనే భయంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాగచైతన్యతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’కి నేను ఒక నిర్మాతను. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మా సినిమాని రిలీజ్ చేస్తాం కానీ ఓటీటీలకు అమ్మాలనుకోవడం లేదు. ► ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉండాలి. షూటింగ్, సినిమాల విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వంటి విషయాలపై ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మొదటి మూడు నెలల్లో విడుదయ్యే సినిమాలకు ప్రభుత్వం ఏదైనా రాయితీ ఇవ్వాలి. జీరో ట్యాక్సేషన్, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వంటి వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్టీప్లెక్స్వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. షూటింగ్‌లు మొదలుపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చని అధికారికంగా ప్రభుత్వం చెబితే, అప్పుడు తక్కువమందితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటాం. ప్రభుత్వ స్పందన కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. నా సపోర్ట్ థియేటర్స్‌కే – నిర్మాత అల్లు అరవింద్ ► అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్ నటించిన సినిమా నుంచి స్టార్ ఆర్టిస్ట్‌లు జ్యోతిక, కీర్తీ సురేష్ వంటి వారు నటించిన సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి.. ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేయడం పై మీ ఒపీనియన్? ఎవరైనా థియేటర్లో విడుదలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా సినిమాలు విడుదల వాయిదా పడుతుండటంతో ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయో? లేదో? పైగా అప్పులపై వడ్డీలు పెరిగిపోతుంటాయి కదా? ఈ కారణాల వల్ల డిజిటల్ రిలీజ్ బెటర్ అనుకునే అవకాశం ఉంది. ► ‘ఆహా’తో మీరూ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు. మరి.. మీరు డిజిటల్ రిలీజ్‌కి ఓకే అంటారా? థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ ఆగేవాళ్లు ఆగుతారు. నా సపోర్ట్ మాత్రం థియేటర్స్‌కే. అయితే ఓటీటీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ► పెద్ద బడ్జెట్ చిత్రాలేమైనా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు మీ దృష్టికి వచ్చిందా? నాకు తెలిసి లాక్‌డౌన్‌కి ముందు రిలీజ్ కావడానికి పెద్ద సినిమాలేవీ రెడీగా లేవు. నాలుగైదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయేమో.. మరికొన్ని చిన్న చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఓ బడా నిర్మాత సినిమా విడుదలకు రెడీ అయింది. లాక్డౌన్ వల్ల అది ఆగింది. ఆ సినిమాకి కూడా ఓటీటీ వాళ్లతో చర్చలు జరిగాయి.. కానీ ‘పెద్ద మొత్తం’ ఇవ్వడానికి ఓటీటీ వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే వడ్డీ భారం ఉన్నా కూడా థియేటర్లోనే విడుదల చేద్దామని ఆ నిర్మాత ఆగారు. ► తక్కువ మందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తమిళ ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి అనుమతులు ఇంకా రాలేదు కదా? అనధికారికంగా కొందరు తక్కువమందితో జాగ్రత్తలు పాటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటిస్తే కొంచెం రిలీఫ్‌గా పని చేసుకుంటారు. ► షూటింగ్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయనుకుంటున్నారు? ఆగస్టు నుంచి మొదలవుతాయనుకుంటున్నాను. అయితే గతంలా ఉండకపోవచ్చు. తక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. అలాంటివాళ్లను ఆదుకోవడానికి ఏదోటి చేయాలి. ► గీతా ఆర్ట్స్ బ్యానర్లోని ప్రస్తుత సినిమాల పరిస్థితేంటి? ప్రస్తుతం మా బ్యానర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ‘జెర్సీ’ హిందీ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయి ఆగిపోయింది. తెలుగులో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 75 శాతం షూటింగ్ అయింది. కార్తికేయతో తీస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా 25 శాతం చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ ముగిశాక ఈ షూటింగ్స్ మొదలుపెట్టడమే. ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించడంతో ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ ఐనాక్స్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘థియేటర్స్– సినిమా నిర్మించేవాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవాళ్లం. ఇలాంటి కష్టకాలంలో రెండు పార్టీలు లబ్ధి పొందే పద్ధతిని కాదనుకుని ఒక పార్టనర్ వేరే పద్ధతిని అనుసరించడం సరికాదనిపిస్తోంది. కష్ట సమయంలో అనుబంధాన్ని వదిలి, ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించినవాళ్లను భవిష్యత్తులో ఆప్తమిత్రుల్లా చూడటానికి లేదు. థియేటర్లో సినిమాను విడుదల చేసే విధానాన్ని మరువకండి. ఎప్పటిలానే కలసి ప్రయాణిద్దాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు అలా ఆలోచించడం సహజం – ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి అంగీకరించిన నిర్మాతలను ఉద్దేశిస్తూ ఎగ్జిబిటర్ సెక్టార్‌లోని మా సహచరులు కొందరు కటువుగా మాట్లాడటం బాధగా ఉంది. ఇప్పట్లో దేశవ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకు తమ సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఎదురుచూడటం అంటే వారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. తిరిగి థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్గాల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. అది సహజం. అయితే సినిమాల థియేట్రికల్ రిలీజ్‌నే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిబిటర్ సెక్టార్‌కు మేం తప్పక సహకారం అందిస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు మా వంతుగా మేం చేయాల్సింది అంతా చేస్తాం. -
థియేటర్లలో నో లైట్స్ ఆఫ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిత్ర పరిశ్రమలో కొత్త శకం ప్రారంభమైంది. ఇక థియేటర్లో సినిమా చూడాలంటే లైట్లు ఆపేయాల్సిన అవసరం లేదు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ ‘ఓనిక్స్’ పేరిట ఎల్ఈడీ తెరలను అభివృద్ధి చేసింది. అమెరికా, మెక్సికో, చైనా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా భారత్‌లో విడుదల చేసింది. మల్టిప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ లీజర్స్‌తో ఒప్పందం చేసుకొని బుధవారం ముంబైలో ‘ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా శామ్సంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ సేథీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గతేడాది కొరియాలో తొలి ఎల్ఈడీ ఆధారిత సినిమా స్క్రీన్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం చైనా, మలేషియా, మెక్సికో, థాయ్‌ల్యాండ్ వంటి దేశాల్లో 26 స్క్రీన్లున్నాయి. ఇండియా విషయానికొస్తే.. ఈ ఏడాది ఆగస్టులో పీవీఆర్ సినిమాతో ఒప్పందం చేసుకొని ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని పీవీఆర్ ఐకాన్‌లో తొలి ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్‌ను ప్రారం భించాం. డిజిటల్ సినిమా ఇనీషియేటివ్ (డీసీఐ) సర్టిఫికేషన్ పొందిన తొలి స్క్రీన్ ఇది. వచ్చే ఏడాది జనవరిలో ముంబైలోని ఫోనిక్స్ మాల్లో రెండో స్క్రీన్‌ను ప్రారంభించనున్నాం. తాజాగా ఐనాక్స్‌తో ఒప్పం దం చేసుకొని ముంబైలోని ఇనార్బిట్ మాల్లో ఎల్ఈడీ తెరను ప్రారంభించాం. ఏడాదిలో 20 తెరలు.. ఇవి కాకుండా పీవీఆర్‌తో మరో రెండు స్క్రీన్స్, ఐనాక్స్‌తో ఒక స్క్రీన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో 20 స్క్రీన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇందుకోసం ఇతర మల్టిప్లెక్స్ చెయిన్స్‌తో సంప్రదింపులు జ రుపుతున్నాం. సినిమా ప్రేక్షకుల స్పందనను బట్టి ఓ నిక్స్ ఎల్ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెం గళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విస్తరిస్తాం. ఓనిక్స్ ప్రత్యేకతలివే.. ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేకత ఏంటంటే? థియేటర్లో ప్రొజెక్టర్ అవసరం ఉండదు. సినిమా కంటెంట్ నేరుగా సర్వర్ నుంచి ఎల్ఈడీ తెర మీద పడుతుంది. సాధారణ తెర మీద కంటే ఓనిక్స్‌లో బొమ్మ 10 రెట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఓనిక్స్‌లో స్పష్టతతో పాటూ వ్యూ, త్రీడీ, సౌండ్ మూడు కేటగిరీలూ మిళితమై ఉంటాయి. దీంతో మొబైల్, టీవీ స్క్రీన్లలో బొమ్మలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో సినిమా తెర మీద కూడా అంతే స్పష్టత ఉంటుంది. త్రీడీ సాంకేతికతతో థియేటర్లో లైటింగ్ ఉన్నప్పుడు కూడా సినిమాను స్పష్టంగా చూడొచ్చు. థియేటర్ అన్ని వైపులా ధ్వని తరంగాలు ప్రసరించి.. థియేటర్లో ఏ దిక్కున కూర్చున్నా సరే శబ్దం అన్ని వైపులా ఒకే విధంగా, స్పష్టంగా వినిపిస్తుంటుంది. ధర రూ.5 కోట్లు సాధారణ స్క్రీన్ నుంచి ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్కు మారడానికి 6–8 వారాలు పడుతుంది. ప్రస్తుతం 5, 10, 14 మీటర్ల తెరల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు తెరల సైజ్‌ను బట్టి రూ.4–5 కోట్ల వరకుంటాయి. 6డబ్ల్యూ రీసెర్చ్ ప్రకారం దేశంలో డిజిటల్ స్క్రీన్ల మార్కెట్ 2022 నాటికి 874 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ స్క్రీన్స్ వ్యాపారంలో శామ్సంగ్కు 50% మార్కెట్ వాటా ఉంది. ఏటా డిజిటల్ సైనేజ్ బిజినెస్ 20% వృద్ధి చెందుతుంటే.. తాము దానికంటే ముందున్నామని పునీత్ తెలిపారు. ఏడాదిలో హైదరాబాద్‌లో 40 ఐనాక్స్ స్క్రీన్స్ మల్టిప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ లీజర్స్.. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా మరో 40 తెరలను ప్రారంభించాలని లకి‡్ష్యంచింది. ప్రస్తుతం నగరంలో 11 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐనాక్స్ తెరలను ప్రారంభించనున్నామని ఐనాక్స్ లీజర్స్ సీఈఓ అలోక్ టాండన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఐనాక్స్కు 67 నగరాల్లో 137 మల్టీప్లెక్స్‌ల్లో 542 స్క్రీన్స్ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో అదనంగా 850 స్క్రీన్ల ఏర్పాటు ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ‘‘లగ్జరీ, సర్వీస్, టెక్నాలజీ ఇదే ఐనాక్స్ సక్సెస్‌కు కారణం. 2012లో లగ్జరీ ప్రొజెక్టర్ స్క్రీన్స్‌తో డిజిటల్లోకి రంగం ప్రవేశం చేశాం. ఆ తర్వాత ఫుడ్ యాప్, కియోస్క్ టికెట్స్ వంటివి సర్వీస్‌లను తీసుకొచ్చాం. తాజాగా ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓనిక్స్ ఎల్ఈడీ స్క్రీన్లను ముంబైతో పాటూ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం’’ అని వివరించారు. -
నోట్ల రద్దు: ప్రజలకు మరో బంపర్ చాన్స్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నగదు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటీఎంల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోలు బంకులు, బిగ్ బజార్లలో డెబిట్ కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకునే అవకాశం కల్పించగా, ఇప్పుడు తాజాగా ఐనాక్స్‌లలో కూడా ఇలాగే కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకోవచ్చని ప్రకటించారు. డబ్బులు డ్రా చేసుకోడానికి ప్రజలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్న సమయంలోనే సరిగ్గా బిగ్‌బజార్, ఐనాక్స్ థియేటర్లు ఈ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ రెండు చైన్లతోను తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టేట్‌బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. దాంతో ప్రజలకు మరింత సులభంగా కరెన్సీ నోట్లు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. బిగ్ బజార్ సంస్థ గురువారం నుంచి నగదు ఇస్తుండటం మొదలుపెట్టగా.. ఐనాక్స్ మాత్రం శుక్రవారం సాయంత్రం నుంచే ముంబైలోని మూడు మాల్స్‌లో డబ్బులు ఇస్తోంది. ఆదివారం నాటికి మరిన్ని థియేటర్లలో డబ్బులు ఇస్తామని ఐనాక్స్ ప్రతినిధి చెప్పారు. దీనిద్వారా డబ్బులు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొంతవరకైనా తీర్చేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు ఐనాక్స్ లీజర్ డైరెక్టర్ సిద్దార్థ జైన్ చెప్పారు. ఇక బిగ్బజార్లలో తమ మాల్స్ పనిచేసినంత సేపూ డబ్బులు ఇస్తూనే ఉంటామని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. డబ్బులు తీసుకోడానికి వచ్చేవాళ్లు మాల్లో ఏమీ కొనాల్సిన అవసరం లేదని.. అది వాళ్ల ఇష్టమని అన్నారు. అలాగే సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లన్నింటిలో కూడా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు.