న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చైన్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం పోటీ నిబంధనలను దెబ్బతీస్తాయంటూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) వద్ద ఫిర్యాదు దాఖలైంది. విలీనం కారణంగా సినిమా పంపిణీ పరిశ్రమలో పోటీతత్వానికి తెరపడుతుందంటూ లాభరహిత సంస్థ కన్జూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ(సీయూటీఎస్) ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయవలసిందిగా సీసీఐను అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీన అంశాన్ని ప్రకటించిన విషయం విదితమే.
తద్వారా దేశవ్యాప్తంగా 1,500 తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌కు తెరతీసేందుకు నిర్ణయించాయి. దీంతో చిన్న నగరాలు, పట్టణాలలో మరింత విస్తరించే వీలున్నట్లు తెలియజేశాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించనున్న కంపెనీ భవిష్యత్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లను ఇదే బ్రాండుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులకు అధిక టికెట్ ధరలు తదితరాల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని సీసీఐకు దాఖలు చేసిన ఫిర్యాదులో సీయూటీఎస్(కట్స్) అభిప్రాయపడింది. కాగా.. జూన్ 21న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుంచి డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం!
చదవండి: స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment