యమా స్పీడు | Kalyani Priyadarshan part of STR Maanadu | Sakshi
Sakshi News home page

యమా స్పీడు

Published Sun, Mar 24 2019 12:55 AM | Last Updated on Sun, Mar 24 2019 12:55 AM

Kalyani Priyadarshan part of STR Maanadu - Sakshi

కెరీర్‌లో కూల్‌గా, కామ్‌గా దూసుకెళ్తున్నారు మలయాళ బ్యూటీ కల్యాణీ ప్రియదర్శన్‌. దుల్కర్‌ సల్మాన్‌తో ‘వాన్‌’, శివ కార్తీకేయన్‌ సరసన ఓ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్‌ చాన్స్‌ను కొట్టేశారీ మలయాళ కుట్టి. తాజాగా శింబుకు జోడీగా నటించేందుకు ఒప్పుకున్నారట కల్యాణి. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా ‘మానాడు’ అనే పొలిటికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా కల్యాణి నటించనున్నారని తెలిసింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీ ఖన్నా పేరు వినిపించింది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లకు ఇటీవల ఫుల్‌స్టాప్‌ పెట్టారు నిర్మాత ఎస్‌ఆర్‌. ప్రభు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నామని వెల్లడించారు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... శర్వానంద్‌ హీరోగా రూపొందిన ఓ సినిమాలో, సాయిధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’లో కథానాయికగా నటించారు కల్యాణి. అలాగే మలయాళంలో ‘మరక్కార్‌: ది అరేబియన్‌ కడలింటే సింహం’ చిత్రంలోనూ కల్యాణి ఓ కీలక పాత్ర చేశారు. ఇలా తమిళ, తెలుగు, మలయాళం ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తూ కల్యాణి యమా స్పీడ్‌తో ముందుకు వెళ్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement