సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌: రూ.699కే నెలంతా థియేటర్‌లో సినిమాలు! | PVR Inox Launches Monthly Subscription Pass At Rs 699 | Sakshi
Sakshi News home page

సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌: రూ.699కే నెలంతా థియేటర్‌లో సినిమాలు!

Published Sat, Oct 14 2023 8:22 PM | Last Updated on Sat, Oct 14 2023 9:05 PM

PVR Inox Launches Monthly Subscription Pass At Rs 699 - Sakshi

సినీ ప్రేక్షకుల కోసం ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్‌ ఐనాక్స్ లిమిటెడ్ 'PVR INOX పాస్‌పోర్ట్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేక్షకులను తరచూ థియేటర్లకు లక్ష్యంతో తీసుకొచ్చిన మొదటి సినిమా సబ్‌స్క్రిప్షన్ పాస్ ఇది.

ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ పాస్‌లు అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్‌ ద్వారా కేవలం రూ.699తో నెలకు 10 సినిమాల వరకు చూడవచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. పీవీఆర్‌ ఐనాక్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం అవి ఏంటంటే..

  • ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది.
  • ఐమ్యాక్స్‌, గోల్డ్, లక్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం థియేటర్లకు ఇది వర్తించదు.
  • సినిమా చైన్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి కనీసం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి 'PVR INOX పాస్‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు.
  • రిడీమ్ చేసుకోవడానికి వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. 
  • ఒకటి కంటే ఎక్కువ టికెట్‌లు కొంటున్నట్లయితే, ఒక టికెట్‌కు పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించవచ్చు.
  • ఈ పాస్‌పోర్ట్ అనేది బదిలీ చేయలేని సబ్‌స్క్రిప్షన్. ఒకరే వినియోగించాల్సి ఉంటుంది.
  • థియేటర్‌లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.

ఇక ఆహారం, పానీయాల విషయంలోనూ పీవీఆర్‌ ఐనాక్స్ ఇదివరకే వాటి ధరలను 40 శాతం తగ్గించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ. 99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్ కాంబోలను  పరిచయం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement