
బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు పాలికె బంపర్ ఆఫర్ అందించనుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురియనుంది. 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత కళ్లుతెరిచే ఆడకూతురికి రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని మేయర్ సంపత్‌రాజ్ గురువారం ప్రకటించారు. ఆ చిన్నారి పేరుతో బీబీఎంపీ కమిషనర్ ఉమ్మడి ఖాతా తెరిచి ఆ నగదును డిపాజిట్ చేస్తామని తెలిపారు.
ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం ఈ నగదును వినియోగించవచ్చునని మేయర్ చెప్పారు. సిజేరియన్ కాకుండా, సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన ఆడపిల్లకు మాత్రమే ఈ అదృష్టం వరించనుంది. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ ఆడపిల్లలు అందరితో సరిసమానంగా నిలబడి పనిచేస్తారని అన్నారు. అలాంటి ఆడపిల్లలు ఎంతో ముఖ్యమని భావించి వారిని ప్రోత్సహించడానికి నజరానా ప్రకటించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment