
ప్రతీకాత్మక చిత్రం
రోమ్ : కరోనా పేరు వినగానే ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుడుతోంది. దాదాపు 115 దేశాల్లో రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా, 4వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. నిన్నటి వరకు 189 ఉన్న మృతుల సంఖ్య 24గంటల్లోనే 1,016కు చేరింది. దాదాపు 15వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పోర్న్‌సైట్ ‘‘పోర్న్‌హబ్’’ తన ఉదారతను చాటుకుంది. తమ అనుబంధ సైట్ ‘‘మోడల్ హబ్’’ నుంచి వచ్చే మార్చి నెల ఆదాయాన్ని కరోనా బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతేకాకుండా ఇటలీలోని వారు పోర్న్‌హబ్ సైట్ ప్రీమియమ్ కంటెంట్‌ను ఈ నెలమొత్తం ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా, పోర్న్‌హబ్‌ను వీక్షిస్తున్న టాప్ 20 దేశాల్లో ఇటలీ 7వ స్థానంలో ఉన్నట్లు గతంలో ఓ సర్వే వెల్లడించింది. పోర్న్‌హబ్ సైట్‌లో గతకొద్దిరోజులుగా హజ్‌మట్ స్యూట్‌లు, మాస్క్‌లు ధరించిన పోర్న్ వీడియోలు ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.
చదవండి : ప్రపంచంపై కరోనా పడగ
Comments
Please login to add a commentAdd a comment