Karnataka Chief Minister Siddaramaiah
-
దమ్ముంటే నిరూపించండి
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు. -
సిద్ధూపై ఈడీ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది. సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. ‘సేల్ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు. -
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి
‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది. అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... – సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన మరో ΄ోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్ షేర్ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు. -
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రభుత్వోద్యోగులకు ‘స్వగృహా’లు
భారీ రాయితీపై విక్రయం! బండ్లగూడలో చ.అ. రూ.1,900, పోచారంలో చ.అ. రూ.1,700 సాక్షి, హైదరాబాద్: అవి రాజీవ్ స్వగృహ ఇళ్లు.. సాధారణ ప్రజలు కొనాలంటే చదరపు అడుగుకు రూ.2,700 చెల్లించాలి.. ప్రభుత్వ ఉద్యోగులు మా త్రం రూ.1,900 చెల్లిస్తే సరి. ఈ మేరకు భారీ రాయితీపై స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూమి విలువ, పన్నులు, ఇతర చార్జీలు లేకుండా, నిర్మాణ వ్యయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసు కుని కేటాయించబోతోంది. ఇంత తక్కువ ధరకు కేటాయిస్తే తీవ్ర నష్టమని అధికారులు విన్నవిం చినా ఆ ధరలనే ఖరారు చేసింది. వేలాది ఇళ్లు ఖాళీ బండ్లగూడ, పోచారం వెంచర్లలో రాజీవ్ స్వగృహ వేల సంఖ్య లో ఇళ్లను నిర్మించగా వేయికి మించి అమ్మలేకపోయారు. నిధులు లేవంటూ కొన్ని ఇళ్లను అసంపూర్తిగా ఆపేశారు. ఎలాగోలా పూర్తి చేసి అమ్మేందుకు అధికారులు యత్నిస్తున్న తరు ణంలో ఉమ్మడి రాష్ట్రంలో వారిని బదిలీ చేసి కొత్తవారిని నియమించారు. కొందరు నేతలు, ఆ అధికారులు కుమ్మక్కై ఎస్కలేషన్ చార్జీల పేరుతో దాదాపు రూ.వంద కోట్ల వరకు పక్కదారి పట్టిం చారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు తేల్చి సర్దుబాటు పేరుతో ఇళ్ల ధరను ఒక్కసారిగా పెంచారు. మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.2,400 ఉంటే స్వగృహ ధరలను రూ.2,700 మార్చారు. దీంతో వాటిని కొనేం దుకు ప్రజలు ముందుకు రాలేదు. వాటిని తమకు కేటాయిం చాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరగా.. తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. చివరకు ప్రభుత్వం చదరపు అడుగు ధర బండ్ల గూడలో రూ.1,900, పోచారంలో రూ.1,700గా నిర్ధారిం చింది. అసంపూర్తిగా ఉన్నవాటికి రూ.1,700, రూ.1,500 ఖరారు చేసింది. బండ్లగూడలో 2,443, పోచారంలో 1,470 ఇళ్లు విక్రయిస్తారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య గురువారం స్వగృహ ఇళ్లను పరిశీలించారు. ఉన్నఫళంగా ప్రభుత్వ ఉద్యోగు లకు వాటిని కేటాయించాలంటే చేపట్టాల్సిన పనుల గురించి వాకబు చేశారు. -
కాకి వాలిందని కారు మార్చిన సీఎం!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమత్రి సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పెను దుమారం సృష్టించిన 'వాచీ' ఘటన మరవకముందే తాజాగా 'కాకి' కహానీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు అన్నాక కార్లు మార్చడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం సాధారణమే. ఇటీవలి సిద్దూ 35 లక్షల రూపాయలతో కొత్త టొయోటా ఫార్చ్యునర్ కారు కొన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే..అంతకు ముందు ఆయన వాడిన వాహనంపై కాకి వాలిందట. ఆ కాకి వాహనం బొనెట్ పైనే తిష్టవేసిందట. దాన్ని సిబ్బంది తరిమినా వెళ్లకుండా పది నిమిషాల పాటు కారు బోనెట్ పైనే ఉండిపోయిందట. కాగా ఈ సీన్‌ను ఎవరో రికార్డ్ చేశారు. అదే ఇప్పుడు సిద్ధ రామయ్యకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పాత కారుపై కాకి వాలడం వల్లే సిద్ధ రామయ్య కారు మార్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి జాతకాలపై నమ్మకమని... అందుకునే 35 లక్షలు ఖర్చు పెట్టి కారు కొన్నారంటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా జాతకాల పిచ్చితో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో సిద్దరామయ్య వజ్రాలు పొదిగిన ఈ హబ్లాట్ వాచీ ధర రూ. 70 లక్షలు కావడం, ముఖ్యమంత్రికి అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై మీడియాలో బోలెడు కథనాలు వెల్లువెత్తాయి. చివరకు ఈ వ్యవహారం రాష్ట్ర అసెంబ్లీని సైతం కుదిపేసింది. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేతలు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఆశ్రయించారు. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు దాన్ని వదిలించుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి.. ఆ వాచీని అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసి, దాన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
యువతిని వివస్త్రను చేయలేదు
బెంగళూరు ఘటనపై వివరణ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం * ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి * నివేదిక సమర్పించాలని కోరిన కేంద్రం బెంగళూరు/న్యూఢిల్లీ: టాంజానియా యువతిని నడి రోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన దౌత్యపర వివాదంగా మారింది. ‘ఆ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు అరెస్టయ్యారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాతో మాట్లాడారు. ఘటనపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. కాగా, యువతిని వివస్త్రను చేసినట్లు వస్తున్న వార్తలను కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఖండించారు. ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలు, బాధితురాలిని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటకను కేంద్ర హోం శాఖ సూచించింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీలో టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజీ కోరారు. కాగా, జాన్ కిజాజీతో కూడిన బృందం శుక్రవారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సిద్ధరామయ్యను వివరణ కోరిన రాహుల్ యువతిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం సిద్ధరామయ్యను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ కోరినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాహుల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ టాంజానియా యువతిపై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ను బీజేపీ దుయ్యబట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నగరానికి అపకీర్తి తెచ్చిందని పేర్కొంది. కర్ణాటక డీజీపీని వెంటనే బదిలీ చేయాలని, సంబంధిత పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. -
తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి
తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.