
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం ఈ ఏడాదిలో పూర్తికావచ్చని అజయ్ బిజిలీ తాజాగా అంచనా వేశారు. విలీనం అనంతరం సంయుక్త సంస్థ ఐదేళ్ల కాలంలో 3,000–4,000 తెరలకు చేరనున్నట్లు పీవీఆర్ చైర్మన్ అజయ్ తెలియజేశారు. గత తొమ్మిది నెలల్లో మూవీలకు తరలివచ్చే ప్రేక్షకులు పెరగడం, ఫిల్మ్ పరిశ్రమ నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకోవడం వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 27న విలీనానికి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తెరతీశాయి. ఇందుకు వాటాదారులు, రుణదాతలు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అనుమతించాయి. జనవరి 12న సమావేశంకానున్న ఎన్‌సీఎల్‌టీసహా నియంత్రణ సంస్థల నుంచి విలీనానికి త్వరలోనే ఆమోదముద్ర లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే!
Comments
Please login to add a commentAdd a comment